MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Samantha Song : థియేటర్లలోనే కాదు యూట్యూబ్‌లోనూ సమంత రూలింగ్.. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సాంగ్

Samantha Song : థియేటర్లలోనే కాదు యూట్యూబ్‌లోనూ సమంత రూలింగ్.. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సాంగ్

Samantha Thassadiya Song : స్టార్ హీరోయిన సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ మూవీలోని ‘తస్సదియా’ వెడ్డింగ్ సాంగ్ 29 మిలియన్ల వ్యూస్, 25 వేలకు పైగా రీల్స్‌తో యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఈ సాంగ్ రచ్చ మాములుగా లేదు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 24 2026, 02:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సమంత తస్సదియా సాంగ్ రచ్చ.. యూట్యూబ్‌లో 29 మిలియన్ల వ్యూస్‌తో 2026 బిగ్గెస్ట్ ట్రెండింగ్ హిట్‌
Image Credit : Asianet News

సమంత తస్సదియా సాంగ్ రచ్చ.. యూట్యూబ్‌లో 29 మిలియన్ల వ్యూస్‌తో 2026 బిగ్గెస్ట్ ట్రెండింగ్ హిట్‌

సౌత్ సినిమాలో పాటల మీద మేకర్స్ గట్టిగా ఫోకస్ పెడుతున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, పండగలు, ఫ్యామిలీ సెలబ్రేషన్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సాంగ్స్‌కు బాగా ప్రయారిటీ ఇస్తున్నారు. ఇలాంటి సాంగ్స్ ఆడియన్స్‌ను చాలా ఈజీగా ఎట్రాక్ట్ చేస్తాయి. ఎందుకంటే వీటిలో ఫుల్ ఎనర్జీ, అదిరిపోయే డాన్స్, అదిరిపోయే బీట్స్ ఉంటాయి. ఇప్పుడు అంతా రీల్స్, సోషల్ మీడియా జమానా నడుస్తోంది. అందుకే ఇలాంటి మాస్, ఎనర్జిటిక్ సాంగ్స్ చాలా ఫాస్ట్‌గా వైరల్ అవుతున్నాయి. అందుకే మేకర్స్ కూడా ప్రతి సినిమాలో జనాలు నోట్లో నానేలా ఒక సాంగ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

ఈ పాటలు కేవలం సినిమా స్టోరీని ముందుకు తీసుకెళ్లడమే కాదు, ప్రమోషన్స్‌కు మెయిన్ వెపన్‌లా మారుతున్నాయి. స్టార్ హీరో, హీరోయిన్ల సినిమాల నుండి ఇలాంటి సాంగ్స్ వస్తున్నాయంటే చాలు, రిలీజ్‌కు ముందే ఇంటర్నెట్‌లో ట్రెండ్ సెట్ చేస్తున్నారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో కోట్లాది మంది ఈ పాటలను చూస్తూ షేర్ చేస్తున్నారు. ఇదే తరహాలో సమంత సాంగ్ ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సమంత కొత్త ఫెస్టివ్ వెడ్డింగ్ సాంగ్ ధమాకా
Image Credit : Asianet News

సమంత కొత్త ఫెస్టివ్ వెడ్డింగ్ సాంగ్ ధమాకా

రీసెంట్‌గా రిలీజైన ఒక కొత్త సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సాంగ్ కంప్లీట్‌గా పెళ్లి వేడుక, పండగ వాతావరణం చుట్టూ తిరుగుతుంది. సాంగ్‌లో కలర్‌ఫుల్ సెట్స్, అద్భుతమైన డాన్స్, ఒక హ్యాపీ ఫ్యామిలీని చూపించారు. పాత ట్రెడిషనల్ ట్యూన్స్‌కు ఈ కాలపు మోడ్రన్ బీట్స్‌ను మిక్స్ చేయడం ఈ పాటలో బెస్ట్ పార్ట్. అందుకే ఇది పిల్లల నుండి ముసలివాళ్ల వరకు అందరికీ తెగ నచ్చేస్తోంది. దీని కొరియోగ్రఫీ, విజువల్స్ నెక్ట్స్ లెవల్‌లో ఉండటంతో ఇంటర్నెట్‌లో దూసుకుపోతోంది. ఈ సూపర్ హిట్ సాంగే ‘ సమంత తస్సదియా’ పాట.

35
సాంగ్ లో స్టార్లు.. పర్‌ఫార్మెన్స్ అదిరిందిగా
Image Credit : instagram

సాంగ్ లో స్టార్లు.. పర్‌ఫార్మెన్స్ అదిరిందిగా

‘తస్సదియా’ అనేది ఫుల్ ఎనర్జీ, హై వోల్టేజ్‌తో కూడిన వెడ్డింగ్ సాంగ్. ఈ పాటను ఫేమస్ సింగర్స్ చిన్మయి శ్రీపాద, పుణ్య సెల్వ తమ బ్యూటిఫుల్ వాయిస్‌తో పాడారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ ఈ సాంగ్‌కు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు. లిరిసిస్ట్ రెహమాన్ సూపర్బ్ లైన్స్ రాశారు. ఈ సాంగ్ మొత్తం పండగ, ఫ్యామిలీ హ్యాపినెస్ చుట్టూ సాగుతుంది. ఇందులో సౌత్ టాప్ బ్యూటీ సమంత రూత్ ప్రభు తన డాన్స్ స్టెప్స్‌తో రెచ్చిపోయింది. తన డాన్స్ మూవ్స్, ఎక్స్‌ప్రెషన్స్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. నెటిజన్లు సమంతపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

45
యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్.. క్రేజీ పాపులారిటీ
Image Credit : others

యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్.. క్రేజీ పాపులారిటీ

ఈ సాంగ్ ఏప్రిల్ 16, 2026న ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఆ లెక్కన చూసుకుంటే జూన్ 24 నాటికి ఈ పాట రిలీజై దాదాపు 69 రోజులు పూర్తయింది. యూట్యూబ్‌లో ఇప్పటివరకు ఈ సాంగ్‌కు 29 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. మిగతా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ చూసుకుంటే ఈ వ్యూస్ కౌంట్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో ఈ పాట తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే దాదాపు 25 వేలకు పైగా రీల్స్ క్రియేట్ అయ్యాయి. ఈ సాంగ్ ట్యూన్ చాలా సింపుల్‌గా, ఫన్నీగా ఉండటంతో జనాలు ఈజీగా డాన్స్ స్టెప్స్ కాపీ చేస్తూ రీల్స్ చేస్తున్నారు.

55
‘మా ఇంటి బంగారం’ మూవీ, బాక్సాఫీస్ కలెక్షన్స్
Image Credit : others

‘మా ఇంటి బంగారం’ మూవీ, బాక్సాఫీస్ కలెక్షన్స్

ఈ ధమాకా సాంగ్ ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaaram) సినిమాలోనిది. ఈ చిత్రానికి నందిని రెడ్డి డైరెక్షన్ వహించారు. సినిమాలో సమంతతో పాటు గౌతమి, దిగంత్, గుల్షన్ దేవయ్య లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ నటించారు. వీళ్లతో పాటు మరికొంత మంది క్రేజీ సపోర్టింగ్ కాస్ట్ కూడా ఉన్నారు. ఇది కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్. ఈ మూవీకి బాక్సాఫీస్ దగ్గర ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా దూసుకుపోతోంది. రూ. 25 కోట్ల నుండి రూ. 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం 4 రోజుల్లోనే వరల్డ్‌వైడ్‌గా రూ. 46 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Related Stories
Recommended image1
Can Dogs See Every Colors : కుక్కలకు కనిపించేవి రెండు రంగులేనా? అవి చూసే అసలైన రంగులేంటో తెలుసా?
Recommended image2
IRCTC Srisailam Tour: శ్రీశైలం మల్లన్న దర్శనంతో పాటు యాదాద్రి కవర్ చేసే ఐఆర్‌సీటీసీ స్పిరిచువల్ టూర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved