రాజమౌళి సినిమాకు మహేష్ బాబు రెమ్యునరేషన్ లో బిగ్ ట్విస్ట్, సూపర్ స్టార్ ప్లాన్ ఏంటంటే..?
రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబు మూవీ త్వరలో స్టార్ట్ కాబోతోంది. పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కబోతున్న ఈసినిమా కోసం మహేష్ బాబు ఏంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా..? ఇందులో ఉన్న బిగ్ ట్విస్ట్ ఏంటంటే..?
సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ వరల్డ్ మూవీ త్వరలో స్టార్ట్ కాబోతోంది. ఎప్పుడెప్పుడా అని మహేష్ ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అసలు ఈసినిమా గురించి ఎప్పుడు అప్ డేట్ ఇస్తారా అని అంతా వెయిట్ చేస్తుంటే.. మూవీ టీమ్ మాత్రం ఏమాత్రం చడీ చప్పుడు లేకుండా కామ్ గా ఉన్నారు.
Also Read: ఎన్టీఆర్ వల్లే నష్టపోయాం.. కోలుకోలేని దెబ్బ తగిలింది.. ఈటీవి ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు
ఇక ఈక్రమంలో ఈసినిమా గురించి, మహేష్ బాబు క్యారెక్టర్ గురించి, కథ గురించి, అడ్వెంచర్ల గురించి, షూటింగ్ లొకేషన్ల గురించి.. హాలీవుడ్ బిజీనెస్ గురించి..ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి కాగా ప్రస్తుతం రాజమౌళి సినిమాలో మహేష్ బాబు నటిస్తున్నందుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడు అనే విషయం హాట్ టాపిక్ నడుస్తోంది.
Also Read: 1200కు గార్మెంట్ ఫ్యాక్టరీలో పని చేసిన సూర్య.. స్టార్ హీరో ఎలా అయ్యాడు..?
మహేష్ బాబు రెమ్యునరేషన్ పాట్రెన్ డిఫరెంట్ గా ఉంటుంది. కొన్నిసినిమాలకు పారితోషికం తీసుకుంటే.. మరికొన్ని సినిమాలకు లాభాల్లో శేర్ చతీసుకుంటాడు. కొన్ని సినిమాలు ఆయనే నిర్మిస్తాడు. ఇలా ఆయన రెమ్యునరేషన్ విషయంలో డిఫరెంట్ స్టైల్ నుమెయింటేన్ చేస్తుంటారు. సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట, శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం సినిమాల విషయంలో కూడా మహేష్ బాబు ఇదే పద్ధతిని అనుసరించారు.
Also Read: ప్రభాస్ - సమంత కాంబినేషన్ లో సినిమా రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?
అయితే బ్రహ్మోత్సవం సినిమా మినహాయించి అన్ని సినిమాలకు ఆయన లాభాలు పొందాడు. ఈసినిమా మాత్రం డిజాస్టర్ అవ్వడంతో నష్టం చూడకతప్పలేదు. అయితే రాజమౌళి సినిమా విషయంలో కూడా మహేష్ బాబు రెమ్యునరేషన్ తీసుకోవడంలేదని తెలుస్తోంది. ఈసినిమా ఖచ్చితంగా పాన్ వరల్డ్ హిట్ అవ్వడం ఖాయం అని మహేష్ కు నమ్మకం ఉంది.
Also Read: ఐశ్వర్య రాయ్ ను గాఢంగా ప్రేమించిన సౌత్ హీరో ఎవరో తెలుసా..?
ఎలాగు హీరో ఖర్చులు, హీరోటీమ్ ఖర్చులు నిర్మాత భరిస్తాడు కాబట్టి.. సినిమా రిలీజ్ తరువాత వచ్చే లాభాల్లో వాటా తీసుకోవాలి అని చూస్తన్నాడట మహేష్. ఇప్పటి వరకూ మహేష్ కు ఇలా తీసుకుంటున్న సినిమాల ద్వారా70 కోట్ల వరకూ రెమ్యునరేషన్ ఫిక్స్ డ్ గా వస్తోందట. అయితే రాజమౌళి సినిమాకు ఎటు కాదనుకున్నా.. 250 కోట్ల వరకూ మహేష్ బాబుకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఈలెక్కన మహేష్ బాబు ముందు ముందు మూడు వందల్లు.. ఐదువందల కోట్ల హీరో అయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. జక్కన్న సినిమా వర్కౌట్ అయితే.. ఇప్పటి వరకూ ఉన్న పాన్ ఇండియా స్టార్ ను కూడా వెనక్కు నెట్టి ఆయన ముందు కూర్చునే అవకాశం లేకపోలేదు. చూడాలి మరి
ఈమూవీ ఏమౌతుందో. ఇక ఈమూవీకి సబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యిందని సమాచారం. మరి ఎప్పుడు మూవీ ఓపెనింగ్ ఉంటుందోచూడాలి. మహేష్ బాబు హాలీవుడ్ హీరో రేంజ్ లో తన లుక్స్ ను చేంజ్ చేసుకున్నాడు. కంప్లీట్ గా ఆయన లుక్ ఇంకా బయటకు రావాల్సి ఉంది.