- Home
- Entertainment
- TV
- అల్లు అర్జున్ కోసం క్యూలో ఉన్న డైరెక్టర్లు, నెక్ట్స్ బన్నీ చేయబోయే సినిమా ఎవరితో?
అల్లు అర్జున్ కోసం క్యూలో ఉన్న డైరెక్టర్లు, నెక్ట్స్ బన్నీ చేయబోయే సినిమా ఎవరితో?
Allu Arjun ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో భారీగా డిమాండ్ ఉన్న హీరో అల్లు అర్జున్. పుష్ప తరువాత బన్నీ రేంజ్ మామూలుగా లేదు.. ఐకాన్ స్టార్ కోసం స్టార్ డైరెక్టర్లు కూడా క్యూ కడుతున్నారు. బాలీవుడ్ నుంచి కూడా బన్నీకి డిమాండ్ భారీగా పెరిగిపోతోంది.

అల్లు అర్జున్ కోసం క్యూ కడుతోన్నడైరెక్టర్లు
పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన తరువాత పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్ డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేసిన బన్నీకి బాలీవుడ్ లో కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగో పెరిగింది. దాంతో బన్నీ డేట్స్ కోసం టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ టాప్ డైరెక్టర్లు ఆయన ఇంటి ముందు క్యూ కడుతున్నారు. అల్లు అర్జున్ తో సినిమా చేయడనికి స్టార్ డైరెక్టర్లు చాలామంది ఇప్పటికే కథలు సిద్దం చేసుకున్నారట. ఈ లిస్ట్ లో తెలుగు దర్శకులతో పాటు తమిళ, కన్నడ, హిందీ డైరెక్టర్లు కూడా ఉండటం విశేషం. ఈ పరిణామంతో అల్లు అర్జున్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు.
అట్లీతో పాన్ వరల్డ్ మూవీ
ప్రస్తుతం అల్లు అర్జున్ దృష్టి అంతా అట్లీ సినిమాపైనే ఉంది. ఈసినిమా కోసం ముంబయ్ కి మకాం మార్చాడు ఐకాన్ స్టార్. దాదాపు 800 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు. హాలీవుడ్ స్థాయి విజువల్ స్టాండర్డ్స్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అట్లీ, గతంలో షారుఖ్ ఖాన్‌ను ‘జవాన్’గా చూపించినదానికి మించి అల్లు అర్జున్ ను చూపించబోతున్నాడు. బన్నీని గ్లోబల్ లెవెల్‌లో పరిచయం చేయడానికి స్పెషల్ విజువల్ వండర్‌ను రూపొందిస్తున్నాడు అట్లి. పుష్ప తరువాత ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లో మరో కీలక మలుపు అవుతుందనే అంచనాలు ఉన్నాయి.
బన్నీ కోసం డైరెక్టర్ల వెయిటింగ్
అల్లు అర్జున్ కోసం చాలామంది దర్శకులు కథలతో వెయిటింగ్ లో ఉన్నారు. ఆ లిస్ట్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందున్నాడు. ఆయనతో పాటు కల్ట్ హిట్‌లకు ప్రసిద్ధి చెందిన సందీప్ రెడ్డి వంగా కూడాకథతో రెడీగా ఉన్నాడు. అంతే కాదు ఈ ఇద్దరు దర్శకులు ఇప్పటికే అల్లు అర్జున్‌కు కథలు సిద్ధం చేసి అడ్వాన్స్‌లు కూడా తీసుకున్నట్లు తెలిసింది. అట్లీ సినిమా పూర్తయ్యాక వీరిద్దరిలో ఎవరు బన్నీతో పని చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. . క్లాస్ టచ్ ఇవ్వగల త్రివిక్రమ్, వైల్డ్ ఇంటెన్సిటీ చూపించే సందీప్ రెడ్డిలలో ఎవరికి బన్నీ అవకాశం ఇస్తాడో కూడాలి. సందీప్ రెడ్డి మాత్రం ప్రస్తుతం ప్రభాస్ సినిమాను స్టార్ట్ చేశాడు.. అది కంప్లీట్ అయ్యే వరకూ టైమ్ పట్టే అవకాశం ఉంది.
ఐకాన్ స్టార్ కోసం తమిళ దర్శకులు
అల్లు అర్జున్ కోసం వెయిట్ చేస్తున్నవారిలో తమిళ దర్శకులు కూడా ఉన్నారు. ఇప్పటికే తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేస్తున్నాడు బన్నీ. ఆయతో పాటు మరో పేరు కూడా బయటకు వచ్చింది. విక్రమ్, లియో లాంటి బ్లాక్‌బస్టర్స్‌తో తనదైన మార్క్ సాధించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా ఇప్పుడు అల్లు అర్జున్‌తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. లోకేష్ రూపొందిస్తున్న డార్క్ యూనివర్స్ లో అల్లు అర్జున్ కూడా అడుగుపెట్టే అవకాశం ఉందనే వార్తలు ఇండస్ట్రీలో వైరల్‌గా మారాయి.
అల్లు అర్జున్ తో 1000 కోట్ల సినిమా
ఇక అల్లు అర్జున్ ను ఇప్పటికే కలిసి మాట్లాడాడు బాలీవుడ్ దర్శకులు సంజయ్ లీలా భన్సాలీ. ఆయన చాలా కాలం నుంచి అల్లు అర్జున్ తో ఓ భారీ సినిమాను తెరకెక్కించాలన్న ప్లాన్ లో ఉన్నాడు. కానీ బన్నీ నుంచే ఇప్పటి వరకూ గ్రీన్ సిగ్నల్ అందలేదు. అల్లు అర్జున్ తో 1000 కోట్ల భారీ సినిమాను సంజయ్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇక త్వరలో వీరి కాంబో కూడా కలిసే అవకాశం కనిపిస్తోంది. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నిల్ కూడా ఎన్టీఆర్ సినిమా తరువాత సలార్ 2 కంప్లీట్ చేసి.. బన్నీతో సెట్స్ మీదకు వెళ్లాలని ప్లాన్ చేశాడట. మరికొంతమంది ప్రముఖ దర్శకులు కూడా బన్నీతో పని చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
జాగ్రత్తగా అడుగులు వేస్తోన్న ఐకాన్ స్టార్
అల్లు అర్జున్ గతంలో లా లేడు.. అప్పుడు వరుసగా సినిమాలు చేసినప్పటికీ ఇప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. తొందరపడి ప్రాజెక్టులు ఒప్పుకోకుండా వచ్చే ఐదేళ్లకు పక్కా ప్లానింగ్‌తో ముందుకు సాగుతున్నట్లు సమాచారం. కేవలం బాక్సాఫీస్ నంబర్లు కాకుండా, తన స్టార్‌డమ్‌ను, ఇమేజ్ ను నిలబెట్టగలిగే డైరక్టర్లను ఎంచుకుని సినిమాలు చేయాలని అనుకుంటున్నాడట అల్లు అర్జున్. మరో వైపు బన్నీ పుష్ప3 కూడా అనౌన్స్ చేసి ఉన్నారు. మరి అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. మరి చూడాలి అల్లు అర్జున్ నెక్ట్స్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేది.

