MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Latha Rajinikanth: భార్య లతని రంగంలోకి దించిన రజనీకాంత్‌.. రాజకీయాల్లో అదిరిపోయే ట్విస్ట్

Latha Rajinikanth: భార్య లతని రంగంలోకి దించిన రజనీకాంత్‌.. రాజకీయాల్లో అదిరిపోయే ట్విస్ట్

Latha Rajinikanth: తమిళనాడు రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఈ సమయంలో లతా రజినీకాంత్ ఓ కొత్త వీడియో రిలీజ్ చేసి సంచలనం సృష్టించారు. 'మక్కల్ మేడై' పేరుతో ఆమె ఓ కొత్త ఉద్యమాన్ని ప్రారంభించారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 05 2026, 10:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రాజకీయాల్లోకి లతా రజనీకాంత్‌
Image Credit : Social Media

రాజకీయాల్లోకి లతా రజనీకాంత్‌

తమిళనాడు రాజకీయాల్లో ప్రతిరోజూ ఏదో ఒక సంచలనం నమోదవుతోంది. తాజాగా, బీజేపీ నుంచి వైదొలిగిన అన్నామలై 'వి ది లీడర్స్' అనే కొత్త సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ఎన్నికల్లో పోటీ చేస్తుందని కూడా ప్రకటించారు. లక్షలాది మంది ఆయన సంస్థలో చేరారు. ఈ వేడి చల్లారకముందే, లతా రజనీకాంత్ ఓ కొత్త వీడియో విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. రజనీకాంత్ భార్య లతా రజినీకాంత్ ఇప్పటికే పలు సంస్థల ద్వారా సామాజిక సేవ చేస్తున్నారు. ఇప్పుడు ఆమె 'మక్కల్ మేడై' (పీపుల్‌ స్టేజ్‌) అనే కొత్త ఉద్యమాన్ని ప్రారంభించారు. మార్పు కోరుకునే ప్రజలందరూ మాతో చేతులు కలపాలని ఆమె పిలుపునిచ్చారు. మనమందరం కలిసి ప్రజాశక్తిగా మారి మంచి పనులు చేద్దామని ఆమె అన్నారు. ఈ ఉద్యమంలో చేరడానికి మొబైల్ నంబర్, ఈమెయిల్ కూడా ప్రకటించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ప్రజా సేవ చేయాలని యువతకి పిలుపు
Image Credit : our own

ప్రజా సేవ చేయాలని యువతకి పిలుపు

ఈ విషయంపై ఆమె విడుదల చేసిన వీడియోలో ఆమె మాట్లాడుతూ, , 'సిటిజెన్ ప్లాట్‌ఫామ్' అయిన తమ ఉద్యమంలో చేరి ప్రజాసేవ చేయాలని యువతకు పిలుపునిచ్చారు. 'ప్రజాశక్తిగా మారి సమాజానికి సేవ చేసేందుకు ముందుకు రండి. మనమందరం కలిసి నిర్మాణాత్మక పనులు చేద్దాం' అని ఆమె అన్నారు. సీనియర్ సిటిజన్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఉపాధ్యాయులు ఎవరైనా తమ అనుభవాన్ని పంచుకోవచ్చని తెలిపారు. స్థానిక నాయకులను తయారు చేయడమే తమ లక్ష్యమని ఆమె ప్రకటించారు.

34
కుల, మత, రాజకీయాలకు అతీతంగా
Image Credit : facebook/Latha Rajinikanth

కుల, మత, రాజకీయాలకు అతీతంగా

ఇది కేవలం ఒక సంస్థ కాదని, సమాజంలో మార్పు కోరుకునే ప్రతి పౌరుడికి ఒక మంచి వేది క అని ఆమె తెలిపారు. విద్య, ఆరోగ్యం, జీవనోపాధి వంటి అన్ని రంగాల్లో తమిళనాడు సాధిస్తున్న అభివృద్ధిని మరో స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమన్నారు. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడం, అట్టడుగు వర్గాల సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారాలు కనుగొనడం ఈ ఉద్యమ ముఖ్య ఉద్దేశమని ఆమె వివరించారు.

44
లతా రజనీకాంత్‌ అసలు లక్ష్యమేంటి?
Image Credit : our own

లతా రజనీకాంత్‌ అసలు లక్ష్యమేంటి?

లతా రజనీకాంత్‌కు పిల్లల సంక్షేమం, విద్యా రంగాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. ఆమె ఆశ్రమ్ పాఠశాల ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. దయా ఫౌండేషన్, పీస్ ఫర్ చిల్డ్రన్ వంటి సంస్థల ద్వారా పేద పిల్లల హక్కుల కోసం పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆమె ప్రకటించిన 'మక్కల్ మేడై' ఉద్యమం ఆమె సామాజిక సేవలో మరో ముందడుగుగా భావిస్తున్నారు. ఈ ఉద్యమంలో చేరాలనుకునే వారు 7550080515 నంబర్‌కు లేదా makkalmedaitn12@gmail.com ఈమెయిల్‌కు సంప్రదించవచ్చు. **అన్నామలైకి పోటీనా?** ఇదే రోజు ఉదయం అన్నామలై బీజేపీ నుంచి వైదొలగి కొత్త పార్టీని ప్రకటించిన నేపథ్యంలో, లతా రజినీకాంత్ కూడా కొత్త ఉద్యమం ప్రారంభించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. లతా రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా? అన్నామలై, లతా కలిసి పనిచేస్తారా? ఈ రెండు ఉద్యమాలు భవిష్యత్తులో పార్టీలుగా మారతాయా? అనేది వేచి చూడాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్
 
1st ODI • NZ vs IND 2026
Live
NZNZ
(0.5 ov)4/0
INDIND
-
IND chose to bowl.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: రాజమౌళి స్టామినా ఆ ఇంటర్వెల్ సీన్ తో తెలిసింది.. ఒక్కొక్కరికీ మైండ్ పోయింది, రాజీవ్ కనకాల
Recommended image2
Bigg Boss Telugu 10: రోహిత్ వెళ్లిపోయాడు ఇక ముఖేష్, వర్షిణిపై దాడి మొదలు పెట్టిన త్రిగుణ్, కోపంతో ఊగిపోయిన శివ, దేబ్జానీ కన్నీళ్లు
Recommended image3
Ramayana Stars Salary: రామాయణం కోసం రణబీర్, యశ్, సాయి పల్లవి ఎంత తీసుకున్నారో తెలుసా?
Related Stories
Recommended image1
Karuppu Controversy: డైరెక్టర్‌పై సూర్య అభిమానులు ఫైర్.. ఇంత పెద్ద హిట్టైనా గొడవేంటి? సీఎం విజయ్‌ వల్లే వివాదం
Recommended image2
Aamir Khan 3rd Wedding: ఇద్దరు మాజీ భార్యల ముందే అమీర్‌ ఖాన్‌ మూడో పెళ్లి? జూలైలో వరుస పెళ్లిళ్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved