ఎన్టీఆర్ వల్లే నష్టపోయాం.. కోలుకోలేని దెబ్బ తగిలింది.. ఈటీవి ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వల్ల నష్టపోయాం అంటున్నాడు బుల్లితెర మెగాస్టార్ ఈటీవి ప్రభాకర్. ఇంతకీ తారక్ వల్ల వారు నష్టపోయింది ఏంటి..?
ఈటీవి ప్రభాకర్ గుర్తున్నాడా..? బుల్లితెరపై మెగాస్టార్ అనిపిలిపించుకున్న ఈ వ్యక్తి... రుతురాగాలు సీరియల్ అప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. ఈటీవీలో ఎన్నో సీరియల్స్ తో పాటు రియాల్టీ ఫోస్ కూడా చేశాడు.. ఆతరువాత బుల్లితెరపై రకరకాల సీరియల్స్ లో... రకరకాల పాత్రుల చేసి మెప్పించాడు. సినిమాల్లో అవకాశాలు వచ్చినా.. అవి ప్రభాకర్ కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు.
Also Read: ప్రభాస్ - సమంత కాంబినేషన్ లో సినిమా రాకపోవడానికి కారణం
బుల్లితెరపై వచ్చినంత స్టార్ డమ్ రాలేదు. దాంతో తన తనయుడిని అయినా సినిమాల్లో స్టార్ గా చూసుకోవాలి అనుకున్నాడు ప్రభాకర్. తన వారసుడిగా చంద్రహాస్ ను రంగంలోకి దింపాడు. ఇక ఈ కుర్ర హీరో ఒక సినిమా రిలీజ్ కాకముందే తన తేడా వ్యావహారంతో ట్రోలింగ్ మెటీరియల్ గా నిలిచాడు.
Also Read:హీరో మీద కోపంతో షూటింగ్ నుంచి వచ్చేసిన త్రిష
ఫస్ట్ సినిమా లాంచింగ్ టైమ్ లోనే మనోడు నిలుచునే స్టైల్, వంకర చూపులు., లెక్కలేని తనం, నా అంత టాలెంటెడ్ ఎవరూ లేరు అన్నట్టుగా బిహేవ్ చేయడం.. సోషల్ మీడియా ట్రోలర్స్ కు మంచి స్టఫ్ గా నిలిచింది. దాంతో చంద్రహాస్ ఈ ట్రోలింగ్ ను కూడా తనకు అనుకూలంగా మలుచుకోవడం స్టార్ట్ చేశావు. తన పేరుకు పక్కన యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ అని పెట్టేసుకున్నాడు.
Also Read: ఐశ్వర్య రాయ్ ను గాఢంగా ప్రేమించిన సౌత్ హీరో ఎవరో తెలుసా..?
ఇక ఈ హీరో చేసే పనులు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. కాగారీసెంట్ గా ఈ కుర్ర హీరో నటించిన రామ్ నగర్ బన్నీ సినిమా రిలీజ్ అయ్యి నెంబర్ బన్ డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈమూవీ గురించి మాట్లాడుతూ... ప్రభాకర్ కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. అది కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ఇన్వావ్ చేస్తూ ప్రభాకర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read:మణికంఠ కు బంపర్ ఆఫర్, బిగ్ బాస్ ను వదిలిన.. గోల్డెన్ ఛాన్స్
తన కొడుకు తాను హీరోను అవుతానని చెప్పడంతో యాక్టింగ్ ట్రైయినింగ్ ఇప్పించానని.. అయితే అతనిలో టాలెంట్ చూసి.. నిర్మాతలు సినిమా చేయడానికి పోటీపడ్డారని ఆయన అన్నారు. ఇక రెండు సినిమాలు అలానే చేశాడని.. కాని కమర్షియల్ హీరోగా ఎదగాలని.. ఈ రామ్ నగర్ బన్నీ సినిమాను తానే స్యయంగా నిర్మించాన్నారు. ఈసినిమా కోసం ముందుగా అనుకున్న బడ్జెట్ రెండు కోట్లు... కాని చివరకు అది 5 కోట్లు అయ్యింది.
సినిమా బాగా రావడంతో కలెక్షన్స్ కూడా గట్టిగా వస్తాయని అనుకున్నాను. సినిమా రిలీజ్ తరువాత పాజిటీవ్ రివ్యూస్ వచ్చాయి.. కాని అదే టైమ్ లోఎన్టీఆర్ దేవర సినిమా రిలీజ్ అవ్వడం.. ఆ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో.. మా సినిమాను చూసేవారు లేకుండాపోయారు. దాంతో చాలా నష్టపోవల్సి వచ్చింది. చాలా పెద్ద దెబ్బ తగిలింది అన్నారు ప్రభాకర్. దేవర సినిమా రిలీజ్ తో చంద్రహాస్ సినిమా కనిపించకుండాపోయింది.