- Home
- Entertainment
- Nidhhi Agerwal: హీరోయిన్స్ కి అదొక్కటి ఉంటే చాలు... సక్సెస్ ఫార్ములా చెప్పిన నిధి అగర్వాల్
Nidhhi Agerwal: హీరోయిన్స్ కి అదొక్కటి ఉంటే చాలు... సక్సెస్ ఫార్ములా చెప్పిన నిధి అగర్వాల్
యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ కెరీర్ ఒడిదుకులతో సాగుతుండగా... ఆ ఒక్కటి ఉంటే సక్సెస్ సొంతం అంటుంది. తాజా ఇంటర్వ్యూలో నిధి అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నిధి అగర్వాల్ పరిశ్రమకు వచ్చి ఐదేళ్లు దాటిపోతుంది. ఈ క్రమంలో ఆమె సక్సెస్ మంత్ర వెల్లడించారు. సాధారణంగా సినిమాల్లో విజయం సాధించాలంటే హార్డ్ వర్క్ చేయాలి, టాలెంట్ చూపించాలి అంటారు. నిధి మాత్రం అవేమీ అవసరం లేదు, జస్ట్ లక్ ఉంటే ఇండస్ట్రీని ఏలేయవచ్చు అంటున్నారు.
దీనికి ఆమె కొన్ని ఉదాహరణలు కూడా చెబుతున్నారు. కొన్ని కథలు పేపర్ పై అద్భుతంగా ఉంటాయి. వెండితెర మీద తేలిపోతాయి. పేపర్ మీద సాదా సీదాగా ఉన్న కథలు కొన్ని సిల్వర్ స్క్రీన్ మీద అద్భుతం చేస్తాయి. కాబట్టి 90 శాతం సక్సెస్ కి లక్కే కారణం అన్నారు. అంటే మంచి కథలు ఎంచుకునే వాళ్లకు సక్సెస్ వస్తుందన్న సిద్ధాతం కరెక్ట్ కాదని నిధి పరోక్షంగా చెప్పింది.
కథల ఆధారంగా సినిమాలు ఎంచుకునే స్థాయికి నేను ఇంకా రాలేదని నిధి అన్నారు. అయితే వైవిధ్యమైన పాత్రలు చేయాలని ఉంది. నాట్యం ప్రధానంగా తెరకెక్కే చిత్రాలపై ఆసక్తి ఉంది అన్నారు. ఇంకా మాట్లాడుతూ... తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటన పరంగా ఎలాంటి తేడాలు లేవు. బిజినెస్ సమీకరణాల్లో మార్పులు ఉన్నాయని నిధి చెప్పుకొచ్చారు.
ఇక నిధి(Nidhhi Agarwal) కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. వరుస ప్లాప్స్ ఆమె సతమతమవుతున్నారు. ఈ ఏడాది 'హీరో' మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన హీరో పర్వాలేదు అనిపించుకుంది. మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా ఈ మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. కమర్షియల్ గా సక్సెస్ కాకపోవడంతో మరో ప్లాప్ ఆమె ఖాతాలో చేరింది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. నోరా ఫతేహి మరో హీరోయిన్ గా నటించారు.
మున్నా మైఖేల్ అనే హిందీ మూవీతో నిధి సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యారు. సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. నిధి కెరీర్ లో ఇస్మార్ట్ శంకర్ క్లీన్ హిట్ మూవీగా ఉంది. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఆ మూవీలో రామ్ హీరోగా నటించారు. నిధి అగర్వాల్ తో పాటు నభా నటేష్ హీరోయిన్ గా నటించారు. ఈ మూవీ రూ. 75 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ తో వసూళ్లు దుమ్మురేపింది. ఆ రేంజ్ హిట్ మరలా ఆమెకు దక్కలేదు.