MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • దుమ్ము దులిపేస్తున్న ఓజీ.. కాంతార చాప్టర్ 1ని బీట్ చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ

దుమ్ము దులిపేస్తున్న ఓజీ.. కాంతార చాప్టర్ 1ని బీట్ చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ

OTT Movies: ఓటీటీలో కాంతార 1కి కల్యాణి ప్రియదర్శన్ లోక చిత్రం షాకిచ్చింది. ఇది ఆశ్చర్యం కలిగించే విషయమే. కానీ అలా ఎందుకు జరిగింది, లోక చిత్ర జోరుకి కారణం ఏంటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Nov 03 2025, 10:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఓటీటీలో బ్లాక్ బస్టర్ మూవీస్
Image Credit : Asianet News

ఓటీటీలో బ్లాక్ బస్టర్ మూవీస్

ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లపై విడుదలైన సినిమాల మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది. లోక: చాప్టర్ 1 చంద్ర, కాంతార: చాప్టర్ 1, బాఘీ 4 , ఇడ్లీ కడై (ఇడ్లీ కొట్టు) వంటి చిత్రాలు వరుసగా జియోహాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో డిజిటల్ ప్రీమియర్ అయ్యాయి. అయితే, ఇప్పటికే అక్టోబర్ 23న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ కూడా ఈ పోటీలో తన స్థానం నిలబెట్టుకుంది. ఇంకా ఓజీ జోరు తగ్గలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జోరు తగ్గని ఓజీ 
Image Credit : instagram

జోరు తగ్గని ఓజీ 

ఓరామాక్స్ తాజా నివేదిక ప్రకారం, పవన్ కళ్యాణ్ నటించిన ఈ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 మధ్య 3 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇది మొదటి వీకెండ్ వ్యూస్ తో సమానంగా ఇప్పుడు కూడా ఓజీ వ్యూస్ సాధిస్తోంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర భాషా ప్రేక్షకులనూ ఆకట్టుకుంటోంది.

35
ఒకేసారి ఓటీటీలోకి వచ్చిన కాంతార1, లోక 
Image Credit : Film

ఒకేసారి ఓటీటీలోకి వచ్చిన కాంతార1, లోక 

మరోవైపు ఓజీ తర్వాత ఓటీటీలో రిలీజైన కాంతార చాప్టర్ 1, లోక చాప్టర్ 1 చంద్ర చిత్రాలు కూడా ఓటీటీలో దూసుకుపోతున్నాయి. ఈవారం థియేటర్లలో ఆసక్తికర సినిమాలు రిలీజ్ కాలేదు. రవితేజ నుంచి వచ్చిన మాస్ జాతర కూడా నిరాశపరిచింది. దీనితో ఆడియన్స్ కి ఓజీ, కాంతార1, లోక చిత్రాలతో ఓటీటీ బెస్ట్ ఆప్షన్ గా మారింది. ఈ వారం ప్రధాన ఆకర్షణగా నిలిచిన రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలు లోక: చాప్టర్ 1 చంద్ర, కాంతార: చాప్టర్ 1. రెండు సినిమాలు ఒకే రోజున ఓటీటీలో విడుదలయ్యాయి. జియోహాట్‌స్టార్‌లో లోక: చాప్టర్ 1 చంద్ర, ప్రైమ్ వీడియోలో కాంతార: చాప్టర్ 1 స్ట్రీమింగ్ ప్రారంభమయ్యాయి.

45
సూపర్ హీరోగా అదరగొట్టిన కల్యాణి ప్రియదర్శన్ 
Image Credit : Hombale Films

సూపర్ హీరోగా అదరగొట్టిన కల్యాణి ప్రియదర్శన్ 

లోకహ్: చాప్టర్ 1 చంద్ర ఒక సూపర్‌ హీరో థీమ్‌తో రూపొందిన చిత్రం కాగా, ఇందులో క‌ల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ మూవీలో కల్యాణి ప్రియదర్శన్ సూపర్ హీరోగా అదరగొట్టారు. మరోవైపు, కాంతార: చాప్టర్ 1 చిత్రంలో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించారు. పౌరాణిక నేపథ్యం, గ్రామీణ కథాంశం, ఆధ్యాత్మిక అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో రికార్డు స్థాయిలో ఆదరణ పొందిన తర్వాత ఇప్పుడు ఓటీటీలో కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది.

55
కాంతార 1కి లోక షాక్ 
Image Credit : instagram

కాంతార 1కి లోక షాక్ 

కానీ, తాజా ఓరామాక్స్ రిపోర్ట్ ప్రకారం లోక: చాప్టర్ 1 చంద్ర ఓపెనింగ్ వీకెండ్‌లో కాంతార: చాప్టర్ 1ను అధిగమించింది. లోక 3.8 మిలియన్ వ్యూస్, కాంతార 1 చిత్రం  3.5 మిలియన్ వ్యూస్ సాధించాయి. కాంతార 1 కంటే లోక చిత్రం అత్యధిక వ్యూస్ సాధించడం ఆశ్చర్యమే. కానీ దానికి ఓ కారణం ఉంది. కాంతార1 ఇంకా హిందీ వెర్షన్ ఓటీటీలో రిలీజ్ కాలేదు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ఓటీటీ
పవన్ కళ్యాణ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: నాగార్జున సినిమా హోరులో డిజాస్టర్ అయిన చిరంజీవి మూవీ..డైరెక్టర్ తో గొడవ అందుకేనా ?
Recommended image2
Katrina Kaif Trolling: కత్రినా ట్రోల్ అవుతుంటే సల్మాన్ ఫైర్ అయ్యాడు.. మరి భర్త విక్కీ కౌశల్ ఎందుకు సైలెంట్?
Recommended image3
The Paradise Review: నాని జాతకం మారబోతోందా? స్టార్ హీరోల లిస్ట్ లో చేరినట్టేనా? ది పారడైజ్ మూవీ ఫస్ట్ రివ్యూ..
Related Stories
Recommended image1
దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఎనర్జీని మ్యాచ్ చేయగలిగే ఒకే ఒక్క హీరో ఎవరో తెలుసా, బన్నీ కాదు..
Recommended image2
చిరు, బాలయ్య, వెంకీ, నాగార్జున నలుగురితో రొమాన్స్ చేసి పెళ్లి కాకుండా ఉండిపోయిన హీరోయిన్.. కారణం అతడేనా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved