'తంగలాన్' రిలీజ్ కు కోటి డిపాజిట్ చేయమన్న కోర్ట్!
తంగలాన్ మూవీ రిలీజ్‌కు ముందే రూ.1 కోటి రూపాయలు డిపాజిట్ చేయాలని నిర్మాతకు మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Thangalaan movie
విక్రమ్ (Vikram) హీరోగా రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘తంగలాన్’ (Thangalaan). కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాల ఆధారంగా దర్శకుడు పా. రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ రోజే రిలీజైంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెంచాయి. అయితే రిలీజ్ కు ముందు ఈ సినిమా నిర్మాతకు సమస్యలు ఎదురయ్యాయి. దాంతో కోర్టు తీర్పు మేరకు కోటి రూపాయలు డిపాజిట్ చేసి మరీ రిలీజ్ చేసారు.
చియాన్ విక్రమ్ తాజాగా నటించిన భారీ యాక్షన్ చిత్రం తంగలాన్. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీలో విక్రమ్ విభిన్నమైన గెటప్‌లో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ చిత్రం థియేటర్లలో భారీగా రిలీజైంది. ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్‌లో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. అయితే రిలీజ్‌కు తంగలాన్ నిర్మాతకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
thangalaan
తంగలాన్ మూవీ రిలీజ్‌కు ముందే రూ.1 కోటి రూపాయలు డిపాజిట్ చేయాలని నిర్మాతకు మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుందర్‌దాస్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం తీర్పు వెల్లడించింది. అంతేకాకుండా సూర్య హీరోగా నటిస్తోన్న కంగువా చిత్రం విడుదలకు ముందు కూడా కోటి రూపాయలు డిపాజిట్ చేయాలని నిర్మాతకు సూచించింది.
కోర్టుకు ఎక్కిన కారణం...
గతంలో అర్జున్‌లాల్ సుందరదాస్ అనే వ్యక్తితో కలిసి నిర్మాత జ్ఞానవేల్ రాజా రూ.40 కోట్లతో ఓ సినిమా నిర్మించాలని అనుకున్నారు. అయితే ప్రీ-ప్రొడక్షన్‌కి ఖర్చులకు గానూ స్టూడియో గ్రీన్ నిర్మాణ సంస్థకు సుందర్‌దాస్ రూ.12.85 కోట్లు చెల్లించారు. తర్వాత ఆర్థికపరమైన ఇబ్బందులు రావడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి సుందర్‌దాస్ తప్పుకున్నాడు. అయితే అందులో కేవలం రూ.2.5 కోట్లు మాత్రమే తిరిగి వచ్చాయి. ఆ తర్వాత ఆయన మరణించడంతో మిగిలిన రూ.10.35 కోట్ల కోసం సుందర్‌దాస్ కుటుంబసభ్యులు కోర్టును ఆశ్రయించారు.
అయితే ఈ కేసు గురించి నిర్మాత కేఈ జ్ఞానవేలు మాట్లాడుతూ... మూడు తమిళ సినిమాల హిందీ డబ్బింగ్ హక్కులకు ఇవ్వాల్సిన డబ్బుకు బదులుగా.. ఆ రూ.12.85 కోట్లు ఇచ్చాడని తెలిపారు. అంతే కానీ తమకు ఎలాంటి డబ్బు ఇవ్వలేదని చెప్పారు. కానీ గ్రీన్ స్టూడియోస్ తమకు రూ.10.25 కోట్లను 18 శాతం వార్షిక వడ్డీతో తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ అర్జున్ లాల్ సుందర్ దాస్ కుటుంబం కోర్టులో దావా వేసింది. ఈ కేసుపై విచారణ చేపట్టినా ధర్మాసనం నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా సినిమాల రిలీజ్‌కు ముందు కోటి రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని ఆదేశించింది.