- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: కష్టాల్లో తులసి.. కొట్టేసిన డబ్బుతో కొత్త ఆఫీస్ తీసుకున్న లాస్య, నందు!
Intinti Gruhalakshmi: కష్టాల్లో తులసి.. కొట్టేసిన డబ్బుతో కొత్త ఆఫీస్ తీసుకున్న లాస్య, నందు!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalashmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టు కుంటుంది. ఇక ఈరోజు జూన్ 29 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో తులసి రంజిత్ కోసం వెతుకుతూ ఉంటుంది. మరొకవైపు భాగ్య లాస్యతో తులసి ఒక గురించి తక్కువ అంచనా వేయొద్దు అని లాస్య ను మరింత రెచ్చగొడుతుంది. ఒకవేళ ఇలా అయినా రంజిత్ అనే అతడిని పట్టుకుంటే మొత్తం బయట పడుతుంది అని చెప్పడంతో అప్పుడు లాస్య కాస్త టెన్షన్ పడుతుంది.
అప్పుడు లాస్య రంజిత్ చెప్పకుండా చేస్తాను కానీ చెబితే ఇంకొక వ్యక్తి చెప్పే వాళ్ళు ఉన్నారు అది ఎవరో కాదు నువ్వే అనడంతో భాగ్య షాక్ అవుతుంది. ఆ తర్వాత లాస్య బ్యాంక్ మేనేజర్ కి ఫోన్ చేసి కాస్త గొంతు మార్చినట్టుగా మాట్లాడి తులసి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టింది అని చెప్పి వారికి కంప్లైంట్ ఇస్తుంది. తులసి రంజిత్ అడ్రస్ కోసం వెతుకుతూ ఉండగా అప్పుడే రంజిత్ అటుగా వెళ్లడంతో తులసి అక్కడికి వెళ్లి చూసేసరికి రంజిత్ ఇంటికి తాళం వేసి ఉంటుంది.
ఆ తర్వాత లాస్య ఫోన్ చేయడంతో బ్యాంకు మేనేజర్లు తులసి ఇంటికి వెళ్లి తులసి గురించి ఎంక్వయిరీ చేస్తూ తులసి ఫేక్ డాక్యుమెంట్ పెట్టారు అని అది క్రైమ్ కిందికి వస్తుంది అని అనటంతో అప్పుడు వెంటనే అంకిత వాళ్లతో తన అత్తయ్య అలాంటిది కాదని తులసి గురించి గొప్పగా చెబుతుంది. కానీ బ్యాంకు వాళ్లు అవి ఏమీ పట్టించుకోకుండా లోన్ డబ్బులు కట్టాలి అని దబాయించడంతో అప్పుడు అంకిత ఆఫ్ట్రాల్ 20 లక్షల కోసం అంతలా చేయొద్దు అంటూ తన కోట్ల ఆస్తిని షూరిటీఇస్తుంది.
పరంధామయ్య వాళ్ళు ఎంత చెప్పినా వినిపించుకోకుండా వద్దన్నా కూడా షూరిటీ సంతకం చేస్తుంది. ఇక బ్యాంకు వాళ్లు వెళ్లగానే ఇంతలో అక్కడికి తులసి వస్తుంది. అప్పుడు తులసి ఏం జరిగింది అని అనగా బ్యాంక్ అధికారులు వచ్చారు అని అంకిత చెబుతుంది. ఆ తర్వాత తులసి షాక్ అయ్యి భయపడుతూ వుండడంతో అప్పుడు అంకిత ఏమి కాదు అని లేదని చెబుతుంది.
మరొకవైపు నందు లాస్య, డబ్బులు తీసుకొని కంపెనీలో పెట్టుబడి ఇవ్వడానికి వెళ్తారు. ఇక అప్పుడు సైన్ చేయడానికి ఈరోజు మంచిగా లేదు ఎల్లుండి వచ్చి సైన్ చేయమని అనడంతో నందు కూడా ఓకే అని అంటాడు. అతని దగ్గర డబ్బులు పెట్టి వెళ్లిపోతారు. ఆ తర్వాత రంజిత్ లాస్యకి ఫోన్ చేసి తులసికి తన కోడలు అంకిత షూరిటీ సంతకం పెట్టింది అని చెబుతాడు.
అప్పుడు లాస్య వెంటనే ఆ విషయాన్ని గాయత్రీ చెబుతుంది. ఆ తర్వాత అంకిత వచ్చి డబ్బులు ఇస్తాను అని అనగా తులసి మాత్రం వద్దు అని అంటుంది. రేపటి ఎపిసోడ్ లో గాయత్రి వచ్చి షూరిటి సంతకం విషయంలో నానా గొడవ చేస్తుంది. అప్పుడు తులసి కి అసలు విషయం తెలియడంతో షాక్ అవుతుంది.