- Home
- Entertainment
- Karthika Deepam: రుద్రాణికి చుక్కలు చూపించిన ఎస్సై మాధురి.. ఏకంగా అరెస్టు చేసి షాక్?
Karthika Deepam: రుద్రాణికి చుక్కలు చూపించిన ఎస్సై మాధురి.. ఏకంగా అరెస్టు చేసి షాక్?
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీక దీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో కొనసాగుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకు వెళుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.

కార్తీక్ ( Karthik) రుద్రాణి మనుషులను కొట్టినందుకు ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తరువాత దీప వచ్చి ధైర్యం చెబుతుంది. తరువాత శ్రీవల్లి బిడ్డ గురించి ఆలోచించి ఎలా అయిన రుద్రాణి ని ఎదుర్కోవాలని పోలీస్ స్టేషన్ కి బయలుదేరుతాడు. దీప (Deepa) వెళ్లొద్దని బ్రతిమిలాడుతుంది.
మరోవైవు రుద్రాణి (Rudrani) బాబు ఏడుస్తుండగా ఏడుపు మానిపించడానికి తన మనుషుల్ని జోల పాట పాడమంటుంది. కానీ అక్కడ జోల పాట ఎవరికి రాదు. రుద్రాణి వారిపై విరుచుకు పడుతుంది. ఈలోపు రుద్రాణి ఇంటికి పోలీస్ లు వస్తారు.
శ్రీవల్లి, కోటేష్ (Srivalli, kotesh) లు పోలీసులను వెంట పట్టుకొని వస్తారు. దాంతో రుద్రాణి ఎస్ ఐ మాధురి మీద విరుచుకు పడుతుంది. దాంతో మాధురి కూడా ఫైర్ అవుతుంది. ఇక రుద్రాణి (Rudrani) మరింత రెచ్చిపోతుంది.
దాంతో మాధురి (Rudrani) రుద్రాణి చెంపమీద ఒక్కటిస్తుంది. నన్నే కొడతావే అంటూ.. రుద్రాణి అరవగా మళ్ళీ రెండో చెంపమీద గట్టిగా ఇస్తుంది. ఇక రుద్రాణికి అవమానంగా ఉంది. నీ సంగతి త్వరలోనే తేల్చుతా అని అంటుంది. అయిన మాధురి (Madhuri) కొంచెం కూడా లెక్కచేయదు.
ఇక శ్రీవల్లి (Srivalli) బాబును తమకు అప్పగించి వాళ్ళని ఇంటికి వెళ్లిపోమని చెబుతుంది. ఇక రుద్రాణి రౌడీ తమ్ములను కూడా బయటకు వెళ్ళమంటుంది. అందరిని బయటకు పంపి రుద్రాణి (Rudrani) ని ఆ ఎస్ ఐ కొడుతుందేమో అనిపిస్తుంది. ఇక రుద్రాణిని పోలీస్ స్టేషన్ కు తీసుకొని వెళతారు.
ఇక మరోవైపు రత్న సీత (Ratna Seetha) కార్తీక్ ఫోన్ తీసుకున్న వ్యక్తిని పట్టుకుంటుంది. ఆ వ్యక్తిని సౌందర్య ఇంటికి తీసుకొని వస్తుంది. జరిగిన విషయం సౌందర్య (Soundarya )కి వివరిస్తుంది.
తరువాత సౌందర్య (Soundarya ) ఆ దొంగని వివరాలు అడగగా.. వాళ్ళు ఎక్కడా కనిపించరు. ఎటు వెళుతున్నారో ఆచూకీ చెబుతాడు. ఇక సౌందర్య నీకు ఎంత కావాలంటే అంత డబ్బుయిస్తాను. నా కార్తీక్ (Karthik) ఆచూకి చెప్పు అంటుంది. ఆ వ్యక్తి సరే అంటాడు.
మరోవైపు కార్తీక్, దీప (Karthik, Deepa) లు బాబు గురించి ఆలోచిస్తూ బాధపడుతారు. ఈలోపు బాబుని తీసుకొని శ్రీవల్లి, కోటేష్ లు వస్తారు. వాళ్ళని చూసి వీరు ఎంతో ఆనంద పాడుతారు. ఇక శ్రీవల్లి (Srivalli) జరిగిన సంగతి తెలుపుతుంది. ఇక బాబు నామ కరణ వేడుకలు తిరిగి ప్రారంభిస్తారు.
ఇటు.. సౌందర్య (Soundarya) ఫ్యామిలీ కార్తీక్ గురించి వాళ్ళు పిల్లలు తీపి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటారు. ఇక జరిగింది అంతా మన మంచికే అన్నట్టు అలోచించి. ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటారు.