- Home
- Entertainment
- ఆర్య 2 అద్భుతమైన చిత్రం, వెంకటేష్ మూవీ చాలా వరస్ట్..ఆ టైటిల్ కరెక్ట్ కాదు అంటూ డైరెక్టర్ బోల్డ్ కామెంట్స్
ఆర్య 2 అద్భుతమైన చిత్రం, వెంకటేష్ మూవీ చాలా వరస్ట్..ఆ టైటిల్ కరెక్ట్ కాదు అంటూ డైరెక్టర్ బోల్డ్ కామెంట్స్
టాలీవుడ్ లో యువ దర్శకుల హవా మొదలయ్యింది. నాగ్ అశ్విన్, ప్రశాంత్ వర్మ లాంటి దర్శకులు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సొంతం చేసుకుంటున్నారు.డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ మ్యాడ్ చిత్రంతో టాలీవుడ్ లోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు.

Venkatesh, Allu Arjun
టాలీవుడ్ లో యువ దర్శకుల హవా మొదలయ్యింది. నాగ్ అశ్విన్, ప్రశాంత్ వర్మ లాంటి దర్శకులు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సొంతం చేసుకుంటున్నారు. మరికొందరు యువ దర్శకులు ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో ఎదుగుతున్నారు. ఒక్కో దర్శకుడికి ఒక్కో జోనర్ లో స్పెషాలిటీ ఉంటుంది. డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ మ్యాడ్ చిత్రంతో టాలీవుడ్ లోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు.
మాడ్ చిత్రానికి సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ తెరకెక్కుతోంది. మార్చి 28న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ తరుణంలో దర్శకుడు కళ్యాణ్ శంకర్ కొన్ని సీక్వెల్ చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుకుమార్ దర్శకత్వంలో ఫ్లాప్ సినిమా వచ్చినా, హిట్ సినిమా వచ్చినా కల్ట్ సినిమా అని ప్రశంసిస్తుంటారు. ఆర్య 2 కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు.
Drushyam 2
కానీ ఆర్య 2 తనకి ఫేవరిట్ మూవీ అని డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ అన్నారు. నిజంగా ఆర్య 2 అద్భుతమైన చిత్రం. కాకపోతే ఆ చిత్రాన్ని టైటిల్ మైనస్ అని కళ్యాణ్ శంకర్ అన్నారు. ఆర్య 2 అని కాకుండా ఆ చిత్రానికి మిస్టర్ పర్ఫెక్ట్ అని టైటిల్ పెట్టి ఉంటే బావుండేది కళ్యాణ్ శంకర్ అభిప్రాయపడ్డారు. ఆర్య 2 అని టైటిల్ పెట్టడంతో అది సీక్వెల్ మూవీ అనుకున్నాం. కానీ వాస్తవానికి ఆర్య 2 సీక్వెల్ కాదు. కొత్త కథ.
Venkatesh
సీక్వెల్ చిత్రాల్లో బాగా ఇష్టమైన మరో చిత్రం దృశ్యం 2 అని కళ్యాణ్ శంకర్ తెలిపారు. దృశ్యం మొదటి భాగాన్ని మించి రెండవ భాగం అద్భుతంగా నచ్చింది కళ్యాణ్ శంకర్ అని తెలిపారు. ఇక అసలు ఏమాత్రం నచ్చని సీక్వెల్ అంటే నాగవల్లి. చంద్రముఖి అంటే చిన్నప్పటి నుంచి ఒక క్రేజ్ ఉండేది. కానీ నాగవల్లి మాత్రం వరస్ట్ అంటూ కళ్యాణ్ శంకర్ బోల్డ్ కామెంట్స్ చేశారు.