MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • అల్లు అర్జున్ ఐడియాతోనే ‘లైగర్’ పుట్టింది.. పూరీ కామెంట్స్.. ఇంతకీ బన్నీ ఏం చెప్పాడంటే?

అల్లు అర్జున్ ఐడియాతోనే ‘లైగర్’ పుట్టింది.. పూరీ కామెంట్స్.. ఇంతకీ బన్నీ ఏం చెప్పాడంటే?

కొన్ని గంటల్లో ‘లైగర్’ ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఈ క్రమంలో  Liger మూవీకి అసలు కారణం అల్లు అర్జున్ అంటూ పూరీ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు.  ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.   

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 24 2022, 08:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) తాజాగా తెరకెక్కించనున్న చిత్రం ‘లైగర్’. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత మరోసారి బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకునేందుకు రెడీ అయ్యారు. ఈ సందర్భంగా పక్కా కమర్షియల్ హిట్ కొట్టాలనే ‘లైగర్’  చిత్రాన్ని కాస్తా సమయం తీసుకొని మరీ రూపొందించారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను కూడా యూనిట్ చాలా భిన్నంగా నిర్వహించింది. దీంతో ఇండియా మొత్తంగా ఆడియెన్స్ కు సినిమా రీచ్  అయ్యింది. ఈ క్రమంలో ప్రత్యేక ఇంటర్వ్యూల ద్వారా కూడా సోషల్ మీడియాలో మూవీని ప్రమోట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్, అటు విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమా విశేషాలను పంచుకుంటున్నారు. 
 

36

తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) పూరీ జగన్నాథ్ ను స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. చిత్రానికి సంబంధించిన అన్ని విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో అసలు ‘లైగర్’ చిత్రం పుట్టడానికి అసలు కారణం అల్లు అర్జున్ (Allu Arjun) అని చెప్పారు. ‘ఇద్దరమ్మాయిలతో..’చిత్ర షూటింగ్ సమయంలో సినిమాకు బీజం పడిందన్నారు. 
 

46

ఇద్దరమ్మాయిలతో.. చిత్రం చేసేప్పుడు బన్నీ మాట్లాడుతూ.. ‘హాలీవుడ్ లో ఒక డైరెక్టర్ తన ప్రతి సినిమాలో హీరోకి ఒక లోపం పెడతాడు. మీరెందుకు అలాంటి కథలు రాయడం లేదు’ అని పూరీని ప్రశ్నించాడంట. దీంతో వెంటనే హీరోకు ‘నత్తి’ఉంటే ఎలాగుంటుందని బన్నీతో అనగా.. బాగుంటుందని బదులిచ్చినట్టు తెలిపారు. అయితే అల్లుఅర్జున్ ఇచ్చిన ఐడియాను ఫూరీ ఫాలోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారడంతో పాటు.. పూరీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 
 

56

ఇంకా సినిమా గురించి మాట్లాడుతూ.. లైగర్ పక్కా కమర్షియల్ మూవీ అని తెలిపారు. విజయ్ దేవరకొండ నటన అద్భుతంగా ఉంటుందని, ఊహించని దానికంటే సినిమా బాగొచ్చిందని చెప్పారు. కరీంనగర్ నుంచి తల్లీ కొడుకు ముంబైకి చేరుకొని ఎలాంటి కష్టాలు పడుతారు.. విజయ్ ఇంటర్నేషనల్ బాక్సర్ ఎలా అవుతాడనేది.. అందుకు ఏర్పడిన పరిస్థితులు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. 

66

మూడేండ్లుగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఎట్టకేళకు ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రంలో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) - బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే జంటగా నటించారు. ఈ మూవీతో అనన్య సౌత్ కు ఎంట్రీ ఇస్తుండగా.. విజయ్ బాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. ధర్మ ప్రొడక్షన్, పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మించారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
అల్లు అర్జున్
విజయ్ దేవరకొండ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jhansi: బొక్కలో పాయింట్స్ అన్నీ చెబుతుంది, వర్షిణిపై రెచ్చిపోయిన షాలిని..హౌస్ కి ఫస్ట్ కెప్టెన్ గా ఝాన్సీ
Recommended image2
Premane Oorilo: 'ప్రేమనే ఊరిలో' మూవీ సాంగ్ లాంచ్.. కామాక్షి భాస్కర్ల కామెంట్స్ వైరల్
Recommended image3
Nabha Natesh: వరుస ఫ్లాపుల హీరోయిన్ గ్లామర్ లుక్ అదిరిందిగా, ఆశలన్నీ ఆ మూవీపైనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved