- Home
- Entertainment
- Guppedantha Manasu: నా భార్యను వదిలేసి నేను రాను.. రిషీకి ఊహించని షాకిచ్చిన మహేంద్ర?
Guppedantha Manasu: నా భార్యను వదిలేసి నేను రాను.. రిషీకి ఊహించని షాకిచ్చిన మహేంద్ర?
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ తల్లి కొడుకుల అనుబంధం నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంటుంది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

దేవయాని రిషి (Rishi) ఇంట్లో లేనప్పుడు నీకు ఇంట్లో ఏం పని అని వసును అంటుంది. దాంతో వసు.. మహేంద్ర సార్ పంపారు అని అడుగుతుంది. అంతే కాకుండా మహేంద్ర సార్ బుక్స్, వస్తువుల కోసం వచ్చాను అని ధరణి తో చెబుతుంది. ఆ క్రమంలో నీ లాంటి కోడలు పిల్ల ఈ ఇంటికి వస్తే అప్పుడు ఉంటుంది అత్తయ్య గారికి అని ధరణి (Dharani) మనసులో అనుకుంటుంది.
ఇక గదిలోకి వచ్చాక వసు రిషి (Rishi) సార్ తో ఎలాగైనా మహేంద్ర గారిని ఈ ఇంటికి తీసుకు రమ్మని చెప్పండి అని అంటుంది. ఇక ఆ తరువాత రిషి రూంలో కు వెళ్లిన వసు (Vasu) రిషి దాచుకున్న వసుకు సంబంధించిన వస్తువులను చూసి మురిసి పోతుంది. ఇక ఈలోపు అక్కడకు రిషి వచ్చి వసును చూసి కొంచెం ఆశ్చర్యపోతాడు.
ఆ తర్వాత వసును రిషి (Rishi) ఎక్కిరించినట్లుగా మాట్లాడతాడు. ఇక వస్తువులన్నీ చూసిందా.. ఇవన్నీ ఎక్కడ దాచాలి అని ఆలోచిస్తాడు. మరోవైపు దేవయాని ధరణిని నానా మాటలతో ఆడిపోసుకుంటుంది. ఇక ఫనింద్ర భూపతి (Phanidra bhupathi) ఎప్పుడు కోడలని ఎదో ఒకటి అనక పోతే నీకు తోచద అని అంటాడు.
ఆ క్రమంలో ధరణి (Dharani) ఇక మీ ఆటలు సాగవు అత్తయ్య గారు అని అంటుంది. అంతేకాకుండా రిషి కూడా మిమ్మల్ని పెద్దగా పట్టించుకోవడం లేదు అని మనసులో అనుకుంటుంది. ఆ ఆలోపు దేవయాని (Devayani) దంపతులు చిన్న క్లాష్ పెట్టుకొని భోజనం తినకుండా వెళ్ళిపోతారు.
ఇక జగతి మహేంద్ర (Mahendra) లు కారులో వెళుతూ ఉంటారు. మహేంద్ర పుట్టిన రోజు కనుక ఇది వరకు జరిగిన పుట్టిన రోజులకు తను లేనందుకు జగతి బాధపడుతుంది. ఇక ఆ క్రమంలో మహేంద్ర రిషి (Rishi) ప్రేమించడం మొదలు పెడితే చాలా బాగా ప్రేమిస్తాడు అని చెబుతాడు.
ఇక తరువాయి భాగంలో రిషి (Rishi) డాడ్ నేను బర్త్ డే సెలబ్రేషన్స్ మీతో జరుపుకోవాలి అని మహేంద్ర తో అంటాడు. దాంతో మహేంద్ర నా భార్యను వదిలేసి నేను బర్త్డే సెలబ్రేషన్ జరుపుకున్నాను అన్న గిల్టీ ఫిలింగ్ నాకు అవసరం లేదు అని మహేంద్ర (Mahendra) మొహం మీద చెబుతాడు. దాంతో రిషి ఆ మాటలను తట్టుకోలేకపోతాడు.