MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Kalki 2: 'ఓ ధనంజయా, నువ్వు నేను ఇద్దరం కర్ణుడిని ఓడించలేం'.. మంటలు మరింత పెంచిన నాగ్ అశ్విన్

Kalki 2: 'ఓ ధనంజయా, నువ్వు నేను ఇద్దరం కర్ణుడిని ఓడించలేం'.. మంటలు మరింత పెంచిన నాగ్ అశ్విన్

నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి 2898 ఎడి చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అదే స్థాయిలో వివాదం కూడా అయింది. ముఖ్యంగా కర్ణుడి పాత్రపై విమర్శలు చెలరేగాయి. దీనిపై తాజాగా నాగ్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 13 2026, 06:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Nag Ashwin
Image Credit : Asianet News

Nag Ashwin

కల్కి 2898 ఎడి చిత్రంతో నాగ్ అశ్విన్ పాన్ ఇండియా వ్యాప్తంగా సంచలన దర్శకుడిగా గుర్తింపు పొందారు. కల్కి చిత్రం 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఇండియాలో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. కల్కి చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. ప్రస్తుతం ఆ పనిలోనే దర్శకుడు నాగ్ అశ్విన్ ఉన్నారు. అయితే కల్కి మొదటి భాగం విషయంలో చెలరేగిన వివాదం ఇప్పటికీ చల్లారలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కల్కి మూవీ వివాదం
Image Credit : X/@VyjayanthiFilms

కల్కి మూవీ వివాదం

కర్ణుడి పాత్రని నాగ్ అశ్విన్ బాగా హైలైట్ చేశారు. కర్ణుడి ముందు అర్జునుడి తక్కువ వాడిగా చూపించే ప్రయత్నం చేశారు. దీనితో చాలా పురాణాలు చదివిన పండితులు, అనంత్ శ్రీరామ్, గరికపాటి లాంటి వారంతా కల్కి చిత్రాన్ని, కర్ణుడి గురించి అందులో చూపించిన విషయాలని తీవ్రంగా తప్పు పట్టారు. అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ.. మహాభారతంలో కర్ణుడిని ఓడించిన ఎందరో వీరులపై అర్జునుడు గెలిచాడు.

35
అనంత్ శ్రీరామ్, గరికపాటి విమర్శలు
Image Credit : instagram

అనంత్ శ్రీరామ్, గరికపాటి విమర్శలు

ఏ సందర్భంలోనూ అర్జునుడిపై కర్ణుడికి అప్పర్ హ్యాండ్ లేదు. అలాంటప్పుడు దేనిని ప్రామాణికంగా తీసుకుని అర్జునుడికంటే కర్ణుడు గొప్ప వీరుడు అని అంటారు. అంటే మీ ఇష్టమా.. అది తప్పు కదా అంటూ దుమ్మెత్తి పోశారు. గరికపాటి మాట్లాడుతూ.. కర్ణుడు ఎవరో తెలియకపోతే కల్కి సినిమాలో చూపించిన వాడే కర్ణుడు. సినిమా వాళ్లు ఏది చెబితే అదే నిజం. అసలు భారతంలో ఉన్నది వేరు, అందులో చూపించింది వేరు. అర్జంటుగా కర్ణుడు, అశ్వథామ హీరోలు అయిపోయారు.. కృష్ణుడు, అర్జునుడు విలన్లు అయిపోయారు. ఎలా అయిపోయారో తెలియదు, ఆలోచిస్తుంటే బుర్ర వేడెక్కుతోంది అంటూ గరికపాటి విమర్శించారు.

45
నేనేం చేస్తున్నానో నాకు తెలుసు
Image Credit : our own

నేనేం చేస్తున్నానో నాకు తెలుసు

కల్కి సినిమాపై ఈ విమర్శలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు నాగ్ అశ్విన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెడుతూ కల్కి చిత్రంలో కర్ణుడి పాత్ర గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. 'ద్రోణ వధ పర్వంలో ఇవి శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పిన మాటలు. బిబేక్ డెబ్రాయ్ వర్షన్ చదవండి. లేదా గూగుల్ చేయండి. అర్జునుడి వద్ద కృష్ణుడు ఎన్నిసార్లు కర్ణుడిని పొగిడాడో తెలుస్తుంది. మన చరిత్ర పట్ల నాకు చాలా గౌరవం ఉంది. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. కల్కి 2 కోసం ఎదురుచూస్తూ ఉండండి' అంటూ నాగ్ అశ్విన్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కి మహాభారతానికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా జోడించారు. ఆ స్క్రీన్ షాట్ లో కర్ణుడి గురించి కృష్ణుడు అర్జునుడితో చెబుతున్న మాటలు ఉన్నాయి.

55
క్లారిటీ ఇచ్చిన నాగ్ అశ్విన్
Image Credit : our own

క్లారిటీ ఇచ్చిన నాగ్ అశ్విన్

'ఘటోత్కచుడిపై ఆ శక్తి ఆయుధం (ఈటె) ఉపయోగించబడింది. ఓ ధనంజయా! కాబట్టి, కర్ణుడు ఇప్పటికే మరణించినట్టుగా భావించు. ఒకవేళ కర్ణుడి చేతిలో ఆ శక్తి ఆయుధమే ఉండి ఉంటే, ఈ ప్రపంచంలో ఏ మానవుడూ అతని ముందు నిలబడగలిగేవాడు కాదు. యుద్ధంలో అతను కార్తికేయుడిలా (కుమారస్వామిలా) అజేయుడిగా నిలిచేవాడు. మన అదృష్టం బాగుండి అతని కవచం పోయింది. మన అదృష్టం కొద్దీ అతని కుండలాలు దహించుకుపోయాయి (గ్రహించబడ్డాయి). మన అదృష్టం బాగుండబట్టే ఆ తిరుగులేని శక్తి ఆయుధం ఘటోత్కచుడిపై ఉపయోగించబడింది. ఒకవేళ అతని వద్ద ఆ కవచం, ఆ కుండలాలు ఉండి ఉంటే, శక్తిమంతుడైన ఆ కర్ణుడు ముల్లోకాలలోని ఎవరినైనా, ఆఖరికి అమరులైన దేవతలను సైతం ఓడించగలిగేవాడు. వాసవుడు (ఇంద్రుడు), కుబేరుడు, జలాధిపతియైన వరుణుడు, యముడు కూడా కర్ణుడితో తలపడటానికి సాహసించేవారు కాదు. పురుష శ్రేష్ఠుడైన అతని వద్ద ఒకవేళ అవే ఉండి ఉంటే, నీ గాండీవంతో నువ్వు కానీ, నా సుదర్శన చక్రంతో నేను కానీ అతనిని యుద్ధంలో ఓడించే సామర్థ్యాన్ని కలిగి ఉండేవాళ్ళం కాదు' అని మహాభారతంలో ఉన్న వాక్యాలని నాగ్ అశ్విన్ పోస్ట్ చేశారు. దీని ద్వారా తాను మహాభారతంలో ఉన్నదే చూపిస్తున్నాను అంటూ నాగ్ అశ్విన్ చెప్పకనే చెప్పారు. మరి ఈ వివాదం ఇంతటితో ఆగుతుందా లేక మరింత పెరుగుతుందా అనేది చూడాలి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ప్రభాస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Recommended image2
Shrimad Bhagavatam: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు ఏడు భాగాలుగా విష్ణువు కథ.. భారీ స్కేల్‌లో సినిమాలు
Recommended image3
The Paradise: ది ప్యారడైజ్ మూవీకి ట్రైలర్ లేదు.. బాంబు పేల్చిన నాని, ఏం జరుగుతోంది
Related Stories
Recommended image1
Posani: చిరంజీవి సినిమా కాబట్టి వల్గర్ మూవీ అన్నారు, అసలు సిసలైన చెత్త సినిమా అదే..దెబ్బకు అంతా సైలెంట్
Recommended image2
OTT: ఓటీటీలో సమంత యాక్షన్ షో, ప్రియురాలిపై అనాథ తీర్చుకునే రొమాంటిక్ రివేంజ్..ఈ వారం అస్సలు మిస్ కావొద్దు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved