MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Intinti Gruhalakshmi: అనసూయని రెచ్చగొట్టిన లాస్య.. సంతోషంలో ప్రేమ్ తులసి..?

Intinti Gruhalakshmi: అనసూయని రెచ్చగొట్టిన లాస్య.. సంతోషంలో ప్రేమ్ తులసి..?

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు నవంబర్ 3వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
Published : Nov 03 2022, 09:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఈరోజు ఎపిసోడ్ లో ప్రేమ్ కాయగూరలు తీసుకుని వచ్చి తులసిని చూసి షాక్ అవుతాడు. వెంటనే అమ్మమ్మ అని గట్టిగా పిలుస్తాడు. అప్పుడు ఆమె వచ్చి ఏమైందిరా అని అనగా ప్రపంచంలో ఎనిమిదవ వింత చూస్తున్నాను అమ్మమ్మ అదిగో చూడండి అని తులసి వైపు చూపిస్తాడు. అప్పుడు వాళ్లు అది చూసి నవ్వుకుంటూ ఉంటారు. ప్రతిరోజు సూర్యుడిని నిద్ర లేపే అమ్మ ఈరోజు సూర్యుడు నడి నెత్తి మీదకు వస్తున్న ఇంకా లేవకపోవడం ఏంటి అనడంతో తులసి వాళ్ళమ్మ పడుకోనివ్వరా నీకేం అడ్డం అని అంటుంది. నాకేం అర్థం లేదు అంటూ వాళ్ళ అత్తయ్య అమ్మమ లపై మీద సెటైర్స్ వేస్తూ నవ్విస్తూ ఉంటాడు ప్రేమ్. అప్పుడు తులసి వాళ్ళ అమ్మ తులసిని నిద్ర లేపుతాను..
 

28

అని అనగా ఇంతలో ప్రేమ్ వాళ్ళ అత్తయ్య వద్దులేండి అత్తయ్య ఇన్ని రోజులకు అవకాశం దొరికింది పడుకొనివ్వండి అని అంటుంది. అప్పుడు తులసి వాళ్ళ అమ్మ ఎన్ని సార్లు నిద్ర లేపినా లేవడం లేదు ప్రేమ అని అనడంతో వెంటనే అందుకు నా దగ్గర ఒక సరైన ప్లాన్ ఉంది అది చేసి చూపిస్తాను చూడు అంటూ ప్రేమ్ పరంధామయ్య లాగా మాట్లాడుతూ అమ్మ తులసి అని పిలవడంతో వెంటనే తులసి నిద్ర నుంచి లేచి మావయ్య కాఫీ తెస్తాను ఉండండి అని అంటుంది. అది చూసి వారందరూ నవ్వుకుంటూ ఉంటారు. మరొకవైపు పరంధామయ్య కిచెన్ లోకి వెళ్లి కాపీ పెట్టుకుంటూ ఉంటాడు.
 

38

ఇంతలోనే అనసూయ అక్కడికి మీరు కాఫీ పెట్టుకోవడం ఏంటి నేను పెట్టిస్తాను కదా అని అనడంతో అవసరం లేదు అన్నట్టుగా మొఖం పక్కకు పెట్టుకుంటాడు పరందామయ్య. అప్పుడు అనసూయ తులసి ఇంట్లో వెళ్లి నప్పటినుంచి మీరు నాతో సరిగ్గా మాట్లాడటం లేదు పక్కకు వచ్చి కూర్చున్న పట్టించుకోవడం లేదు నా వైపు చూడడం లేదు నేను తులసి చేసింది తప్పు అని చెప్పడమేనా నా తప్పు అని అంటున్నా పరంధామయ్య పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. తప్పు చేసింది నువ్వు నేను కాదు ఆ దేవుడు తులసి జీవితంలోకి సామ్రాట్ లాంటి వ్యక్తిని 26 ఏళ్ల క్రితమే భర్తగా పంపించు ఉంటే ఈ బాధలు ఉండేవి కావు అనటంతో అనసూయ కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
 

48

ఆ తర్వాత పరంధామయ్య అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరొకవైపు తులసి పూజ చేస్తూ ఉంటుంది. అప్పుడు తులసి మొక్కకు తన బాధలు చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది తులసి. మరొకవైపు అంకిత వంట చేస్తూ ఉండగా ఇంతలో అభి అక్కడికి వచ్చి అంకిత టిఫిన్ పెట్టు అని అనగా ఇంకా చట్నీ అవుతుంది అనడంతో వెంటనే అభి ఇక్కడ నేనేం ఖాళీగా లేను అని అనగా వెంటనే కోపంతో అంకిత నాకు కోపంతో అభి దగ్గరికి వచ్చింది నేను వంట ఆపేసాను అభి అని అంటుంది. ఎందుకు అని అనడంతో నా మూడు స్పాయిల్ అయింది చేసే పనిని తప్పు అని చెప్పావు అని అంటుంది అంకిత.
 

58

అప్పుడు అంకిత తులసి గురించి మాట్లాడటంతో అభి ఎందుకు ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నావు అని అనడంతో 25 ఏళ్లు మీకు సేవలు చేసిన ఆంటీని పరకపుల్లలా తీసేశావు నన్ను ఎవరు చూసుకుంటారు నన్ను ఎవరు పట్టించుకుంటారు అని అంకిత బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు అంకిత ఇంట్లో ఎటు చూసినా నాకు ఆంటినే కనిపిస్తోంది నాకు పిచ్చెక్కిపోతోంది అభి అని అంటుంది. అప్పుడు అభి నాకు కూడా మా మీద ప్రేమ ఉంది అని అనటంతో వెంటనే అంకిత అందుకేనా ఆంటీ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను ఏమీ మాట్లాడకుండా తమాషా చూసావు అని అనటంతో తప్పు అనిపించింది చెప్పాను అంకిత అని అనగా వెంటనే అంకిత నువ్వు తప్పు చేస్తున్నావ్ అనిపిస్తుంది నేను కూడా నిన్ను దూరం పెట్టనా అని అంటుంది.
 

68

 దాంతో అభి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ తర్వాత లాస్య అనసూయ దగ్గరికి వెళ్లగా అప్పుడు అనసూయ ఇంట్లోకి వెళ్లి వంట చెయ్యి అని అనడంతో దివ్య అంకితలు చేస్తున్నారు అత్తయ్య నేను మీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను అంటూ తులసి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది లాస్య. అప్పుడు లాస్య, సామ్రాట్ తులసి గురించి తప్పుగా మాట్లాడుతూ తులసి సామ్రాట్ ని రెచ్చగొట్టి మన పైకి పంపించక ముందే మనం ఏదో ఒకటి చేసి ఇంటిని మన పేరు మీద రాయించుకోవాలి అత్తయ్య అని చెప్పి అనసూయని రెచ్చగొట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
 

78

మరొకవైపు తులసి ఆఫీస్ కి వెళ్ళాలి అంటూ ఉండగా ప్రేమ్ అన్ని సర్దుతూ ఉంటాడు. అప్పుడు దీపక్ ఇన్ని రోజులు మీ అమ్మ నేను చూసుకుంది ఈరోజు నువ్వు మీ అమ్మని చూసుకుంటున్నావు. రుణం తీర్చుకుంటున్నావ్ అని అనడంతో ఇది రుణం కాదు బాధ్యత అని ప్రేమ్ తన తల్లి గురించి గొప్పగా చెబుతూ ఉంటాడు. ఆ తర్వాత సరదాగా వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు.
 

88

ఆ తర్వాత తులసి ఇంటిని అద్దె తీసుకొని అక్కడికి వెళ్లిపోతాం అని అనగా కొద్ది రోజులు ఇక్కడే ఉండి తర్వాత వెళ్ళు అని దీపక్ వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి తులసికి నచ్చ చెబుతారు. ఇప్పుడు తులసి సరే అని అంటుంది. ఆ తర్వాత తులసి ప్రేమ్ ఆఫీస్ కి వెళ్తారు. మరొకవైపు అనసూయ కాయగూరలు కొనడానికి వెళ్ళగా అక్కడ కొందరు అనసూయతో తులసి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. బాయ్ ఫ్రెండ్ సామ్రాట్ అంటూ నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటారు. దాంతో అనసూయ కోపంతో రగిలిపోతూ ఉంటుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
సంజూ శాంసన్ vs కీర్తి సురేష్ .. వీరిలో నెంబర్ 1 ఎవరో తెలుసా..?
Recommended image2
Maheshbabu కోసం కదిలి వచ్చిన పవన్ కళ్యాణ్‌, వెంకటేష్‌, నాగార్జున.. కట్‌ చేస్తే సినిమా ఫ్లాప్‌
Recommended image3
1000 Crore Heroes: వెయ్యి కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టిన హీరోలు వీరే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved