- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: లాస్య మరో ఎత్తుగడా.. తులసికి అంకిత కూడా సాయం చెయ్యకుండా చేసిన నందు?
Intinti Gruhalakshmi: లాస్య మరో ఎత్తుగడా.. తులసికి అంకిత కూడా సాయం చెయ్యకుండా చేసిన నందు?
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalashmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టు కుంటుంది. ఇక ఈరోజు జూన్ 25 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో నందు(nandu) మ్యూజిక్ వింటూ ఉండగా లాస్య చిరాకు పడుతూ తులసి వల్ల తనకు మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ పోయింది అని అంటుంది. త్వరలోనే తులసి ఒక మ్యూజిక్ స్కూల్ పెడుతుందని అందుకోసం తాను ఇప్పుడు లోన్ తీసుకుంటుందని చెప్పడంతో నందు ఒక్కసారిగా షాక్ అవుతాడు. అప్పుడు నందు లాస్య(lasya) పై కోపంతో రగిలి పోతూ ఉంటాడు.
మ్యూజిక్ కు కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ గురించి ఫ్రేమ్ (pream)లిస్ట్ రాసుకుంటూ ఉంటాడు. అప్పుడు శృతి డబ్బు వచ్చిన తర్వాత ఆర్డర్ చేస్తే సరిపోతుంది కదా అని అనగా అప్పుడు వారిద్దరూ కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు . అప్పుడు శృతి పొరపాటున అత్తయ్య గారి ఇంటికి వెళ్తున్న అని అనడంతో.. వెంటనే ప్రేమ్ కు అనుమానం వస్తుంది. అప్పుడు శృతి (shruthi)ఏదో ఒకటి చెప్తే కవర్ చేస్తుంది.
మరోవైపు తులసి(tulasi) ఇంట్లో ఫోన్ పట్టుకొని లోన్ మెసేజ్ కోసం ఎదురు చూస్తుంది. ఇంట్లో వాళ్ళు తమకు కావలసిన అవసరాలు గురించి చెప్పినా కూడా తను పట్టించుకోకుండా ఉంటుంది. అందరూ ఏం జరిగింది అని ప్రశ్నించిన కూడా ఆలోచనలో పడుతూ ఉంటుంది. అప్పుడే తులసి(tulasi) ఫోన్ కి డబ్బులు పడ్డాయి అని మెసేజ్ రావటంతో అందరూ సంతోష పడతారు.
శుభ సందర్భంలో పరంధామయ్య తనకు కావలసిన పదార్థాలు అడుగుతూ ఉండగా అనసూయ వెటకారం చేస్తుంది. ఇంట్లో వాళ్లంతా సంతోషంగా కనిపిస్తారు. వెంటనే తులసి ప్రేమ్ (pream)కోసం డబ్బులు ఇవ్వడానికి శృతి(shruthi)కి ఫోన్ చేస్తుంది. దాంతో శృతి బాగా సంతోషపడుతుంది. అప్పుడే తులసి ఫోన్ కి డబ్బులు పోయాయి అని మరో మెసేజ్ వస్తుంది.
దాంతో తులసి (tulasi)తో పాటు అందరూ షాక్ అవుతారు. తులసి నిజం తెలుసుకోవటానికి పై అధికారికి ఫోన్ చేసి మాట్లాడటం తో అని చెప్పిన మాటలు బట్టి తాము మోసపోయామని తెలుసుకుంటారు. అందరూ బాధపడుతూ ఉంటారు. మరోవైపు లాస్య తెగ సంతోషంగా కనిపిస్తుంది.