- Home
- Entertainment
- Guppedantha Manasu: రిషి దగ్గరికి వెళ్లాలనుకున్న మహేంద్ర దంపతులు.. దేవయానికి బుద్ధి చెప్పిన వసుధార?
Guppedantha Manasu: రిషి దగ్గరికి వెళ్లాలనుకున్న మహేంద్ర దంపతులు.. దేవయానికి బుద్ధి చెప్పిన వసుధార?
Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు నవంబర్ 23 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో రిషి నేనేదో తెలిసి తెలియకో అన్నాను అంటే అంత మాత్రానికి వెళ్ళిపోతారా అని అంటాడు. ఇంత పెద్ద శిక్ష వేస్తారా అని అనగా వెంటనే మహేంద్ర శిక్ష నీకు వేశానని నువ్వు అనుకుంటున్నావు కానీ నాకు నేనుగా శిక్ష వేసుకున్నానని నేను అనుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు రిషి డాడీ మీరు నాకు కావాలి, నాతో ఉండాలి. నేను ఒకవేళ తప్పు చేస్తే కొట్టి రిషి నువ్వు తప్పు చేస్తున్నావ్ అని నా మీద అరవండి కానీ నన్ను విడిచి వెళ్ళిపోకండి డాడ్ అని ఎమోషనల్ గా మాట్లాడుతాడు రిషి. అప్పుడు రిషి మాటలు విన్న జగతి వసుధార ఇద్దరు ఎమోషనల్ అవుతూ ఉంటారు.
మీరు లేని రిషి ఆ ఇంట్లో ఎలా ఉంటాడో ఒక్కసారి ఊహించుకోండి డాడ్ అని ఎమోషనల్ గా మాట్లాడడంతో మహేంద్ర కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు. అప్పుడు రిషి ఎంత మాట్లాడినా కూడా మహేంద్ర ఏం మాట్లాడకుండా మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. అప్పుడు రిషి సరే డాడీ ఈరోజు రాత్రి మొత్తం ఆలోచించుకొని ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి మీరు రావాలి అనుకుంటే రేపు ఉదయం సూర్యోదయం కాకముందే మీరు నా ఇంటికి రావాలి నాతో కలిసి కాఫీ తాగాలి అని అంటారు రిషి. ఏం చేస్తారో ఏం ఆలోచిస్తారో అది మీ నిర్ణయానికి వదిలేస్తున్నాను మీరు నాకు కావాలి. నీ ప్రేమ నాకు కావాలి అని మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి.
అప్పుడు రిషి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి వచ్చి మహేంద్ర ను ఎమోషనల్ గా హత్తుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత వసుధారని పిలుచుకొని వెళ్లిపోతాడు రిషి. ఆ తర్వాత రిషి జరిగిన విషయాల గురించి తలచుకుని ఆలోచిస్తూ ఉంటాడు. డాడ్ నిజంగానే వస్తారా డాడ్ ని ఎప్పుడెప్పుడు ఆహ్వానిద్దామా అని ఎదురుచూస్తున్నాను అనుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు వసుధార ఆలోచిస్తూ ఉండగా ఇంతలో రిషి వసుధారకి మెసేజ్ చేస్తాడు. ఏం చేస్తున్నావ్ వసుధర అని మెసేజ్ చేయడంతో ఏం లేదు సార్ ఆలోచిస్తున్నాను అని అనగా వెంటనే రిషి గాడ్ వస్తారు కదా వసుధార అని మెసేజ్ చేస్తాడు.
రాకుండా ఎలా ఉంటారు సార్ అని వసుధార మెసేజ్ చేస్తుంది. అప్పుడు వసుధార బాల్కనీలో కలుద్దాం రండి అని మెసేజ్ చేస్తుంది. అప్పుడు వసుధార ఇన్ని రోజులు డాడ్ ని చూడకుండా ఉన్నాను కానీ రేపు ఉదయం వరకు చూడకుండా ఉండడం కష్టంగా ఉంది అని అంటాడు. డాడ్ వస్తానన్నా నమ్మకము ఉంది రాకపోతే ఎలా అన్న భయం కూడా ఉంది వసుధార అని అనడంతో వెంటనే వసు రిషి కి మహేంద్ర సార్ వాళ్ళు తప్పకుండా వస్తారు అని ధైర్యం చెబుతూ ఉంటుంది. మరొకవైపు మహేంద్ర దంపతులు ఒకచోట కూర్చొని ఉండగా మహేంద్ర సంతోషంగా కనిపిస్తాడు. అప్పుడు జగతి ఏమి నిర్ణయించుకున్నావు మహేంద్ర అని అడగగా నేను నా కొడుకు రిషి దగ్గరికి వెళ్లి పోతున్నాను అని అనడంతో జగతి సంతోషపడుతుంది.
రిషి దగ్గరికి ఎప్పుడు ఎప్పుడు వెళ్తానా ఎప్పుడెప్పుడు రిషి తో కలిసి మాట్లాడుతానా అని సంతోషంగా ఉంది జగతి అనడంతో జగతి కూడా సంతోషపడుతూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఉంది జగతి అని అంటాడు మహేంద్ర. మరొకవైపు వసుధార రిషి ఇద్దరు చేతులు పట్టుకొని నడుచుకుంటూ మాట్లాడుతూ వెళుతుండగా ఇంతలో దేవయాని అది చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటి రిషి ఈ టైం వరకు పడుకోకుండా అలాగే ఉన్నారు. ఏంటి వసుధార ఈ టైంలో కూడా కబుర్లు చెప్పుకోవడం అవసరమా అని అనగా వెంటనే చూసి పెద్దమ్మ తనని ఏమీ అనద్దు తన తప్ప ఏమీ లేదు అని వసు ని వెనకేసుకొస్తాడు రిషి.
అప్పుడు దేవయాని నువ్వు మహేంద్ర ను పిలిచావు రావాలనుకుంటే వస్తాడు లేకపోతే లేదు అలాంటప్పుడు నువ్వు నిద్ర మేలుకొని ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకు రిషి అని అనగా వెంటనే రిషి డాడ్ వస్తారు పెద్దమ్మ అని అంటాడు. అప్పుడు దేవయాని అసలు నీ మీద ప్రేమ ఉంటే ఎందుకు వెళ్తారు అని అనగా వెంటనే వసుధర జరిగిన వాటి గురించి కంటే జరగబోయే వాటి గురించి ఆలోచించడం మేలు అనడంతో దేవాయని కోపంతో రగిలిపోతూ ఉంటుంది.అప్పుడు దేవయాని వెళ్లి పడుకోవచ్చు కదా అని అనగా లేదు పెద్దమ్మ నాకు నిద్ర పట్టడం లేదు అనడంతో వెంటనే వసుధర మన మనసులోని భావాలు అందరికీ అర్థం కావులేండి సార్ అని అంటుంది దేవయాని. మరొకవైపు మహేంద్ర దంపతులు రిషి దగ్గరికి వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటారు.