Telugu

`అనగనగా ఒక రాజు `చిత్రంతో రాబోతున్న మీనాక్షి

మీనాక్షి చౌదరీ ఈ సంక్రాంతికి `సంక్రాంతికి వస్తున్నాం` చిత్రంతో హిట్‌ అందుకుంది. ఇప్పుడు వచ్చే సంక్రాంతిని టార్గెట్‌ చేసింది. ఈ సారి `అనగనగా ఒక రాజు` చిత్రంతో రాబోతుంది.

Telugu

వచ్చే సంక్రాంతికి మీనాక్షి మూవీ

ఇందులో ఆమె నవీన్‌ పొలిశెట్టితో కలిసి నటించింది. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 14న విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచింది టీమ్.

Image credits: instagram/@meenakshichaudhary006
Telugu

భీమవరం బల్మా సాంగ్‌ విడుదల

అందులో భాగంగా ఈ చిత్రం నుంచి `భీమవరం బల్మా` అనే సాంగ్‌ని భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో గురువారం విడుదల చేశారు. ఈ పాటని హీరో నవీన్‌ పొలిశెట్టి పాడటం విశేషం.

Image credits: instagram/@meenakshichaudhary006
Telugu

ఊపేస్తున్న `భీమవరం బల్మా` సాంగ్‌

ఈ పాటకి మిక్కీ జే మేయర్‌ సంగీతం అందించగా, చంద్రబోస్‌ రాశారు. నవీన్‌ పొలిశెట్టి ఈ పాటని ఉర్రూతలూగించేలా పాడారు. దీనికి విశేష స్పందన లభిస్తోంది.

Image credits: instagram/@meenakshichaudhary006
Telugu

నవీన్‌పై మీనాక్షి ప్రశంసలు

ఈ ఈవెంట్‌లో మీనాక్షి చౌదరీ మాట్లాడుతూ నవీన్‌ పొలిశెట్టిపై ప్రశంసలు కురిపించింది. నవీన్‌ మల్టీ టాలెంటెడ్‌ అని, ఈ సినిమాకి వన్‌ మ్యాన్‌ ఆర్మీలా పనిచేశాడని కొనియాడింది.

Image credits: instagram/@meenakshichaudhary006
Telugu

పాటకి 15 మిలియన్స్ వ్యూస్‌

నవీన్‌, మీనాక్షి కలిసి ఈ పాటలో వేసిన డాన్సులు ఆకట్టుకుంటున్నాయి. ఈ ఇద్దరి జోడి చక్కగా కుదిరి పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. పాట ఇప్పటికే 15 మిలియన్‌ వ్యూస్‌ సాధించడం విశేషం. 

Image credits: instagram/@meenakshichaudhary006
Telugu

వచ్చే సంక్రాంతికి మరో హిట్‌పై కన్ను

గత సంక్రాంతికి బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న మీనాక్షి  ఇప్పుడు `అనగనగా ఒక రాజు`తో మరో బ్లాక్‌ బస్టర్‌ని అందుకుంటుందా అనేది చూడాలి. ఈ చిత్రాన్ని నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

Image credits: instagram/@meenakshichaudhary006

ఈ దెబ్బతో కీర్తిసురేష్‌ టాలీవుడ్‌ కెరీర్‌ ప్రశ్నార్థకమేనా?

లాక్‌ డౌన్‌కి ముందే అనుపమా సర్‌ప్రైజ్‌.. ఓటీటీలో ది పెట్‌ డిటెక్టివ్‌

ఇండియా టాప్‌ 10 హీరోయిన్లు వీరే.. తమన్నా లాస్ట్, ఫస్ట్ ఎవరంటే?

అతడితో లిప్ లాక్ సీన్స్ లో నటించడం కంఫర్టబుల్, ఈ గిరిజా ఓక్ ఎవరు ?