Devatha: మూడో పెళ్లికి ఆదిత్య వ్యతిరేకం.. మా అయన కలెక్టర్ అని నోరు జారిన రుక్మిణి!
Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత (Devatha) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 7 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే రాధ (Radha).. దేవి వాళ్ళను స్కావుటింగ్ కి వద్దు అని నిరాకరిస్తుంది. ఇక ఈ లోపు అక్కడకు మాధవ (Madhava) కూడా వచ్చి మీరు ఈ వయసులో కష్టపడాల్సిన అవసరం లేదమ్మా అని అంటాడు. ఇక ఆ మాటతో రాధ మీరు స్కవుటింగ్ కి వెళ్లండి అని చెబుతుంది. అంతేకాకుండా ఈ పొద్దు నుంచి మీరిద్దరూ కష్టపడడం నేర్చుకోవాలని అంటుంది.
మరోవైపు ఆదిత్య (Adithya) తన కోపం తో చేతిలో ఉన్న పజిల్ ను అనుకోకుండా సత్య (Sathya) మీదకు విసిరికొడతాడు. మరోవైపు రాధ నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి పోతాను.. అందుకే తన పని తాను చేసుకోవాలంటే చిన్మయి ఇప్పటి నుంచే అలవాటు చేసుకోవాలి అని మనసులో అనుకుంటుంది. ఇక ఈడ ఉండడం నావల్ల కాదు.. ఇన్ని రోజులు చిన్మయి కోసమే ఇంట్లో ఉన్న అని అనుకుంటుంది.
ఇక నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్లే లోపు చిన్మయి (Chinmayi) అన్ని పనులు అలవాటు చేయాలి అని రాధ మనసులో అనుకుంటుంది. మరోవైపు ఈశ్వర్ (Eswar) తన అక్క.. అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దేవుడమ్మ తన ఆడపడుచు అన్న మాటలను ఏమాత్రం జీర్ణించుకోలేక.. తనదైన శైలిలో తన భర్తకు వివరిస్తుంది. ఇక ఈ విషయంలో మీ అక్కకు మీరు చెపుతారా? లేక నా పద్ధతిలో నన్ను చెప్పమంటారా అని అంటుంది.
అంతేకాకుండా ఆ విషయం మీ అక్కకి అర్థమయ్యేలా చెప్పండి అని దేవుడమ్మ (Devudamma) తన భర్తకు గట్టిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు చిన్మయి (Chinmayi) దేవీలు రాధా దగ్గరకు వచ్చి బెడ్ షీట్స్ ఎందుకు సర్ద లేదు అని అడుగుతారు. ఈరోజు నుంచి మీ పనులు మీరే చేసుకోవాలని రాధ అంటుంది. మీరే స్వయంగా పక్కలు వేసుకుని పడుకొండి అని అంటుంది.
ఇక దేవి (Devi) చిన్మయి లు అక్కడ నుంచి దీనంగా వెళ్లి పక్కలు సర్దుకుంటూ ఉండగా అది చూస్తూన్న రాధ (Radha) ఎంతో కుమిలిపోతూ ఉంటుంది. మరోవైపు ఆదిత్య వాళ్ళ అత్తయ్య ఆదిత్య కు మరో పెళ్లి చేయడానికి ఆడపెళ్లి వారితో మాట్లాడుతూ ఉంటుంది. ఆదిత్య అక్కడికి వచ్చి నాకు పెళ్లి ఎందుకు? నాకు పెళ్లి కావాలని నిన్ను అడిగానా అని తన అత్తయ్య మీద విరుచుకు పడతాడు.
ఇక తర్వాతి భాగంలో దేవి (Devi) నేను కూడా ఆఫీసర్ సార్ లెక్క కలెక్టర్ అవుతాను అని తన స్కూల్ టీచర్ తో అంటుంది. ఇక టీచర్ రాధ (Radha) దగ్గరకు వచ్చి మీ అమ్మాయి అనుకున్న విధంగానే కలెక్టర్ అవుతుంది అని అంటుంది. ఇక రాధ తన తండ్రి కూడా కలెక్టర్ ఎ అని నోరు జరుతుంది. దాంతో ఆ టీచర్ ఆశ్చర్యపోతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.