- Home
- Entertainment
- Intinti Gruhalashmi: తులసిని ఇరికించిన లాస్య.. ఏకంగా రూ.20 లక్షలు పెనాల్టీ కట్టేలా ప్లాన్?
Intinti Gruhalashmi: తులసిని ఇరికించిన లాస్య.. ఏకంగా రూ.20 లక్షలు పెనాల్టీ కట్టేలా ప్లాన్?
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalashmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టు కుంటుంది. ఇక ఈరోజు జూన్ 22 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో అంకిత(ankitha)అభి పై విరుచుకు పడుతుంది. నువ్వు ఎన్ని మాటలు అన్నా కూడా ఆంటీ మౌనంగా ఉంది అంటే అది గొప్పతనం ఏంటో తెలుసుకో అని అంటుంది. మరో తులసీ ని తయారు చేస్తుంది అని అంటున్నావు కదా అలా అయితే అంతకంటే అదృష్టం మరొకటి లేదు అని అంకిత, అభి(abhi)కీ స్ట్రాంగ్ గా బుద్ధి చెబుతుంది.
నువ్వు నందగోపాల్ లాగా చేస్తే మాత్రం తులసి లాంటి లాగా ఊరుకోను అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది అంకిత. తులసి(tulasi) ఆంటీని అన్న మాటల స్థానంలో నేను ఉంటే నీ చెంప పగలగొట్టే దాన్ని వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపొండి అంటూ వారికి దండం పెడుతుంది. అప్పుడు తులసి బాధపడుతూ ఉంటుంది. నిజంగానే నేను చేసిన దాంట్లో తప్పు ఉందా అభి(abhi)నన్ను అన్న నీ మాటలు అంటున్నాడు ఆ మాటలు విని తట్టుకోలేక పోయాను అని బాధపడుతూ ఉంటుంది.
అప్పుడు అందరూ తులసిని ఓదార్చే ప్రయత్నం చేస్తారు. అప్పుడు అంకిత(ankitha)అంతా నా వల్లే జరిగింది ఆంటీ అని బాధపడుతూ ఉంటుంది. ఒకవైపు ఇంట్లో శృతి పాటలు వింటూ బట్టలు కుడుతూ ఉండగా ఇంతలో ప్రేమ్ వచ్చి చిరాకు పడుతూ ఉండటంతో అప్పుడు శృతి(shruthi)బయట చిరాకులను ఇంటికి తీసుకు రావద్దు అని అనగా బయట కాదు అభి గురించి అంటూ మండిపడ్డాడు.
అప్పుడు ప్రేమ్(pream) జరిగింది మొత్తం శృతికీ వివరిస్తాడు. అప్పుడు శృతి అంకిత గొడవ పడడానికి కారణం తాను డబ్బులు అడిగినందుకు ఏమోనని అనుకుంటూ ఉంటుంది. అంకిత కు ఫోన్ చేసి అసలు విషయం తెలుసుకుందాం అని అనుకుంటుంది శృతి. మళ్లీ డబ్బులు కోసం చేసింది అనుకుంటుందేమో అని వద్దు అనుకుంటుంది శృతి(shruthi).
తులసి (tulasi)పాట పాడుతూ ఉండగా అక్కడికి అంకిత వచ్చి పొగుడుతూ ఉంటుంది. వారిద్దరూ కొద్దిసేపు మాట్లాడుతూ ఉండగా అంకిత (ankitha)కు ఫోన్ చేసి నా వల్లే ఇలా జరిగింది అంటూ ఒకరికొకరు బాధల గురించి అర్థం చేసుకుంటూ ఉంటారు. అది చూసి తులసి మురిసిపోతూ ఉంటుంది.
మరొకవైపు నందు(nandu) కంపెనీ పెట్టుబడి పెట్టడం కోసం డబ్బు కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. లాస్య వచ్చి రెండు రోజుల్లో నీకు ఎందుకు డబ్బు అందుతుంది అనటంతో నందు నమ్మకుండా వెళ్ళిపోతాడు. అప్పుడు లాస్య (lasya)20 లక్షలు తులసి ఎలా అయినా పెనాల్టీ కట్టిస్తాను అనుకొని తులసి విషయంలో మాస్టర్ ప్లాన్ వేస్తుంది లాస్య.