- Home
- Entertainment
- Guppedantha Manasu: కిడ్నాప్ కు గురైన రిషి.. ప్రమాదం నుంచి కొడుకుని కాపాడుకున్న మహేంద్ర!
Guppedantha Manasu: కిడ్నాప్ కు గురైన రిషి.. ప్రమాదం నుంచి కొడుకుని కాపాడుకున్న మహేంద్ర!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. కొడుక్కి ప్రమాదం ఉందని తెలిసి అతనిని రక్షించుకోవడానికి తపన పడుతున్న ఒక తండ్రి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఆగస్టు 2 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో ఫ్లెక్సీ షాపు బయట వెయిట్ చేస్తూ ఇంట్లో ఉండవలసిన ఫోటోలు అటెండర్ చేతికి ఎలా వచ్చాయి.. వసుధార చెప్పింది నిజమేనా.. అయినా నన్ను ఎటాక్ చేయవలసిన అవసరం ఎవరికీ ఉంది. గతాన్ని, బంధాన్ని అన్ని వదిలేసుకుని వచ్చేసాను కదా ఇంకా నా దగ్గర ఏముంది అని ఆలోచనలో పడతాడు రిషి. అంతలోనే పరిగెత్తుకుంటూ అటెండర్ అక్కడికి వస్తాడు.
అక్కడ రిషి ని చూసి అతనికి కనిపించకుండా వెనక్కి వెళ్ళిపోతాడు. శైలేంద్ర కి ఫోన్ చేసి ఫోన్ చేస్తున్నది నేనే సార్ ఆ అమ్మాయి దగ్గరనుంచి ఫోన్ లాగేసుకున్నాను ఇప్పుడు ఫ్లెక్సీ షాప్ దగ్గర రిషి సార్ ఉన్నారు ఏం చేయాలి అని అడుగుతాడు. ఎవరికి తెలియకూడదు వారికే తెలిసేలాగా చేశావు ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు ఎవరి దగ్గర భయపడవలసిన అవసరం లేదు వాడిని లేపెయ్ అంటాడు శైలేంద్ర.
అటెండర్ ఒక్కసారిగా షాకవుతాడు. అప్పుడు శైలేంద్ర నేను కొందరి రౌడీలను పంపిస్తాను వాళ్లకి రిషి ని చూపించు చాలు అంటాడు. సరే అని ఫోన్ పెట్టేస్తాడు అటెండర్. మరోవైపు టెన్షన్ పడుతూ ఉంటుంది వసుధార అక్కడికి మహేంద్ర వచ్చి పరిస్థితిని కనుక్కొని రిషి ఏడి అని అడుగుతాడు. రిషి ఎక్కడికి వెళ్ళాడు వాసు గారికి కూడా తెలియదు కానీ ప్రిన్సిపల్ కి ఫోన్ చేసి రిషి గురించి వాకబు చేస్తుంది.
రిషి ఎక్కడికి వెళ్ళాడో చెప్పిన ప్రిన్సిపల్ ఏమైంది మేడమ్ ఎందుకు కంగారు పడుతున్నారు అని అడుగుతాడు. అలాంటిదేమీ లేదు అని చెప్పి ఫోన్ పెట్టేసి మహేంద్ర తో సార్ ఎక్కడున్నారు తెలిసింది ముందు పదండి అని గబగబా కార్లో కూర్చుంటుంది వసుధార. మహేంద్ర కూడా అంతే ఫాస్ట్ గా కార్ ముందుకు తీస్తాడు. అదే సమయంలో రౌడీలకి రిషి ని చూపిస్తాడు అటెండర్. ఇంక నువ్వు వెళ్ళు వాడి సంగతి నేను చూసుకుంటాం అని చెప్పి రిషి దగ్గరికి వెళ్లి బలవంతంగా అతని చేతులు కట్టేసి కార్లో తోసేసి తీసుకొని వెళ్ళిపోతారు.
గొడవ విని ఫ్లెక్సీ షాపు ఓనర్ కంగారుగా బయటికి వస్తాడు. కానీ అప్పటికే రౌడీలు రిషిని తీసుకుని వెళ్ళిపోతారు. ఆ వెనకనే మహేంద్రవాళ్లు వస్తారు. వసుధార ని చూసి మీరు ఆల్బమ్ లో ఉన్న ఆవిడే కదా మీతో ఉన్నతనని ఇప్పుడే రౌడీలు తీసుకెళ్లి పోతున్నారు అని దారి చూపిస్తాడు ఫ్లెక్సీ షాప్ అతను. కంగారుపడుతూ షాపతను చెప్పిన వైపు వెళ్తారు మహేంద్ర వాళ్ళు. మహేంద్ర తెగించేసాడు ముందు అర్జెంటుగా పోలీసులకి ఫోన్ చెయ్యు అని వసుధారకి చెప్తాడు మహేంద్ర.
ఆమె అలాగే చేస్తుంది. మీరేమీ కంగారు పడకండి మేం బయలుదేరుతున్నాను అని పోలీసులు కూడా చెప్పిన దగ్గరికి బయలుదేరుతారు. ఇంతలో కారులో పెనుగలాడుతున్న రిషి అందులో ఉన్న వాళ్ళందరినీ బయటికి నెట్టేస్తాడు. వాళ్లతో కాసేపు ఫైట్ చేస్తాడు కానీ వాళ్ళు మత్తుమందు ఇవ్వడంతో వాళ్ల చేతులకి దొరికిపోతాడు రిషి. కరెక్ట్ గా అతనిని కత్తితో పొడిచే సమయానికి మహేంద్ర, వసుధార అక్కడికి వస్తారు. రిషిని వసుధార పట్టుకుంటే రౌడీలతో ఫైట్ చేస్తాడు మహేంద్ర.
ఇంతలో పోలీసులు కూడా రావడంతో రౌడీలు పారిపోతారు. వాళ్ల సంగతి ఏం ఏం చూసుకుంటాము మీరు అతనిని తీసుకొని వెళ్ళండి అని మహేంద్ర వాళ్లకు చెప్పి రౌడీలని ఫాలో అవుతారు పోలీసులు. రిషిని కార్లో కూర్చోబెట్టుకొని మా ఇంటికి తీసుకు వెళ్ళండి సార్ అంటుంది వసుధార. వద్దమ్మా రిషి కోప్పడతాడేమో విశ్వనాథం గారి ఇంటికి తీసుకు వెళ్దాము అంటాడు మహేంద్ర. వద్దు సార్ ఆయన కంగారు పడతారు నన్ను తిట్టినా పర్వాలేదు కానీ ఆయన క్షేమంగా ఉండాలి.
దయచేసి మా ఇంటికి తీసుకెళ్లండి అంటుంది వసుధార. అదే సమయంలో జగతి ఫోన్ చేస్తే జరిగిందంతా చెప్పి రిషి సేఫ్ గానే ఉన్నాడు అని చెప్తాడు మహేంద్ర. ప్రమాదం తప్పినందుకు ఆనందపడుతుంది జగతి. మరోవైపు ప్లాన్ మిస్ చేసినందుకు రౌడీల మీద కోప్పడతాడు శైలేంద్ర. మరోవైపు రిషి ని తన ఇంటికి తీసుకువచ్చి సేవలు చేస్తుంది వసుధార. ఇంతలో రిషి కి మెలకువ రావటంతో ఏం జరిగింది? ఎక్కడ ఉన్నాము అని తండ్రిని అడుగుతాడు రిషి. వసుధార వాళ్ళ ఇంటికి వచ్చాము అని చెప్తాడు మహేంద్ర. ఎక్కడికి ఎందుకు తీసుకువచ్చారు నాకు ఇక్కడ ఒక నిమిషం కూడా ఉండటం ఇష్టం లేదు అని చెప్పే గబగబా మంచం దిగిపోతాడు రిషి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.