MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Actress Laya: లయలో ఉన్న హిడెన్‌ టాలెంట్‌ ఏంటో తెలుసా? ఏడు సార్లు ఛాంపియన్‌

Actress Laya: లయలో ఉన్న హిడెన్‌ టాలెంట్‌ ఏంటో తెలుసా? ఏడు సార్లు ఛాంపియన్‌

Actress Laya: ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ లయ ఇటీవల మధ్య వెండితెరపై మెరుస్తోంది. తాజాగా ఆమె ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. తనలో ఉన్న హిడెన్‌ టాలెంట్‌ని బయటపెట్టింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : May 14 2026, 04:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సెకండ్‌ ఇన్నింగ్స్ లో లయ జోరు
Image Credit : instagram/@layagorty

సెకండ్‌ ఇన్నింగ్స్ లో లయ జోరు

ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన లయ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంటోంది. ఆ మధ్య `తమ్ముడు` చిత్రంలో మెరిసింది లయ. ఆ తర్వాత `సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని` చిత్రంలో శివాజీతో నటించి మెప్పించింది. ఇప్పుడు మరో సినిమాతో రాబోతుంది. సెకండ్‌ ఇన్నింగ్స్ లో జోరు పెంచుతోంది. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. తనకు సంబంధించిన ఫోటోలను పంచుకుంటుంది. అప్‌ డేట్లు ఇస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఒక ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చింది లయ. తనలో ఉన్న హిడెన్‌ టాలెంట్‌ని బయటపెట్టింది. తాను ఎంతటి టాలెంటో చెప్పి ఆశ్చర్యపరిచింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
లయ చెస్‌లో ఛాంపియన్‌
Image Credit : instagram/@layagorty

లయ చెస్‌లో ఛాంపియన్‌

లయ చిన్నప్పుడు సాధించిన ఘనతని బయటపెట్టింది. ఆమె చెస్‌లో ఛాంపియన్‌ షిప్‌ అట. ఏడుసార్లు విన్నర్‌గా నిలిచిందట. సినిమాలకే పరిమితం కాకుండా చిన్నప్పటి నుంచే చెస్‌పై లయకు ఎంతో ఆసక్తి ఉండేది. ఆసక్తితో పాటు కష్టపడి సాధన చేసిన ఆమె ఏడు సార్లు రాష్ట్రస్థాయి చెస్ ఛాంపియన్‌గా నిలిచింది. అంతేకాదు, జాతీయ స్థాయిలో కూడా పలు పతకాలు సాధించింది. అయితే పదో తరగతి తర్వాత చదువులపై దృష్టి పెట్టాల్సి రావడంతో చెస్‌కు దూరమైంది.

34
తన టాలెంట్‌ని బయటపెట్టిన లయ
Image Credit : instagram/@layagorty

తన టాలెంట్‌ని బయటపెట్టిన లయ

ఇటీవల లయ తన చిన్ననాటి మధుర జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంది. 12 ఏళ్ల వయసులో విజయవాడలో నిర్వహించిన ఆంధ్రా సబ్ జూనియర్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన సందర్భంగా అప్పటి పత్రికల్లో వచ్చిన వార్తా క్లిప్పింగ్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. చిన్నప్పటి విజయాలు జీవితాంతం గుర్తుండిపోతాయని, అలాంటి జ్ఞాపకాలు ఎప్పటికీ ఆనందాన్నిస్తాయని పేర్కొంది. అలాగే తన విజయానికి కారణమైన తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో చిన్నగా చాలా క్యూట్‌గా ఉంది లయ. పైకి ఎన్నోసెంట్‌గా, కూల్‌గా ఉండే లయలో ఇంతటి టాలెంట్‌ ఉందా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆమెకి అభినందనలు తెలియజేస్తున్నారు.

44
లయ తెలుగు సినిమాలు
Image Credit : instagram/@layagorty

లయ తెలుగు సినిమాలు

ఇదిలా ఉంటే బాలనటిగానే సినిమాల్లోకి వచ్చింది లయ. ఆమె `భద్రం కొడుకో` సినిమాలో బాలనటిగా మెరిసింది. ఆ తర్వాత స్వయంవరం చిత్రంతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయ్యింది. `కోదండ రాముడు`, `మనోహరం`, `మనసున్న మారాజు`, `ప్రేమించు`, `రామా చిలకమ్మ`, `నాలో ఉన్న ప్రేమ`, `హనుమాన్‌ జంక్షన్‌`, `నువ్వులేక నేను లేను`, `కొండవీటి సింహాసనం`, `నీ ప్రేమకై`, `శివరామరాజు`, `దొంగరాముడు అండ్‌ పార్టీ`, `పెళ్లాంతో పనేంటి`, `నేను పెళ్లికి రెడీ`, `మిస్సమ్మ`, `విజయేంద్రవర్మ`, `స్వరాభిషేకం`, `అదిరిందయ్య చంద్రం`, `టాటా బీర్లా మధ్యలో లైలా` వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది లయ.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
Veerabhadrudu Review: వీరభద్రుడు (కరుప్పు) మూవీ ట్విట్టర్‌ రివ్యూ.. సూర్య సినిమాకి దారుణమైన టాక్‌
Recommended image2
Trisha Remuneration: ఒక్క దెబ్బతో డబుల్‌ అయిన త్రిష రెమ్యూనరేషన్‌.. కారణం సీఎం అంటూ రచ్చ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved