- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: రాజ్యలక్ష్మి కుట్రకి బలైన దివ్య.. అత్తమామల్ని టార్గెట్ చేసిన లాస్య?
Intinti Gruhalakshmi: రాజ్యలక్ష్మి కుట్రకి బలైన దివ్య.. అత్తమామల్ని టార్గెట్ చేసిన లాస్య?
Intinti Gruhalakshmi: స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ టాప్ రేటింగ్ తో ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానాన్ని సంపాదించుకుంటుంది. భర్తని ప్రేమతో కాకుండా అహంకారంతో లోబరుచుకోవాలని చూస్తున్న ఒక భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 15 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో ఈ టాబ్లెట్స్ ఏంటి అని అడుగుతాడు విక్రమ్. ఇవి టాబ్లెట్స్ కాదు ఒకరకంగా పాయిజన్ అంటుంది దివ్య. ఇవి ఇక్కడికి ఎందుకు వచ్చాయి? ఈ ఇంట్లో ఎవరిని ఎవరు చంపాలి అనుకుంటున్నారు అంటాడు విక్రమ్. అది మీ అమ్మని అడుగు ఇవి మావయ్య గారికి వాడుతున్న మందులు. నిన్న, మొన్నటి నుంచి కాదు కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు.
ఇంట్లో వాళ్ళకి తెలియకుండానే ఇది జరుగుతుందా అంటుంది దివ్య. ఇదంతా నీకు ఎవరు చెప్పారు అంటాడు విక్రమ్. పక్కనే ఉన్న సిస్టర్ ని పిలిచి జరిగిందంతా చెప్పు అంటుంది దివ్య. రాజ్యలక్ష్మి కనుసైగ చేయడంతో మాట మార్చేసి ఆవిడ ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు.. అయినా అయ్యగారికి వాడే టాబ్లెట్లు బయటికి ఎందుకు తీసుకు వస్తాను.
ఈ టాబ్లెట్లు అమ్మ గారి చేతిలోనే చూశాను అంటూ లోపలికి వెళ్లి ప్రకాష్ కి వాడే మందులు తీసుకుని వస్తుంది సిస్టర్. ఆ మందులు చూసిన సంజయ్ ఇవి నాన్నగారికి రెగ్యులర్ గా వాడే మందులే కదా అబద్దాలు చెప్పటానికి సిగ్గుగా లేదా వదినా.. అమ్మ చూడు ఎంత బాధ పడుతుందో అంటాడు సంజయ్. తనని అసహ్యంగా చూస్తున్న విక్రమ్ వైపు చూసి వాళ్ళు అబద్ధం చెబుతున్నారు.
ఆ టాబ్లెట్స్ గురించి ఆ సిస్టర్ నాతో చెప్పింది అంటుంది దివ్య. ఎందుకమ్మా నామీద నీకు అంత పగ. నువ్వు నీ భర్తకి దగ్గరవుతే నాకు ఇష్టమే అందుకోసం నాకు నా కొడుక్కి మధ్యలో దూరం పెంచకు. భర్తని చంపుకునే అంత కసాయి దానిలాగా కనిపిస్తున్నానా అంటూ ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది రాజ్యలక్ష్మి. ఆమె వెనకే అందరూ వెళ్ళిపోతారు. విక్రమ్ కూడా దివ్యని ఏమీ అనకుండా అసహ్యించుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
సీన్ కట్ చేస్తే నందుని కేఫ్ కి వెళ్దాం రమ్మంటుంది లాస్య. పాతవన్నీ మర్చిపోదాము కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అంటూ కేఫ్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వబోతుంది లాస్య. నాకు అక్కర్లేదు నువ్వే ఉంచుకో. అయితే నువ్వు వెళ్ళాలి లేకపోతే నేను వెళ్ళాలి అంతే కానీ కలిసి వెళ్లే ప్రసక్తి లేదు అంటాడు నందు. నీ మొండితనంతో నా మొండితనాన్ని మరింత రెచ్చగొట్టొద్దు అలా చేస్తే నేను ఎంత దూరమైనా వెళ్తాను.
అసలే అత్తయ్య మామయ్య ఆరోగ్యం బాగోలేదు ఒంటినిండా బిపిలు, షుగర్లు ఉన్నాయి. అలా కాకుండా వాళ్ళు మెట్ల మీద నుంచి జారిపోవచ్చు, బయటికి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అవ్వచ్చు, మొత్తానికే నీకు దక్కకుండా పోవచ్చు అని నందు ని బెదిరిస్తుంది లాస్య. బెదిరిస్తున్నావా నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో నా తల్లిదండ్రులని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అంతేగాని నీతో కలిసి నడిచేది మాత్రం లేదు అంటూ మొండిగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు నందు.
ప్రేమగా చెప్పినప్పుడు వినకపోతే నేను మాత్రం ఏం చేస్తాను. నేను ఏది చేయాలో అదే చేస్తాను అనుకుంటుంది లాస్య. అనుకోకుండా ఈ మాటలన్నీ వింటుంది తులసి. లాస్య మొండిది.. ఎంతకైనా తెగిస్తుంది అని అత్తమామల కోసం భయపడుతుంది. మరోవైపు విక్రమ్ దగ్గరికి వెళ్లి నేను అబద్ధం చెప్పలేదు అని సంజాయిషీ ఇచ్చుకుంటుంది దివ్య. దివ్య మాటలు నమ్మకపోగా తల్లిని వెనకేసుకొస్తాడు విక్రమ్.
ఇక్కడ నువ్వు మా అమ్మ మీద నిందలు వేస్తున్నావు అనుకుంటే అక్కడ మీ అమ్మ కూడా అలాగే మాట్లాడుతుంది అంటాడు విక్రమ్. అమ్మ ఏం చేసింది అంటుంది దివ్య. నువ్వు అమాయకురాలివట.. నీ చుట్టూ ఏం జరుగుతుందో నన్ను తెలుసుకోమంటుంది. మీ ఇద్దరికీ మా అమ్మ అంత రాక్షసి లాగా కనిపిస్తుందా? నీవల్ల మా అమ్మ కన్నీరు పెట్టుకుంది నీ స్థానంలో వేరొకరు ఉండి ఉంటే లాగి చెంప మీద కొట్టేవాడిని అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్రమ్. సీన్ కట్ చేస్తే కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది రాజ్యలక్ష్మి.
అప్పుడే బయటకు వెళ్తున్న దివ్యని చూసి చాకుని సౌండ్ చేస్తుంది. ఆ సౌండ్ కి అర్థం నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అక్క అడుగుతుంది అంటాడు బసవయ్య. చెప్పుతో సౌండ్ చేస్తుంది దివ్య. ఈ సౌండ్ కి అర్థం మీకు తెలియదా అంటూ బసవయ్యను అడిగి.. చెప్పను అని అర్థం అంటుంది దివ్య. ఒక్కసారిగా షాక్ అవుతారు బసవయ్య రాజ్యలక్ష్మి. తరువాయి భాగంలో దివ్య మీద చాడీలు చెప్తారు బసవయ్య దంపతులు. ఆ మాటలు నమ్మిన విక్రమ్ దివ్య మీద చెయ్యెత్తుతాడు.