Guppedantha Manasu: రిషి, మహేంద్ర మధ్య దూరం.. మైండ్ గేమ్స్ ఆడుతున్న దేవయాని!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఒక తల్లి ప్రేమ అనే కాన్సెప్ట్ తో ఈ సీరియల్ ప్రసారమవుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. రిషి (Rishi) వాళ్ళ నాన్న విషయంలో వసును ఒక సలహా అడుగుతాడు.

అంతేకాకుండా ఒక స్టూడెంట్ గా కాకుండా ఒక ఫ్రెండ్ గా సలహా చెప్పు అని అడుగుతాడు. దాంతో వసు (Vasu) ఒకసారిగా ఆశ్చర్యపోతుంది. అదే క్రమంలో ఇద్దరూ వదిలి వెళ్ళితే ఆ తప్పు నాదా.. వాళ్ళదా.. అని రిషి వసును అడుగుతాడు. దానికి వసుకు ఎం చెప్పాలో అర్ధంకాదు. అంతేకాకుండా అమ్మ లేదని ఒకప్పుడు ఏడ్చాను. ఇప్పుడు నాన్న లేడు అని ఏడవ లేను కదా అని రిషి (Rishi) అంటాడు.
మరోవైపు జగతి (Jagathi) మహేంద్రకు అన్నం వడ్డించగా తినకుండా గుర్తుకొస్తున్నాడు జగతి అని అంటాడు. అంతేకాకుండా వాడు తిన్నాడో లేదో అని మనసులో అనుకుంటాడు. అదే క్రమంలో మహేంద్ర అన్నం తినే ముందు రిషి (Rishi) విలువ ఏంటో తెలుసుకుంటాడు.
ఆ తర్వాత మహేంద్ర (Mahendra) మనందరం కలుస్తామని ఆశ తో ఉంటున్న జగతి అని అంటాడు. ఇక వసును డ్రాప్ చేయడానికి వచ్చిన రిషి తాను కూడా లోపలికి వచ్చి మనుషుల మీద ఉన్న కోపం మందుల మీద చూపించవద్దను వసుధార (Vasudhara) అని అంటాడు.
ఇక ఆ మాట చెప్పి రిషి (Rishi) అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మహేంద్ర వసును నువ్వు వాడి పక్కనే ఉండమ్మ వాడు ఎవరి మాట అయినా విన్నాడు అంటే అది నీ మాట అని అంటాడు. దాంతో వసు (Vasu) మనసులో ఒక్కసారిగా ఆలోచన వ్యక్తం చేస్తుంది.
ఆ తరువాత రిషి (Rishi) అన్నం తినకపోగా దేవయాని నువ్వు తినకుండా నేను తినలేను నాన్న అని చేతులు కడిగేస్తుంది. దాంతో రిషి అక్కడినుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత గౌతమ్ (Goutham) రిషి ను చూస్తే కోపం వస్తుంది వదిన.. ఏమి చెప్పడు అన్నీ మనసులో దాచుకుంటాడు అని అంటాడు.
ఇక రిషి (Rishi) అన్నం తినకుండా కాలేజీ కి వెళ్తాడు. అది తెలుసుకున్న వసుధార రిషి కోసం అన్నం పెట్టుకొని వెళుతుంది. కానీ రిషి తినడానికి ఇష్టపడడు. ఇక వసు.. అన్నం తింటే మహేంద్ర (Mahendra) సార్ గురించి రెండు విషయాలు చెబుతాను అని అంటుంది. దాంతో రిషి అన్నం తినడానికి ఒప్పుకుంటాడు.