వరుణ్ తేజ్ అత్తమామల బ్యాగ్రౌండ్ పై నెటిజన్ల ఆరా.. మెగా కోడలు లావణ్య త్రిపాఠికి ఆస్తి ఎంతుందో తెలుసా ?
మిస్టర్ షూటింగ్ లో భాగంగా వరుణ్, లావణ్య తొలిసారి ఇటలీలో కలుసుకున్నారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలసి అంతరిక్షం చిత్రంలో మరోసారి నటించారు.
వరుణ్ తేజ్ కొణిదెల, లావణ్య త్రిపాఠి నేడు ఇటలీలో జరుగుతున్న వివాహ వేడుకతో ఒక్కటి కాబోతున్నారు. మిస్టర్ చిత్రంతో మొదలైన వీరి ప్రేమాయణం ఎక్కడ మొదలైందో అక్కడే అన్నట్లుగా సుఖాంతం కాబోతోంది. మిస్టర్ షూటింగ్ లో భాగంగా వరుణ్, లావణ్య తొలిసారి ఇటలీలో కలుసుకున్నారు. ఆ పరిచయం ప్రేమగా మారింది.
ఆ తర్వాత వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలసి అంతరిక్షం చిత్రంలో మరోసారి నటించారు. అలా వీరి ప్రేమ బంధం బలపడుతూ వచ్చింది. వరుణ్ తేజ్ కాకుండా లావణ్య త్రిపాఠితో కలసి నటించిన మెగా హీరోలు అల్లు శిరీష్, సాయిధరమ్ తేజ్. శిరీష్ తో శ్రీరస్తు శుభమస్తులో.. తేజ్ తో ఇంటెలిజెంట్ లో నటించింది.
లావణ్య త్రిపాఠి నార్త్ ఇండియా నుంచి వచ్చి మెగా కోడలు కాబోతుండడంతో ఆమె బ్యాగ్రౌండ్ తెలుసుకునేందుకు నెటిజన్లు మెగా అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. వరుణ్ తేజ్ అత్తమామలు ఎవరు ? ఏం చేస్తుంటారు ? వారి పిల్లలు ? లాంటి వివరాల కోసం శోధిస్తున్నారు. లావణ్య త్రిపాఠి అయోధ్యలో జన్మించింది. లావణ్య త్రిపాఠి తండ్రి హైకోర్టులో న్యాయవాది. తల్లి ఉపాధ్యాయురాలిగా పనిచేసారు. స్కూల్ విద్యాబ్యాసం డెహ్రాడూన్ లో పూర్తి చేసింది. లావణ్య త్రిపాఠికి ఒక చెల్లి, తమ్ముడు ఉన్నారు.
లావణ్య త్రిపాఠికి ఉన్నత చదువులపై అంతగా ఆసక్తిలేదట. సినిమాలపై బాగా ఆసక్తి ఉండేది. దీనితో నటిగా ప్రయత్నిస్తానని తన తండ్రికి చెప్పడంతో.. డిగ్రీ పూర్తి చేసిన తర్వాతే ఏదైనా అని చెప్పారట. దీనితో లావణ్య ముంబై వచ్చి ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత మోడలింగ్ చేస్తూ మిస్ ఉత్తారాఖండ్ టైటిల్ కూడా గెలుచుకుంది. లావణ్య త్రిపాఠి క్లాసికల్ డ్యాన్సర్ కూడా. ఆమెకి భరత నాట్యంలో మంచి ప్రావీణ్యం ఉంది.
ఇక సినిమాల్లో తొలి ఛాన్స్ ఆమెకి 2012లో దక్కింది. అందాల రాక్షసి చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించింది. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన లావణ్య త్రిపాఠి సొంతంగా 20 కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. లావణ్య ప్రతి చిత్రానికి 50 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకుంటుంది. లావణ్య తల్లిదండ్రులకు కూడా బాగానే ఆస్తులు ఉన్నాయట.
మొత్తంగా లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ల పెళ్లి ఇటలీలో కనుల పండుగలా జరుగుతోంది. చిరంజీవి కుటుంబ పెద్దగా అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. వరుణ్, లావణ్య హల్దీ వేడుకలో కూడా చిరు సందడి చేశారు.