MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Maa inti Bangaram OTT: ఓటీటీలోకి వచ్చేసిన సమంత 100 కోట్ల సినిమా.. 4 భాషల్లో స్ట్రీమింగ్, ఎక్కడంటే?

Maa inti Bangaram OTT: ఓటీటీలోకి వచ్చేసిన సమంత 100 కోట్ల సినిమా.. 4 భాషల్లో స్ట్రీమింగ్, ఎక్కడంటే?

Samantha Maa Inti Bangaram OTT: రూ.100 కోట్ల వసూళ్లతో రికార్డ్ క్రియేట్ చేసిన సమంత ‘మా ఇంటి బంగారం’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. నాలుగు భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సూపర్ హిట్ సినిమాను ఎక్కడ చూడాలో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 17 2026, 11:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
థియేటర్లు షేక్ చేసిన లేడీ ఓరియెంటెడ్ బ్లాక్‌బస్టర్.. ఇప్పుడు డైరెక్ట్‌గా మీ ఫోన్లలోకి
Image Credit : instagram

థియేటర్లు షేక్ చేసిన లేడీ ఓరియెంటెడ్ బ్లాక్‌బస్టర్.. ఇప్పుడు డైరెక్ట్‌గా మీ ఫోన్లలోకి

సమంత అభిమానులకు అదిరిపోయే క్రేజీ అప్‌డేట్. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు లీడ్ రోల్‌లో నటించి, సొంతంగా నిర్మించిన సూపర్ హిట్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ ఇప్పుడు మీ ఫోన్ స్క్రీన్స్ మీద సందడి చేయడానికి వచ్చేసింది. థియేటర్లలో రచ్చ లేపి, రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ బ్లాక్‌బస్టర్ మూవీ.. తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జియో హాట్‌స్టార్’‌లో డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. జూలై 17 రాత్రి నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. జూన్ 19న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం కేవలం 28 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేయడం విశేషం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల రికార్డ్ రేంజ్ వసూళ్లు
Image Credit : Asianet News

బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల రికార్డ్ రేంజ్ వసూళ్లు

సుమారు మూడేళ్ల గ్యాప్ తర్వాత సమంత స్క్రీన్ మీద కనిపించడంతో థియేటర్ల దగ్గర ఆడియన్స్ మామూలుగా ఎంజాయ్ చేయలేదు. పెద్దగా అంచనాలు లేకుండానే థియేటర్లలోకి వచ్చిన ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్, ముఖ్యంగా లేడీస్ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. దాంతో వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. టాలీవుడ్ హిస్టరీలోనే 100 కోట్ల వసూళ్లు సాధించిన మొదటి ‘ఫీమేల్ ఓరియెంటెడ్’ మూవీగా ‘మా ఇంటి బంగారం’ చరిత్ర సృష్టించింది.

35
అసలు ‘స్వర్ణ’ కథ ఏంటంటే?
Image Credit : Asianet News

అసలు ‘స్వర్ణ’ కథ ఏంటంటే?

ఈ సినిమాలో సమంత ‘స్వర్ణ’ అనే క్యారెక్టర్‌లో అదరగొట్టింది. పెళ్లయిన తర్వాత మొదటిసారి అత్తారింట్లో అడుగుపెట్టిన ఒక సాధారణ అమ్మాయి, ఆ కొత్త ఫ్యామిలీలో కలిసిపోవడానికి తెగ ట్రై చేస్తుంది. అయితే సరిగ్గా అదే టైంలో ఆమె జీవితంలో కొన్ని అనుకోని సిట్యుయేషన్స్ ఎదురవుతాయి. ఆమె గతానికి సంబంధించిన ఒక పెద్ద సీక్రెట్ బయటకు వచ్చి లైఫ్‌ను టోటల్‌గా మార్చేస్తుంది. ఆ తర్వాత తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి స్వర్ణ ఎలాంటి పోరాటం చేసిందనేదే ఈ సినిమా స్టోరీ. ఎమోషన్స్, కామెడీతో పాటు సమంత చేసిన పవర్‌ఫుల్ యాక్షన్ సీన్స్ ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి.

45
క్రేజీ కాంబో హ్యాట్రిక్ మ్యాజిక్
Image Credit : Asianet News

క్రేజీ కాంబో హ్యాట్రిక్ మ్యాజిక్

గతంలో సమంత, డైరెక్టర్ నందిని రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన ‘జబర్దస్త్’, ‘ఓ బేబీ’ సినిమాలు ఎంత పెద్ద హిట్టయ్యాయో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ మూడో సినిమా హ్యాట్రిక్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాకు రాజ్ నిడిమోరు స్క్రీన్‌ప్లే అందించారు. సమంత తన సొంత బ్యానర్ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ పై రాజ్ నిడిమోరు, హిమాంక్ రెడ్డి దువ్వురుతో కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. నటిగానే కాకుండా ప్రొడ్యూసర్‌గా కూడా సామ్ తన మొదటి అటెంప్ట్‌లోనే రూ.100 కోట్ల హిట్‌తో బ్లాక్‌బస్టర్ సక్సెస్ కొట్టింది.

55
సౌత్ నాలుగు భాషల్లో మా ఇంటి బంగారం స్ట్రీమింగ్
Image Credit : Asianet News

సౌత్ నాలుగు భాషల్లో మా ఇంటి బంగారం స్ట్రీమింగ్

జియో హాట్‌స్టార్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను భారీ రేటుకు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో సమంతతో పాటు గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, శ్రీముఖి, మంజూష ముళ్లపూడి, గౌతమి, ఆనంద్, లక్ష్మి కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. రాక్‌స్టార్ సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. థియేటర్లలో మిస్ అయిన వాళ్లు, మళ్లీ చూడాలనుకునే వాళ్లు ఈ వీకెండ్‌లో హ్యాపీగా ఇంట్లోనే కూర్చుని జియో హాట్‌స్టార్‌లో చూడొచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
సమంత రూత్ ప్రభు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
కొత్త బిజినెస్ మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ.. ఈ హీరో మొత్తం ఎన్ని వ్యాపారాలు చేస్తున్నారో తెలుసా?
Recommended image2
Bigg Boss 10: బిగ్ బాస్ హౌస్ గోడ ఎక్కి పారిపోయేందుకు ప్రయత్నించిన కంటెస్టెంట్.. వైరల్ అవుతున్న వీడియో
Recommended image3
Venkatesh: వెంకీ అలాంటి సినిమాలకు పనికిరాడు అంటూ కామెంట్స్.. ఆ 4 మూవీస్ తోనే సూపర్ హిట్స్ కొట్టిన విక్టరీ
Related Stories
Recommended image1
India's First Hydrogen Train: డీజిల్, కరెంట్ లేకుండా నీటి ఆవిరితో నడిచే సరికొత్త ట్రైన్ ఇది !
Recommended image2
Penguin Huddling: గడ్డకట్టే చలిలో వేల పెంగ్విన్లు అలా ఎందుకు నిల్చుంటాయో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved