MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Intinti Gruhalakshmi: తులసిగా మారడానికి ఇష్టపడుతున్న లాస్య.. సంతోషంలో తులసి కుటుంబం

Intinti Gruhalakshmi: తులసిగా మారడానికి ఇష్టపడుతున్న లాస్య.. సంతోషంలో తులసి కుటుంబం

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు జనవరి 16వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం. 

3 Min read
Author : Navya G
Published : Jan 16 2023, 11:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్లో నందు నీళ్లు తాగుతూ ఉండగా ఇంతలో లాస్య అక్కడికి వచ్చి అర్జెంటుగా నేను ఉత్తమ ఇల్లాలుగా మారాలి అనడంతో నందుకి పొలమారుతుంది. ఏమన్నావు అని నందు అనగా ఉత్తమ ఇల్లాలుగా మారాలి అర్జెంటుగా షార్ట్ కట్స్ ఏమైనా ఉంటే చెప్పు నందు అని అంటుంది. ఎందుకు ఇప్పుడు అంత అవసరం ఏమి వచ్చింది అనగా కారణాలు చెప్తే గాని చెప్పవా అని అంటుంది లాస్య. అదేం లేదు అనగా మరి నీ మనసులో ఏముంది ఉత్తమ ఇల్లాలుగా మరి అర్హత నాకు లేదా నాకు చేత కాదా అని అంటుంది. నాకు ఇంట్లో వాళ్ళందరూ నీలాగే దగ్గర అవ్వాలి అంటే ఏం చేయాలి చెప్పు నందు అని అడుగుతుంది లాస్య.
 

26

నందు ఏంటి అలా చూస్తున్నావు అని అడగగా ఏం లేదు సడన్గా ఇలా మారిపోయావేంటని ఆలోచిస్తున్నాను అంటాడు నందు. అది చేయడం అంత ఈజీ కాదు అనగా లాస్య తలుచుకుంటే అన్ని ఈజీనే ఏం చేయాలో చెప్పు అని అందరి సలహా అడగగా అప్పుడు నందు ఉదయం లేచిన దగ్గరనుంచి పడుకునే వరకు ఏం చేయాలో ప్రతి ఒక్కటి వివరిస్తూనే ఉంటాడు. టోటల్ గా తులసిలా మారిపోమంటున్నావు అంతేగా లాస్య అనడంతో అంతే కదా అని అంటాడు నందు. అప్పుడు తులసిలా ఉండాలంటే ఏం చేయాలి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు తులసి లాగా మారాల్సిందేనా అంటూ తులసి కట్టుకున్నట్టుగా చీర కట్టుకొని నడుస్తూ తనకు తాను జడ్జ్ మెంట్ ఇచ్చుకుంటూ ఉంటుంది.

36

మరోవైపు తులసి వంట పూర్తి చేసి అందరూ తినడానికి కిందికి రండి అని పిలవడంతో అదేంటి ఇంట్లో పని చేయాల్సింది నేను కదా అందరికీ వడ్డించి ఉత్తమ ఇల్లాలు అని నేను అనిపించుకోవాల్సింది నేను కదా అని అనుకుంటూ అక్కడికి వెళుతుంది లాస్య. అప్పుడు రా లాస్య తిందువు అని తులసి అనడంతో ఇప్పుడు తులసిని ఎలా కూర్చోబెట్టాలో అనుకుంటూ అక్కడికి వెళుతుంది. నేను కాదు కానీ నువ్వు తులసి అంటూ తన చీర కొంగుతో తులసికి చెమట తుడిచి దొంగ నాటకాలు ఆడుతూ కూర్చోమని చెబుతుంది. అప్పుడు లాస్య అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. అందరూ భోజనం చేస్తూ ఉండగా ఇంతలోనే లాస్య నందు దగ్గరికి వెళ్లి సాంబార్ వడ్డిస్తాను అని వెళ్లి నందు మీద సాంబార్ పోస్తుంది. దాంతో అందరూ నవ్వుకుంటూ ఉంటారు.
 

46

అప్పుడు లాస్య కాసేపు కూర్చోవాల్సిందే కదా నందు అనడంతో నువ్వు నా మీద పన్నీరు చదవలేదు సాంబార్ చల్లావు అని అంటాడు. అదేంటి నందు నేను ఉత్తమ ఇల్లాలు అవుతాను అంటే నువ్వే అడ్డుపడుతున్నావు అని అనగా ముందు ఫ్రీగా ఉండడం నేర్చుకొని తర్వాత ఉత్తమ ఇల్లాలు అవుదువు అని చెప్పి నందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు సామ్రాట్,తులసి పని చేసుకుంటూ ఉండగా అప్పుడు తులసి ఉన్నఫలంగా నవ్వడంతో ఏం జరిగింది అని అడగగా తులసి జరిగింది మొత్తం వివరించి నవ్వుతూ ఉంటుంది. అప్పుడు సామ్రాట్ కూడా నవ్వుతూ ఉంటాడు. అప్పుడు తులసీ తన పిల్లల గురించి ఆలోచిస్తూ అందరిని ఏదో ఒక ప్రొఫెషన్ లో బిజీ బిజీగా ఉండేలా చేయాలి నందగోపాల్ గారి పరిస్థితి కూడా బాగోలేదు.
 

56

అనగా ఆ బాధ్యత కూడా మీదేనా అనే అడగడంతో నాదే అని అంటుంది తులసి. ఇక రెండవ లక్షం అత్తయ్య మామయ్యలను బాగా చూసుకోవాలి లాస్యకు అప్పగిస్తే వాళ్ళకి నరకం చూపించింది అని అంటుంది తులసి. మూడవ లక్షం ఏంటి అని సామ్రాట్ అడగగా దివ్య పెళ్లి అని అంటుంది. అప్పుడు దివ్య పెళ్లి చేయడానికి ఒక మార్గం ఉంది వచ్చే అమెరికన్ ప్రాజెక్టుకి మిమ్మల్ని ఇన్చార్జిగా నియమిస్తున్నాను అనగా నాకు ఇంగ్లీషు రాదు కదా అనడంతో రెండు నెలలు టైం ఉంది ఆలోపు మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి అని అంటాడు సామ్రాట్. అప్పుడు తులసి ఎంత చెప్పిన వినిపించుకోకుండా ఆర్డర్ వేసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు సామ్రాట్. మరొకవైపు అనసూయ కాలి నొప్పితో అల్లాడుతూ తులసిని పిలవగా తులసి లేదు అంటారు. ఇప్పుడు అనసూయ , పరంధామయ్య  మాటలు విన్న లాస్య నేను మీ కాలికి మర్దన చేస్తాను అత్తయ్య అని అక్కడికి వస్తుంది. అప్పుడు లాస్య కొంచెం తింగరిగా మాట్లాడడంతో వద్దులే తల్లి వెళ్లి పని చేసుకోమని అంటుంది.

66

అప్పుడు లాస్య మార్కులు కొట్టేయడానికి అనసూయ వద్దని చెప్పిన వినిపించుకోకుండా కాలికి మర్దన చేయాలని చూస్తుంది. అప్పుడు ఇంతకుముందు ఎవరికైనా మర్దన చేసావా అని అనసూయ అడగగా మా కుక్కపిల్లకి చేశాను అనడంతో ఇంతలో అభి, ప్రేమ్ వాళ్ళు అక్కడికి వచ్చి సెటైర్లు వేస్తూ ఉంటారు. అప్పుడు లాస్య కాళ్ళు గట్టిగా నొక్కుడంతో అనసూయ గట్టిగా అరుస్తుంది. అప్పుడు ప్లీజ్ అత్తయ్య ఏం కాదు కాసేపు ఓర్చుకోండి నాకు వద్దు తల్లి అని ఏడుస్తూ ఉంటుంది అనసూయ. అప్పుడు అంకిత మెల్లగా మర్దన చేస్తూ ఉంటుంది.  అప్పుడు పరంధామయ్య అమ్మ లాస్య తులసి కంటే గొప్ప ఇల్లాలు అనిపించుకోవడానికి మా మీద ప్రయోగాలు చేయొద్దు అసలే మావి ముసలి ప్రాణాలు అంటాడు. తర్వాత తులసి ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనే బుక్ ని కొనడానికి బుక్స్టాల్ దగ్గరికి వెళ్తుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
NTR: చిరంజీవి ఇచ్చిన అవార్డుని రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్‌, భారీ ఈవెంట్‌లో సంచలన నిర్ణయం.. మెగాస్టార్‌ ఫిదా
Recommended image2
Chiraiya Series: 'చిరాయ'లో శోభనం రాత్రి సీన్.. నటిస్తూ కుప్పకూలిన నటుడు!
Recommended image3
Singer Sujatha Mohan: ఐదేళ్లుగా ఒక్క పాట కూడా పాడలేదు.. స్టేజ్ పైనే ఏడ్చేసిన సింగర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved