MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • HBD Mahesh Babu: మహేష్-నమ్రతల లవ్ స్టోరీలో సినిమాకు మించిన ట్విస్ట్స్... ఆమె లేకపోతే పెళ్లి అయ్యేది కాదట!

HBD Mahesh Babu: మహేష్-నమ్రతల లవ్ స్టోరీలో సినిమాకు మించిన ట్విస్ట్స్... ఆమె లేకపోతే పెళ్లి అయ్యేది కాదట!

టాలీవుడ్ టాప్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు నేడు. 1975 ఆగస్టు 9న జన్మించిన మహేష్ బాబు నేడు 47వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కృష్ణ వారసుడిగా వెండితెరకు పరిచయమైన తండ్రికి తగ్గ తనయుడు అనిపించారు. ఒక విధంగా చెప్పాలంటే కృష్ణ కంటే ఓ మెట్టు ఎక్కువే ఎదిగారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Aug 09 2022, 10:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఆయన స్టైల్, హ్యాండ్ సమ్ నెస్, యాక్టింగ్ తిరుగులేని స్టార్ గా నిలబెట్టాయి. ఇక సామాజిక సేవతో రియల్ హీరోలు అనిపించుకున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకున్న మహేష్ బాబు, వేయి మందికి పైగా చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ చేయించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

వీటన్నింటికీ మించి మహేష్ ఓ మంచి హస్బెండ్, ఫాదర్. సూపర్ స్టార్ గా క్షణం తీరిక లేకుండా గడిపే మహేష్ కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. తన బిజీ షెడ్యూల్స్ లో కుటుంబానికి సమయం కేటాయిస్తారు. విరామం దొరికితే భార్యాపిల్లలతో విహారాలకు వెళ్లడం మహేష్(Mahesh Babu Birthday) కి చాలా ఇష్టం. అలాగే ఇంట్లో సితార, గౌతమ్ తో సరదా ఆదుకోవడం మహేష్ కి ఇష్టమైన వ్యాపకం.

38

కాగా మహేష్(Mahesh Babu Love Story) ప్రేమ వివాహం అప్పట్లో ఓ సంచలనం. అమ్మాయిల కలల రాకుమారుడైన మహేష్ ని పడేసిన ఆ అమ్మాయి ఎవరని? పెద్ద చర్చ నడిసింది. ఇక మహేష్ ప్రేమ కథలో సినిమాకు మించిన డ్రామా, ట్విస్ట్స్ చోటు చేసుకున్నాయి. చాలా రిజర్వుడుగా ఉండే మహేష్.. హీరోయిన్ నమ్రతను ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం అనూహ్య పరిణామం. 
 

48

పలు సందర్భాల్లో మహేష్, నమ్రత(Namrata Shirodkar) తమ ప్రేమ, పెళ్లి గురించి స్పందించారు. ఆనాడు జరిగిన ఆసక్తికర సంఘటనలు వివరించారు. హీరోగా మహేష్ మూడవ చిత్రం వంశీ. దర్శకుడు బి గోపాల్ తెరకెక్కించిన ఈ మూవీ హీరోయిన్ గా నమ్రత శిరోద్కర్ ని ఎంచుకున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన వంశీ షూటింగ్ సమయంలో మహేష్-నమ్రత మధ్య ప్రేమ చిగురించింది.

58


వంశీ మూవీ షూటింగ్ కోసం చిత్ర యూనిట్ న్యూజిలాండ్ వెళ్లారు. దాదాపు 25 రోజులు అక్కడ షూటింగ్ జరిగింది. ఆ సమయంలోనే నమ్రత, మహేష్(Mahesh Babu) ప్రేమలో పడ్డారు. సినిమాకు అదే చివరి షెడ్యూల్ కాగా... షూటింగ్ పూరైతే ఇకపై కలుస్తామా లేదా? అనే వేదన ఇద్దరిలో ఉంది. ఆలస్యం చేయడం మంచిది కాదని గ్రహించిన నమ్రత ముందుగా మహేష్ తో తన ప్రేమ వ్యక్తీకరించారట. అప్పటికే నమ్రత అంటే ఇష్టం పెంచుకున్న మహేష్ వెంటనే ఓకే చెప్పారట. 

68


వంశీ మూవీ 2000లో విడుదల కాగా... ఐదేళ్లు మహేష్-నమ్రత రహస్యంగా ప్రేమించుకున్నారు. వీరి గురించి ఎలాంటి ఎఫైర్ రూమర్స్ బయటికి రాకపోవడం విశేషం. 2005 ఫిబ్రవరి 10న అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా వివాహం జరిగింది. మహేష్ రహస్యంగా నమ్రతను వివాహం చేసుకున్నారన్న వార్తలు సంచలనం రేపాయి. 

78

ఇక ఈ వివాహం వెనుక మహేష్ సిస్టర్ మంజుల కృషి ఎంతగానో ఉందట. నమ్రతతో వివాహానికి కృష్ణగారు ఒప్పుకోలేదట. ఆయనను ఒప్పించే బాధ్యత తీసుకున్న మంజుల ఆ పని విజయవంతంగా నిర్వహించి కీలక పాత్ర వహించారు.

88

మహేష్ కోసం తన కెరీర్ కి గుడ్ బై చెప్పేసింది నమ్రత. ఓ సాధారణ గృహిణిగా మారి గొప్ప ఇల్లాలుగా పేరు తెచ్చుకున్నారు. మహేష్, నమ్రత అంత ఆదర్శ దంపతులు వేరొకరు ఉండరేమో... కాగా మహేష్ కంటే నమ్రత వయసులో పెద్దది కావడం విశేషం.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi: ఇరుముడి మూవీకి చిరంజీవి రివ్యూ, ఇండస్ట్రీ ఏ కొందరిదో కాదు..మెగాస్టార్ నుంచి అస్సలు ఊహించని కామెంట్
Recommended image2
Vishwak Sen Legacy: రాజకీయ వారసత్వాన్ని ఇచ్చిన తండ్రినే ద్వేషించే కొడుకు.. విశ్వక్ సేన్‌ `లెగసీ` వచ్చేది అప్పుడే
Recommended image3
Chiranjeevi: చిరంజీవి సినిమా గాలి తీసిన నటుడు, ఇదేమన్నా భీమవరం అనుకున్నావా..ప్రొడ్యూసర్ స్ట్రాంగ్ వార్నింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved