ధనుష్ తో లవ్ స్టోరీ.. లోకేష్ కనగరాజ్ మతిపోయే ప్లాన్
కూలి సినిమా దర్శకుడు లోకేష్ కనకరాజ్, తన తాజా చిత్రం కైది 2 తర్వాత, ఒక రొమాంటిక్ కథాంశం ఉన్న సినిమాను దర్శకత్వం వహించనున్నారట.

`కూలి` దర్శకుడు లోకేష్ కనకరాజ్
కోలీవుడ్ లో నంబర్ 1 దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్ కనకరాజ్, `మానగరం`, `మాస్టర్`, ఖైదీ`, `విక్రమ్`, `లియో` వంటి ఐదు సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ తో `కూలి` అనే సినిమాను తీస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో, అనిరుధ్ సంగీత దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ఈ సంవత్సరం దీపావళికి విడుదల కానుంది.
`ఖైదీ 2` లోడింగ్
`కూలి` తర్వాత, కార్తి నటించనున్న ` ఖైదీ 2` కి లోకేష్ దర్శకత్వం వహించనున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాణంలో, మలయాళ నటి రజిషా విజయన్ కథానాయికగా నటించనున్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది.
బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న లోకేష్
`ఖైదీ2` తర్వాత లోకేష్ ఏ సినిమా చేస్తారన్నది సస్పెన్స్ గా ఉంది. `విక్రమ్ 2`, `రోలెక్స్`,` ఇరుంబుకై మాయావి` వంటి సినిమాలున్నా, వాటిని పక్కన పెట్టి బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తో సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి.
లోకేష్ దర్శకత్వంలో ధనుష్
కానీ, `ఖైదీ 2 ` తర్వాత ధనుష్ తో ఒక రొమాంటిక్ సినిమా చేయనున్నట్టు తాజా వార్త. యాక్షన్ సినిమాల దర్శకుడిగా పేరున్న లోకేష్, ధనుష్ కి ఒక ప్రేమకథ చెప్పి ఓకే చేసుకున్నారట. ఇద్దరూ బిజీగా ఉండటంతో, కమిట్మెంట్స్ పూర్తయ్యాక ఈ సినిమా మొదలుపెట్టనున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. యాక్షన్ సినిమాలతో దుమ్ములేపుతున్న లోకేష్‌నుంచి రొమాంటిక్ లవ్ స్టోరీ అంటే కొత్తగా ఉంది.
read more: రజినీతో 1000 కోట్ల దర్శకుడి సినిమా, హీరోయిన్ గా రష్మిక.. మరో సూపర్ స్టార్ కూడా
also read: విజయశాంతి పెళ్లి తర్వాత బాలకృష్ణతో సినిమాలు ఎందుకు తగ్గించింది? ఆమె భర్తనే ఆ పని చేశాడా?