MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Pushpa: బాయ్ కాట్ పుష్ప అంటూ ట్విట్టర్ లో ట్రెండింగ్.. తగ్గేదే లే అంటున్న బన్నీ ఫ్యాన్స్, వివాదం ఏంటంటే

Pushpa: బాయ్ కాట్ పుష్ప అంటూ ట్విట్టర్ లో ట్రెండింగ్.. తగ్గేదే లే అంటున్న బన్నీ ఫ్యాన్స్, వివాదం ఏంటంటే

ఐకాన్ స్టార్ Allu Arjun నటించిన పుష్ప చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 17 శుక్రవారం ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు రెడీ అయింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 16 2021, 04:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఐకాన్ స్టార్ Allu Arjun నటించిన పుష్ప చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 17 శుక్రవారం ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు రెడీ అయింది. చాలా ప్రాంతాల్లో ప్రీమియర్, బెనిఫిట్ షోలకు రంగం సిద్ధం అవుతోంది. అఖండ చిత్రం విడుదలై పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఘనవిజయం సొంతం చేసుకుంది. దీనితో ప్రస్తుతం అందరి దృష్టి పుష్ప చిత్రంపై పడింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

పుష్ప చిత్రం కోసం బన్నీతో పాటు చిత్ర యూనిట్ మొత్తం దాదాపు రెండేళ్లు ఎంతో శ్రమించారు. రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటించారు. సుకుమార్ ఈ చిత్రంలో మునుపెన్నడూ చూడని విధంగా అల్లు అర్జున్ ని విభిన్నమైన గెటప్, యాటిట్యూడ్ లో ప్రజెంట్ చేస్తున్నాడు. బన్నీ ప్రాణం పెట్టి చేసిన చిత్రం ఇది. దీనితో ఈ చిత్ర ఫలితంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. 


 

36
Pushpa

Pushpa

పుష్ప చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 3 వేలకు పైగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. రేపు ఈ చిత్రం విడుదలకు రెడీ అవుతుండగా ప్రస్తుతం ట్విట్టర్ లో 'BoycottPushpaInKarnataka' అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దీనికి కారణం కన్నడిగులు ఆగ్రహమే. 

46
PushpaTrailer

PushpaTrailer

పుష్ప చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది కాబట్టి కన్నడ భాషలో కూడా విడుదల చేస్తున్నారు. కానీ అనూహ్యంగా కర్ణాటకలో ఈ చిత్రం కన్నడ భాషలో కంటే ఒరిజినల్ వర్షం తెలుగులోనే ఎక్కువ థియేటర్స్ లో విడుదలవుతోంది. ఇది కాస్త కన్నడ భాషాభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. దీనితో కర్ణాటక అభిమానులు బాయ్ కాట్ పుష్ప అంటూ ట్రెండ్ చేస్తున్నారు. 

56
Pushpa movie

Pushpa movie

అల్లు అర్జున్ , పుష్ప మార్కెటింగ్ టీంకి కన్నడ భాషపై పెద్దగా ఆసక్తి లేనట్లు ఉంది. కర్ణాటకలో ఇక్కడి భాష కంటే ఎక్కువగా తెలుగులోనే రిలీజ్ చేసుకుంటున్నారు. ఇలా మా భాషని అవమానిస్తే మేము పుష్ప చిత్రం చూడము అంటూ ట్విట్టర్ లో కామెంట్స్ పెడుతున్నారు. 

66
Saami saami song

Saami saami song

దీనితో అల్లు అర్జున్ అభిమానులు కూడా ట్విట్టర్ లో ధీటుగా స్పందిస్తున్నారు. బాయ్ కాట్ పుష్పకి పోటీగా 'తగ్గేదే లే' అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. పుష్ప రిలీజ్ విషయం నిర్మాతలు, బయ్యర్లకు సంబందించినది. సినిమాని బాయ్ కాట్ చేయాలని ట్రెండ్ చేయడం సరైన పద్ధతి కాదని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు. Also Read: 'Pushpa'కు అడుగడుగునా అడ్డంకులే.. కేరళ పోలీసులకే దిమ్మతిరిగింది, వీళ్లిద్దరి కష్టం అంతా ఇంతా కాదుగా

About the Author

SG
Sreeharsha Gopagani
అల్లు అర్జున్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఒకప్పుడు పని లేదు, పైసా లేదు.. ఇప్పుడు ₹270 కోట్ల సినిమాతో హిట్ కొట్టిన ఈ ఐఐటీ కుర్రాడు ఎవరో తెలుసా?
Recommended image2
Vijay Sethupathi: బిగ్ బాస్‌లో విజయ్ సేతుపతి కామెంట్ల దుమారం.. సీఎం విజయ్‌ను టార్గెట్ చేశాడా? విజయ్ టీవీ క్లారిటీ
Recommended image3
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved