ప్రియపై కోపంతో ఊగిపోయిన లోబో.. మీసం మెలేసిన నటరాజ్.. రవి బహిరంగ క్షమాపణ
కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 విజయవంతంగా కొనసాగుతోంది. ఎపిసోడ్స్ గడిచేకొద్దీ ఆసక్తిగా మారుతోంది. 23వ ఎపిసోడ్ కూడా ఆసక్తికరంగా సాగింది.
కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 విజయవంతంగా కొనసాగుతోంది. ఎపిసోడ్స్ గడిచేకొద్దీ ఆసక్తిగా మారుతోంది. 23వ ఎపిసోడ్ కూడా ఆసక్తికరంగా సాగింది. హౌస్ లో ఇంటి సభ్యుల మధ్య క్యాజువల్ టాక్స్ తో ఎపిసోడ్ మొదలవుతుంది. హౌస్ లో వర్క్ జరుగుతున్న కారణంగా బిగ్ బాస్ అందరిని బెడ్ రూమ్ లోకి వెళ్ళమని చెబుతాడు. కానీ సిరి లేట్ గా వస్తుంది. దీంతో కెప్టెన్ జశ్వంత్ సిరికి శిక్ష విధిస్తాడు.
ఈలోపు నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అందరు గార్డెన్ ఏరియాలో ముందుగా అరేంజ్ చేసి ఉంచిన వారివారి ఫోటోల వద్ద ఇంటి సభ్యులు నిలబడతారు. ఒక్కొక్కరు ఇద్దరు సభ్యులని నామినేట్ చేయవచ్చు. నామినేట్ చేయాలనుకున్న వారి ఫోటోనుంచి ఒక ముక్క కట్ చేసి పూల్ లో పడేయాలి. నామినేషన్ కి కారణం చెప్పాలి. ప్రియ ఈ ప్రక్రియని ప్రారంభిస్తుంది. లోబో, సన్నీ లని ఆమె నామినేట్ చేస్తుంది.
రవి, నటరాజ్ మాస్టర్ లని విశ్వ నామినేట్ చేస్తాడు. ఇక లోబో.. ప్రియ, సిరి లని నామినేట్ చేస్తాడు. లోబో..ప్రియాని నామినేట్ చేసే సమయంలో పెద్ద గందరగోళమే జరుగుతుంది. తన ప్రేమని కించపరిచిందనే బాధతో లోబో.. ప్రియాన నామినేట్ చేస్తాడు. లోబో ఎమోషనల్ అవుతూ మాట్లాడుతూ ఉంటే ప్రియా మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. దీనితో లోబో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది. లెట్ మీ ఫినిష్ అని గట్టిగా కేకలు పెడుతూ లోబో కోపంతో ఊగిపోతాడు.
ఆ తర్వాత ఎమోషనల్ అయి ఏడుస్తాడు. ఏడుస్తున్న లోబోని శాంతపరిచే ప్రయత్నం చేస్తాడు రవి. ఈ సంఘటనతో ప్రియా కూడా కంటతడి పెడుతుంది. ఇక శ్రీరామ్.. శ్వేత, అనీ మాస్టర్ ని నామినేట్ చేస్తాడు. శ్వేత తనని వెన్నుపోటు పొడిచింది అనే కారణంతో శ్రీరామ్ ఆమెని నామినేట్ చేస్తాడు.
ఆ తర్వాత నటరాజ్ విశ్వని నామినేట్ చేస్తాడు. కాసేపు వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. నటరాజ్ మీసం మెలేస్తూ.. సింహంతో వేట.. నాతో ఆట వద్దు అంటూ విశ్వపై హంగామా చేస్తాడు. నువ్వు సింహం అయితే బిగ్ బాస్ గేటు బయట.. ఇక్కడ కాదు అంటూ విశ్వ గట్టిగా కౌంటర్ ఇస్తాడు.
ఇక రవి.. కాజల్, నటరాజ్ లని నామినేట్ చేస్తాడు. నామినేషన్ కి ముందు రవి గతవారం జరిగిన సంఘటనకు ప్రియా, లహరిలకి బహిరంగ క్షమాపణ చెబుతాడు. ఇక సన్నీ..ప్రియా, కాజల్ లని నామినేట్ చేస్తాడు. మొత్తంగా ఈ వారం 8 మంది సభ్యులు నామినేట్ అవుతారు. నామినేషన్ లో ఉన్న సభ్యులు నటరాజ్, లోబో, రవి, ప్రియా, కాజల్, సిరి, సన్నీ, అనీ మాస్టర్.