- Home
- Entertainment
- Prema Entha Madhuram: భయంతో టెన్షన్ పడుతున్న అంజలి.. ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తున్న మదన్!
Prema Entha Madhuram: భయంతో టెన్షన్ పడుతున్న అంజలి.. ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తున్న మదన్!
Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ మంచి కధా బలంతో ఎంతో ఇంట్రెస్టింగ్ గా ముందుకి దూసుకుపోతుంది. భార్య బిడ్డల కోసం, కుటుంబ గౌరవం కోసం ఎంత రిస్క్ అయినా ఫేస్ చేయడానికి సిద్ధమైన ఒక వ్యక్తి కధ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 5 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో నాకు స్ట్రాంగ్ కాఫీ కావాలి నీ అంత స్వీట్ గా ఉండాలి అంటూ తన రూమ్ కి వెళ్ళిపోతాడు మదన్. మరోవైపు అంజలి యాదగిరి కి ఫోన్ చేసి మదన్ వచ్చేసరికి అక్కడ అంతా పర్ఫెక్ట్ గా ఉండేలా చూడమని ఆనంద్ కి చెప్పు అని చెప్తుంది. ఈవిడకి అతని మీద ఎందుకు అంత నమ్మకం అనుకుంటూ విషయాన్ని అందరికీ చెప్తాడు యాదగిరి.ఈరోజు నుంచి బిజినెస్ అంతా పెద్దసారే చూసుకుంటారు అంజలి మేడం అంటే అమాయకురాలు కాబట్టి కొందరి ఆటలు సాగాయి ఇకనుంచి అలా కుదరదు అతను వచ్చే సమయానికి అందరూ పని చేస్తున్నట్లుగా కనిపించండి అంటాడు యాదగిరి.
.
ఇక్కడ అందరికీ పని చేస్తున్నట్లుగా నటించడం రాదు పనిచేయటం మాత్రమే వచ్చు అంటాడు ఆర్య. నేను చెప్పేది అదే లంచ్ బ్రేక్ కి సార్ వస్తారు. అప్పటికి అందరూ రెడీగా ఉండండి అంటాడు యాదగిరి. లంచ్ తర్వాత నాకు పర్సనల్ పని ఉంది నేను అవైలబుల్ గా ఉండను అంటాడు ఆర్య. అలా అంటే కుదరదు అని యాదగిరి అంటే అతని వైపు కోపంగా చూస్తాడు ఆర్య. సరే వెళ్ళు ఇక్కడ నేను మేనేజ్ చేస్తాను అంటూ వెనక్కి తగ్గుతాడు యాదగిరి. ఆర్య వెళ్ళిపోతుంటే నిజంగానే అంజలి మేడం వాళ్ళ బ్రదర్ టఫ్ అంట మీరు ఇక్కడే ఉంటే మంచిదేమో అంటాడు ఒక వ్యక్తి.
ఒకరి ఇంప్రెషన్ కూడా కోసం మనం పని చేయకూడదు వర్క్ ని ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలి అంటూ వెళ్ళిపోతాడు ఆర్య. మరోవైపు సైట్ కి వచ్చిన మదన్ కి ఆర్య పనితనం గురించి చెప్తుంది అంజలి. అతని పనితనం నీ మాటల్లోనే కానీ ఇక్కడ కనిపించడం లేదు కనీసం మనిషైనా కనిపిస్తాడా అని అడుగుతాడు మదన్. ఆనంద్ ఎక్కడ అని అడుగుతుంది అంజలి.పెద్ద సార్ వస్తున్నారు అని చెప్పినా వినిపించుకోకుండా వెళ్లిపోయాడు అంటూ అబద్ధం చెప్తాడు యాదగిరి. అంతలోనే సైట్ ఇంజనీర్ వచ్చి తన వర్క్ కంప్లీట్ చేశాకే పర్మిషన్ తీసుకొని మరి వెళ్లారు అని జరిగిందంతా చెప్తాడు.
అతని దగ్గర బిల్డింగ్ బ్లూ ప్రింట్ చెక్ చేస్తాడు మదన్. దీనివల్ల మనకి నష్టమే కానీ లాభం ఏమీ లేదు కన్స్ట్రక్షన్ స్టాప్ చేయండి నేను చెప్పినట్లుగా ప్లాన్ మార్చండి అంటాడు మదన్.ఇది ఆనంద్ గారు అన్ని విధాల ఆలోచించి ప్లాన్ చేసింది. ఏ చిన్న ప్లాన్ చేంజ్ చేసిన మొత్తం కన్స్ట్రక్షన్ డిస్టర్బ్ అవుతుంది అంటాడు సైట్ ఇంజనీర్. నా ప్రాజెక్ట్ లో నేను చెప్పినట్లు వినే వర్కర్స్ మాత్రమే ఉండాలి అతనిని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటూ అతన్ని జాబ్ నుంచి తీసేస్తాడు మదన్. మరోవైపు హాస్పిటల్ కి వచ్చిన ఆర్య దంపతులకు ఒక ఆవిడ అబార్షన్ చేయమంటూ ఏడుస్తూ కనిపిస్తుంది.
ఐదో నెల వచ్చాక అబార్షన్ చేయడం కుదరదు అంటూ ఆ డాక్టర్ మందలిస్తుంది. కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిసి నా భర్త నన్ను వదిలేస్తానంటున్నాడు దయచేసి నాకు అబార్షన్ చేయండి అని అడుగుతుంది. కుదరదు అంటే వెళ్ళిపోతుంది డాక్టర్. ఏడుస్తూ కూర్చున్నా ఆమె దగ్గరికి వెళ్లి ఆడజన్మ ఎంతో ఉత్తమమైనది. మురిపెంగా కొడుకుల్ని పెంచుకుంటే తల్లిదండ్రులని రోడ్డుమీద వదిలేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ తల్లిదండ్రులని రోడ్డు మీద వదిలేస్తే కూతుర్లు లేరు అంత వరకు ఎందుకు నీ గురించే ఆలోచించుకో నువ్వు నీ పుట్టింటి వాళ్ళని అత్తింటి వాళ్ళని ఒకేలాగా చూసుకుంటున్నావు
కదా అంటూ అనుని చూపించి తను నా భార్య నా జీవితంలోకి అన్ని తీసుకొని వచ్చింది. తను కూడా వాళ్ళ అమ్మ నాన్నకి ఒక్కతే కూతురు అయినా తల్లిదండ్రులని ఎంతో అపురూపంగా చూసుకుంటుంది.ఇదే విషయాన్ని మీ ఆయనకి అర్థమయ్యేలాగా చెప్పు వినకపోతే అతని కర్మ అంటాడు ఆర్య. నా భర్త నన్ను వదిలేస్తే బ్రతకడం ఎలా అంటూ కన్నీరు పెట్టుకుంటుంది ఆమె. కబార్షన్ చేయించడం కోసం ప్రమాదమని తెలిసిన తెగించి ఇక్కడికి వచ్చావు తెగింపు నీ పిల్లల్ని పోషించుకోవడంలో చూపించు వాళ్లే నీకు అండ అవుతారు. అప్పటికి కష్టం అనిపిస్తే నా దగ్గరికి రా నా తోబుట్టువు లాగా చూసుకుంటాను అంటాడు ఆర్య.
అక్కడ ఉన్న అందరూ చప్పట్లు కొట్టి ఆర్యని మెచ్చుకుంటారు. నేను అబార్షన్ చేయించుకోను. బిడ్డలకి నేనే తండ్రిని అయి నీ అంత గొప్పగా పెంచుతాను అంటుంది ఆమె. మరోవైపు ఫస్ట్ రోజే ఎంత ఆటిట్యూడ్ చూపించాలా కొంచెం కూల్ గా ఉండొచ్చు కదా అంటుంది అంజలి. సార్ కి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఇప్పుడు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ సాటిస్ఫై అయ్యే వరకు ఇకనుంచి కదిలేదే లేదు అంతే కదా సార్ అంటాడు యాదగిరి.
100% కరెక్ట్ అంటాడు మదన్. ఇంటికి వచ్చిన ఆర్య సైట్ ఇంజనీర్ ద్వారా జరిగిందంతా తెలుసుకొని మదన్ దగ్గరికి వస్తాడు. ఇంట్రడ్యూసింగ్ అయిన తరువాత నీ గురించి నా సిస్టర్ చాలా చెప్పింది కానీ నిన్ను చూస్తే చాలా ఎక్కువగా చెప్పినట్లుగా కనిపిస్తుంది అంటాడు. నెవర్ జెడ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అంటాడు ఆర్య. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.