- Home
- Entertainment
- Inaya Sultana Madham: విలనిజం చూపించబోతున్న `బిగ్ బాస్` ఫేమ్ ఇనయ సుల్తానా.. `మదం` టీజర్ ఎలా ఉందంటే?
Inaya Sultana Madham: విలనిజం చూపించబోతున్న `బిగ్ బాస్` ఫేమ్ ఇనయ సుల్తానా.. `మదం` టీజర్ ఎలా ఉందంటే?
బిగ్ బాస్ ఫేమ్ ఇనయ సుల్తానా `మదం` అనే సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే ఆమె విలనిజం చూపించేందుకు రెడీ అవుతుందట.

బిగ్ బాస్ షోతో పాపులర్ అయ్యింది ఇనయ సుల్తానా. ఆరో సీజన్‌లో ఆమె చేసిన రచ్చ వేరే లెవల్. ప్రారంభంలో డల్‌గా ఉన్నా, అనంతరం రెచ్చిపోయి టైటిల్ రేసులోకి వచ్చింది. కానీ సడెన్‌గా ఎలిమినేట్ అయి షాకిచ్చింది. అయితే బిగ్ బాస్ షో మాత్రం ఇనయ సుల్తానాకి మంచి క్రేజ్‌ని తీసుకొచ్చింది.
అనంతరం సినిమా అవకాశాలు కూడా క్యూ కడుతున్నాయి. ఇటీవల వరుసగా ఆమె సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది. ఇటీవల `బచ్చలమల్లి` చిత్రంలోనూ వేశ్య పాత్రలో కనిపించి ఆశ్చర్యపరిచింది ఇనయ.
ఆమె కీలక పాత్రలో `మదం` అనే సినిమా రూపొందుతుంది. హర్ష గంగవరపు, లతా విశ్వనాథ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నాఉ. దీనికి వంశీ కృష్ణ మల్లా దర్శకత్వం వహిస్తుండగా, ఏకైవ హోమ్స్ ప్రై.లి పతాకంపై సూర్యదేవర రవీంద్రనాథ్(చినబాబు) రమేష్ బాబు కోయ నిర్మించారు. మార్చి 14న సినిమా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. అటవి నేపథ్యంలోని విలేజ్‌లో లవ్ స్టోరీ, యాక్షన్ ప్రధానంగా సినిమా సాగుతుంది. ప్రేమ, పోరాటం మెయిన్ ఎలిమెంట్లుగా ఆద్యంతం రా అండ్ రస్టిక్ కథాంశంతో ఈ మూవీని రూపొందించినట్టు టీజర్‌ని చూస్తుంటే అర్థమవుతుంది.
టీజర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ముఖ్యంగా బీజీఎం ప్రత్యేకంగా నిలిచింది. ఇటీవల కాలంలో చాలా కొత్తగా ఉందని చెప్పొచ్చు. అదే `మదం` టీజర్‌లో హైలైట్‌గా నిలిచింది. రా ఎలిమెంట్లు మరో హైలైట్. ఇక ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో `మదం` దర్శకుడు వంశీకృష్ణ మల్లా మాట్లాడుతూ, `మదం` సినిమా మార్చి 14న రిలీజ్ కాబోతోంది.
మా నిర్మాత రమేష్ ఇచ్చిన కథను చూసినప్పుడు నాకు చాలా భయమేసింది. ఇంతటి రా, రస్టిక్ సినిమా తెలుగులో రావడం అరుదు. తమిళ్, మలయాళీ భాషల్లో ఇలాంటి కంటెంట్ వస్తుంటుంది. `మదం` కథ నాకు చాలా నచ్చింది. ఇలాంటి క్లైమాక్స్ ఇప్పటి వరకు ఇండియన్ సినీ హిస్టరీలో రాలేదు. ఈ మూవీని చూడాలంటే చాలా గుండె ధైర్యం కావాలి’ అని అన్నారు.
రైటర్ రమేష్ బాబు కోయ మాట్లాడుతూ.. ‘నా కథను ఇంత అద్భుతంగా తీసిన వంశీకృష్ణకు థాంక్స్. మాకు ఈ ప్రయాణంలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
ఇనయ సుల్తానా మాట్లాడుతూ.. ‘నాకు నెగెటివ్ పాత్రలు చేయడమంటే ఇష్టం. `మదం` చిత్రంలో నేను చాలా ఇంపార్టెంట్ కారెక్టర్‌ను చేశాను. నా క్లిష్ట పరిస్థితుల్లో దర్శకుడు వంశీ సపోర్ట్‌గా నిలిచారు. నేను బాగా నటించడానికి ఆయనే కారణం. లత నాకు మంచి స్నేహితురాలు. హర్ష చాలా రియలిస్టిక్‌గా నటించాడు. సినిమా అద్భుతంగా వచ్చింది` అని తెలిపింది.
హర్ష గంగవరపు మాట్లాడుతూ, ``మదం` సినిమాకు కథే హీరో. ఇందులో హై ఎమోషన్స్ ఉంటాయి. కథ చాలా బాగుంటుంది. దానికి తగ్గ పాత్రలు అందరికీ పడ్డాయి. అన్ని కారెక్టర్స్ బాగుంటాయి. నటించే స్కోప్ అందరికీ దొరికింది. మా రమేష్ గారి కథ, వంశీ గారి మేకింగ్ అద్భుతంగా ఉంటుంది. అందరికీ మా సినిమా నచ్చుతుందని భావిస్తున్నాను’ అని అన్నారు.
లతా విశ్వనాథ్ మాట్లాడుతూ.. ‘నా నిజ జీవితంలో దగ్గరగా ఉండే పాత్రను పోషించాను. అందుకే నాకు ఎక్కడా కష్టంగా అనిపించలేదు. నా ఫ్రెండ్ ఇనయతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. హర్షతో నటించడం సంతోషంగా ఉంది` అని చెప్పింది.