- Home
- Entertainment
- Janaki Kalaganaledu: జానకి ముందే రామచంద్రకు ముద్దులు పెట్టిన ఇంగ్లీష్ పిల్ల.. యోగిని అవమానించిన రామ!
Janaki Kalaganaledu: జానకి ముందే రామచంద్రకు ముద్దులు పెట్టిన ఇంగ్లీష్ పిల్ల.. యోగిని అవమానించిన రామ!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమౌతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ పరువు గల కుటుంబ నేపథ్యంలో ప్రసారమవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు ఏప్రిల్ 27 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఎపిసోడ్ ప్రారంభంలోనే రామ (Rama) వంటిపై బట్టలు లేక పోవడంతో జానకి (Janaki) రామని చూసి సిగ్గు పడుతుంది. అంతేకాకుండా తన కళ్లకున్న కాటుకను తీసి రామ మీసాలకు అంటిస్తుంది. అలా వారిద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశం జరుగుతుండగా.. అప్పుడే ఫోన్ రావడంతో వారి మధ్య రొమాన్స్ ఆగిపోతుంది. ఇక రామ ఆ ఫోన్ తీసి మాట్లాడుతాడు.
ఇక ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటుంది. దాంతో రామకు (Rama) అర్థం కాకపోవడంతో ఇబ్బంది పడుతుంటాడు. వెంటనే జానకి ఫోన్ తీసుకొని మాట్లాడుతుంది. అంతేకాకుండా తన ఇంగ్లీష్ తో బాగా అదరగొడుతుంది. ఆ ఇంగ్లీష్ అమ్మాయి తన పేరు లూసీ (Luci) అని.. నిన్న మిస్డ్ కాల్ వచ్చింది.. ఎందుకు ఫోన్ చేశారని అడుగుతుంది.
దాంతో మీ బ్యాగును పోగొట్టుకున్నారు. అందులో డబ్బు మీ పాస్ పోర్టు ఉంది అందుకే ఫోన్ చేశాం అని జానకి (Janaki) అంటుంది. దాంతో లూసీ తను ఫుడ్డు రీసెర్చ్ కోసం వచ్చానని.. ఆత్రేయపురం పూతరేకులు పై రీసెర్చ్ చేస్తున్నానని.. వచ్చి పాస్ పోర్ట్ తీసుకుంటానని అంటుంది. ఇక జానకి తమ షాప్ అడ్రస్ లూసీ (Luci) కి చెబుతుంది.
ఇక లూసీ స్వీట్ షాప్ దగ్గరికి వచ్చేస్తుంది. అక్కడ రామ (Rama) ఉండటంతో.. లూసీ భాషా విని ఏం అర్థం కానట్లుగా కనిపిస్తాడు. వెంటనే జానకిని పిలిచి ఆమెతో మాట్లాడిస్తాడు. ఇక జానకి (Janaki) లూసీ బ్యాగ్ ఇవ్వటంతో లూసీ సంతోషపడుతుంది. ఇక పూతరేకుల రీసెర్చ్ గురించి వచ్చిన ఆమెకు రామ పూతరేకుల గురించి వివరిస్తాడు.
అంతేకాకుండా పూతరేకులను తనకు ఇవ్వడంతో.. పూతరేకుల రుచికి లూసీ (Luci) ఫిదా అవుతుంది. ఎవరు చేశారని అడగటంతో రామ తన తల్లి నేర్పించిందని అంటాడు. ఇక దాంతో లూసీ నెక్స్ట్ వీక్ ఫుడ్ కాంపిటీషన్ వుందని అక్కడికి వచ్చి పాల్గొనమని చెబుతుంది. అక్కడి నుంచి లూసీ వెళ్తూ వెళ్తూ.. జానకితో (Janaki) మీ భర్త హాండ్సంగా ఉన్నాడని ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది.
వెంటనే రామ (Rama) తనకు అర్థం కాలేదని అడగటంతో జానకి బుంగమూతి పెట్టుకుని ముద్దుగా అలుగుతుంది. ఇక ఆ తర్వాత జానకి.. ఫుడ్ కాంపిటీషన్ గురించి చెబుతుంది. తరువాయి భాగంలో యోగి దంపతులు జ్ఞానంబ (Jnanamba) ఇంటికి వస్తారు. వెంటనే రామ ఆగండి అంటూ వాళ్ల దగ్గరికి వెళ్తాడు. ఇక రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.