Devatha: రాధను దక్కించుకోవడానికి మరో ప్లాన్ చేసిన మాధవ.. షాక్ లో సత్య?
Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత (Devatha) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 2న ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో మాధవ(madhava)రాధ ఆ విధంగా ఎందుకు చేసిందా అని ఆలోచిస్తూ ఎలా అయినా రాధకు నేను తప్ప మరే దారి ఉండకూడదు అందుకోసం ఏం చేయాలి అని తెగ ఆలోచిస్తూ ఉంటాడు మాధవ. అప్పుడు మళ్లీ అమ్మ సెంటిమెంట్ తోనే రాధ(radha) ను మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తాను అని అనుకుంటాడు.
మరొక వైపు రాధ,దేవి(devi) ఇద్దరు నడుచుకుంటూ వస్తూ పొలం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు దేవి నీకు పొలం పనులు వచ్చా ఎవరు నేర్పించారు అని అడగగా అప్పుడు రుక్మి తన గతాన్ని గుర్తు చేసుకొని తానే చిన్నప్పటినుంచి నేర్చుకున్నాను అని చెబుతుంది. అప్పుడు భాగ్యమ్మ (bhagyamma)వారికి ఎదురుగా కాగా వెంటనే దేవి అమ్మమ్మ అని పిలుస్తుంది.
ఆ పిలుపుకి భాగ్యమ్మ సంతోషపడగా ఇప్పటినుంచి అలా అని పిలుస్తాను అని అంటుంది దేవి. అప్పుడు భాగ్యమ్మ దేవి(devi)ని పట్టుకుని ఎమోషనల్ అవుతూ దేవికి మామిడికాయ ఇవ్వడంతో ఒకచోట కూర్చొని తింటూ ఉంటుంది. అప్పుడు భాగ్యమ్మ (bhagyamma)రాధతో నాకు చాలా ఆనందంగా ఉంది నీ బిడ్డే నన్ను అమ్మమ్మ అని పిలిచింది అని సంతోషపడుతుంది.
అప్పుడు భాగ్యమ్మ అక్కడ ఎలా ఉన్నావు అని అనడంతో రాధా(radha)జరిగిన విషయం అంతా వివరిస్తూ దేవి తన తల్లి కాదు అన్న మాట కూడా చెప్పడంతో భాగ్యమ్మ షాక్ అవుతుంది. మరొకవైపు ఆదిత్య సత్య(sathya)ను ఎక్కడికి వెళ్లావు అని అడగగా రాధా అక్క దగ్గరికి వెళ్లి తన బాధలు చెప్పుకున్నాను అని అంటుంది.
కానీ అక్క మాత్రం తన బాధలను నాతో పంచుకోలేదు ఎంతైనా పరాయివాళ్ళని కదా అని అనగా అప్పడు ఆదిత్య రాధ(radha)మీ అక్క రుక్మిణి అని తెలిసి ఎక్కడికి వెళ్ళావు కదా అని అనడంతో ఆ మాటలకు సత్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. నిజం తెలిసి కూడా తెలియనట్టు గా ఉన్నావు అని అనడంతో నిజం తెలిసి అంటున్నావ్ ఈ విషయం నీకు తెలుసా ఆదిత్య(adithya)అని అడగగా అవును అని అంటాడు ఆదిత్య.
ఆ మాటలకు సత్య (sathya)మరింత షాక్ అవుతుంది. అప్పుడు వారిద్దరూ రాధ విషయాన్ని తలుచుకుని బాధ పడుతూ ఉంటారు. మరొకవైపు మాధవ రాధ విషయంలో మరొక కుట్ర చేయడానికి ప్లాన్ చేస్తాడు. మరొకవైపు సత్య ఆదిత్య(adithya) నిజం తెలిసి కూడా ఎందుకు ఈ విధంగా ఉంటున్నాడు అని ఆలోచిస్తూ బాధపడుతుంది.
ఇక జానకి(janaki) ఇంట్లో పని చేస్తూ ఉండగా రాధ వచ్చి నేను చేస్తాను కదా అని అనడంతో ఇంటికి వస్తే ఎలా ఉంటుందో తెలియదు అందుకే ఇప్పటి నుంచి పని చేయడం నేర్చుకుంటున్నాను అని అంటుంది జానకి.