- Home
- Entertainment
- Lenin Day 4 Collections: సోమవారం భారీ డ్రాప్.. అఖిల్ `లెనిన్` నాలుగు రోజుల్లో కలెక్ట్ చేసింది ఎంతంటే?
Lenin Day 4 Collections: సోమవారం భారీ డ్రాప్.. అఖిల్ `లెనిన్` నాలుగు రోజుల్లో కలెక్ట్ చేసింది ఎంతంటే?
అఖిల్ అక్కినేని హీరోగా నటించిన `లెనిన్` చిత్రం మొదటి వారంలో దమ్ముదులిపేసింది. ఊహించని కలెక్షన్లని రాబట్టింది. మరి సోమవారం ఈ సినిమాకి వసూళ్లు ఎలా ఉన్నాయనేది చూస్తే.

లెనిన్ మూవీకి అదిరిపోయే కలెక్షన్లు
అఖిల్‌కి ఎట్టకేలకు హిట్ పడింది. ఆయన నటించిన `లెనిన్` మూవీ అదిరిపోయే వసూళ్లని రాబట్టింది. తన కెరీర్‌లోనే బెస్ట్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. మూడు రోజుల్లోనే ఊహించని కలెక్షన్లు రావడం విశేషం. ఈ సినిమా మూడు రోజుల్లో రూ.61కోట్లు రాబట్టినట్టు టీమ్ వెల్లడించింది. ప్రముఖ ట్రేడ్ సైట్ల లెక్కల ప్రకారం మూవీ నలభై కోట్ల లోపే ఉంది.
నాల్గో రోజు తగ్గిన లెనిన్ కలెక్షన్లు
ఇక నాల్గో రోజు, సోమవారం ఈ చిత్రం ఎంత వసూలు చేసిందనేది ఆసక్తికరంగా మారింది. సోమవారం వచ్చే కలెక్షన్లు సినిమా స్ట్రాంగ్‌గా ఉందా? పడి పోయిందా అనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ లెక్కన మండే ఈ మూవీకి హ్యూజ్ డ్రాప్ కనిపిస్తుంది. సాక్నిల్క్ సైట్ ప్రకారం `లెనిన్` సోమవారం 3.60కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. ఆదివారం వసూళ్లతో పోల్చితే 20 శాతానికి పడిపోయింది. ఇండియాలో రూ.4కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో రూ.75లక్షలు రాబట్టింది. మొత్తంగా నాలుగు రోజుల్లో దీనికి రూ.41.42 కోట్లు రాబట్టింది.
లెనిన్ ఇంకా ఎంత రాబట్టాలి
టీమ్ చెప్పిన లెక్కన ప్రకారం ఈ మూవీ నాల్గో రోజు సుమారు డెబ్బై కోట్లకు చేరుతుందని చెప్పొచ్చు. మొత్తంగా ఇది అరవై శాతం రికవరీ సాధించినట్టు సమాచారం. లాంగ్ రన్‌లో బ్రేక్ ఈవెన్ కావడం సాధ్యమే అని అంటున్నారు. ఈ వారం కూడా పెద్ద సినిమాలు లేవు. లెనిన్‌కి థియేటర్లు ఉంటాయి. వచ్చే వారం వరకు దీనికి తిరుగులేదు. అప్పటి వరకు ఎంత వసూలు చేస్తుంది? బ్రేక్ ఈవెన్ అవుతుందా అనేది చూడాలి.
లెనిన్ ఇంకా ఎంత రాబట్టాలి అంటే
అఖిల్ హీరోగా నటించిన `లెనిన్` మూవీకి మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. నాగార్జున, నాగవంశీ నిర్మించారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. ఈశ్వరీ రావు, ప్రమోద్, రాంకీ, సునీల్, గెటప్ శ్రీను వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం జులై 10న విడుదలైన విషయం తెలిసిందే. సుమారు రూ.45కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇంకా ఇరవై కోట్ల వరకు షేర్ రాబట్టాల్సి ఉంటుంది.

