- Home
- Entertainment
- కృష్ణుడిగా మహేష్ దుర్యోధనుడిగా ప్రభాస్ కర్ణుడిగా విక్రమ్... మనసులు దోచేస్తున్న ఊహాజనిత మహాభారత చిత్రం!
కృష్ణుడిగా మహేష్ దుర్యోధనుడిగా ప్రభాస్ కర్ణుడిగా విక్రమ్... మనసులు దోచేస్తున్న ఊహాజనిత మహాభారత చిత్రం!
కృష్ణుడిగా మహేష్ నటిస్తే... విక్రమ్ కర్ణుడిగా చేస్తే. ఇక ప్రభాస్ దుర్యోధనుడిగా పాండవులకు సవాల్ విసిరితే ఎలా ఉంటుంది. కమల్ భీష్ముడిగా, రజినీకాంత్ ద్రోణాచార్యుడిగా చేస్తే.. ఆ ఊహ ఎంత అద్భుతం చెప్పండి. సౌత్ ఇండియా స్టార్స్ అందరూ కలిసి మహాభారతం చేస్తే పౌరాణిక పాత్రల్లో వారు ఎలా ఉంటారో చూపుతూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Mahabharat
భారతీయ ఇతిహాసాలైన రామాయణ మహాభారతాలు సినిమాటిక్ సబ్జక్ట్స్. ముఖ్యంగా మహాభారతం అతిపెద్ద పొలిటికల్ డ్రామా. రాజ్యం, అధికారం, హోదా చుట్టూ కథ నడుస్తుంది. మహాభారతంపై ఇప్పటికే వందల చిత్రాలు తెరకెక్కాయి. అయినప్పటికీ ఈ జనరేషన్ డైరెక్టర్ మోస్ట్ ఫేవరెట్ సబ్జెక్ట్ గా ఉంది. రాజమౌళి లాంటి దేశం మెచ్చిన దర్శకుడు సైతం మహాభారతం తన కలల ప్రాజెక్ట్ అని చెప్పారు. బడా నిర్మాతలు వేయి కోట్ల బడ్జెట్ తో మహాభారతం నిర్మిస్తున్నట్లు ప్రకటనలు చేశారు. కొన్ని ప్రాజెక్ట్స్ ప్రీప్రొడక్షన్ దశలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక మహాభారతంలో ప్రతి పాత్రకు ఒక ఔన్నత్యం ఉంటుంది.కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు వంటి పాత్రలు గొప్ప హీరోయిజం కలిగి ఉంటాయి. అభిమానులు తమ హీరో అలాంటి ఐకానిక్ రోల్ చేయాలని కోరుకుంటారు. ఓ ఔత్సాహికుడు సౌత్ ఇండియా స్టార్స్ కలిసి మహాభారతం చేస్తే వారి పాత్రల లుక్స్ ఎలా ఉంటాయనే ఆలోచనతో ఒక వీడియో చేశాడు. సదరు వీడియోలో స్టార్స్ మార్ఫింగ్ ఫోటోలు అద్భుతం ఉన్నాయి. వాటిపై మీరు కూడా ఒక లుక్ వేయండి.
Mahabharat
ఈ ఊహాజనిత మహాభారత చిత్రంలో మహేష్ కి కృష్ణుడు పాత్ర ఇచ్చారు. నిజంగా మహేష్ అద్బుతంగా ఉన్నాడు. ఆయన గ్లామర్ కి కృష్ణుడు గెటప్ చక్కగా సరిపోయింది. మరో టాప్ స్టార్ ప్రభాస్ ని విలన్ దుర్యోధనుడిగా ఎంపిక చేశారు.
Mahabharat
మహాభారతంలో మరో రెండు కీలక పాత్రలు అర్జునుడు, కర్ణుడు. ఒకే తల్లి బిడ్డలైన వీరిద్దరూ వీరులు. అయితే కురుక్షేత్రంలో చెరో పక్షం వహించి యుద్ధం చేస్తారు. మిత్ర ధర్మం కోసం దుర్యోధనుడితో చేరిన కర్ణుడు వీరమరణం పొందుతాడు. ఇక్కడ కర్ణుడిగా విక్రమ్, అర్జునుడిగా సూర్యను చూడవచ్చు.
Mahabharat
పాండవులలో అత్యంత బలవంతుడు గదాయుద్ధంలో మేటి భీముడు. ఇక్కడ ఆ పాత్రను మాధవన్ కి ఇవ్వడం విశేషం. ఇక దుర్యోధనుడు అరాచకాలు చూడలేని గుడ్డి తండ్రి ధృతరాష్ట్రుని పాత్ర జయం రవికి ఇచ్చారు.
Mahabharat
సీనియర్ స్టార్స్ కమల్, రజనీకాంత్ లకు వారి ఏజ్ కి సరిపోయే మహాభారత పాత్రలు ఇచ్చారు. భీష్ముడిగా కమల్, పాండవుల గురువు ద్రోణాచార్యుడుగా రజినీకాంత్ ని ఎంపిక చేశారు. వీరిద్దరికీ కూడా మార్ఫింగ్ గెటప్స్ బాగా సెట్ అయ్యాయి.
Mahabharat
మహాభారతంలో కీలకమైన లేడీ రోల్స్... ద్రౌపది, కుంతీదేవి. కురుక్షేత్ర యుద్దానికి వీరిద్దరూ పరోక్షంగా కారణమయ్యారు. కుంతీ కర్ణుడిని రహస్యంగా కనకున్నా...ద్రౌపది దుర్యోధనుడ్ని చూసి నవ్వకున్నా కథ వేరేలా ఉండేది. ఈ కల్పిత మహాభారతంతో ద్రౌపది పాత్రకు అసిన్, కుంతీదేవి పాత్రకు అనుష్క శెట్టి సరిపోతారని అభిప్రాయపడ్డారు.
Mahabharat
స్టార్ హీరో విజయ్ కి ఆయన ఇమేజ్ కి తగ్గ పాత్ర దక్కలేదు. విజయ్ ని అంతగా ప్రాధాన్యత లేని యుధిష్టర పాత్రకు పరిమితం చేశారు. అదే సమయంలో జిత్తులమారి నక్క శకుని రోల్ కార్తీకి ఇవ్వడం విశేషం. ఆ గెటప్ ఆయనకు చక్కగా సూట్ అయ్యింది.
Mahabharat
ఈ ఊహాజనిత మహాభారత మూవీలో నయనతార,సమంతకు కూడా చోటు దక్కింది. ధృతరాష్ట్రుని భార్య గాంధారిగా నయనతారను ఎంపిక చేశారు. సమంతకు కృష్ణుడు చెల్లి సుభద్ర రోల్ ఇచ్చారు.