- Home
- Entertainment
- వైట్ డ్రెస్ లో మెరిసిపోతున్న లావణ్య త్రిపాఠి.. ట్రెడిషనల్ లుక్ లో అదరగొడుతున్న అందాల రాక్షసి..
వైట్ డ్రెస్ లో మెరిసిపోతున్న లావణ్య త్రిపాఠి.. ట్రెడిషనల్ లుక్ లో అదరగొడుతున్న అందాల రాక్షసి..
‘అందాల రాక్షసి’ చిత్రంతో తెలుగు ఆడియెన్స్ గుండెల్ని కొల్లగొట్టింది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం ‘హ్యాపీ బర్త్ డే’తో ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ సందర్బంగా లేటెస్ట్ ఫొటోషూట్లతో మెస్మరైజ్ చేస్తోంది.

యూపీ బ్యూటీ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) తన కేరీర్ ను మోడల్ గానే ప్రారంభించింది. 2006లో మిస్ ఉత్తరాఖండ్ టైటిల్ ను కూడా గెలుచుకుంది. కొద్ది కాలం టెలివిజన్ షోలోనూ వర్క్ చేసింది. ఆ తర్వాత నేరుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి సినీ కేరీర్ ప్రారంభించింది.
2012లో ఎస్ఎస్ రాజమౌళి సమర్సణలో వచ్చిన సూపర్ హిట్ రొమాంటిక్ ఫిల్మ్ ‘అందాల రాక్షసి’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలిచిత్రంతోనే లావణ్య త్రిపాఠి భారీ సక్సెస్ ను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి వరుసగా సినీ ఆఫర్లను అందుకుంటోంది.
లావణ్య ప్రస్తుతం నటిస్తున్న యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ మూవీ ‘హ్యాప్తీ బర్త్ డే’ (Happy Birthday). ఈ చిత్రానికి ‘మత్తు వదలరా’ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. జూలై 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ చిత్ర ట్రైలర్ ను త్వరలో ఎస్ఎస్ రాజమౌళి రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత నుంచి రెగ్యూలర్ గా చిత్ర ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నారు యూనిట్. ఈ సందర్భంగానే లావణ్య త్రిపాఠి కూడా సోషల్ మీడియా వేదికన తనదైన శైలిలో ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతోంది.
తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఫొటోషూట్లు చేసిన లావణ్య ఎక్కువగా ట్రెడిషనల్ గానే కనిపించేందుకు ఇష్టపడుతుంటుంది. ఆమె అందం, అభినయం, నటనకు ప్రేక్షకులు కూడా ఫిదా అవుతుంటారు. ఆమె సినిమాల్లోనూ ఎక్కువ భాగం ట్రెడిషనల్ గానే కనిపిస్తూ ఆడియెన్స్ ను అలరిస్తుంటుంది.
ఈ బ్యూటీ తాజాగా వైట్ ట్రెడిషనల్ వేర్ లో దర్శనమిచ్చింది. ఈ లుక్ లో అందాల రాక్షసి మరింత గ్లామరస్ గా కనిపిస్తోంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో అదిరిపోయే పోజులిచ్చింది. యూపీ బ్యూటీ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతూ.. ఆమె పిక్స్ ను లైక్ చేస్తూ, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.