- Home
- Entertainment
- Intinti gruhalakshmi: అభిని రెచ్చగొట్టిన లాస్య.. భూమిపూజకు జరగకుండా షాకింగ్ ప్లాన్!
Intinti gruhalakshmi: అభిని రెచ్చగొట్టిన లాస్య.. భూమిపూజకు జరగకుండా షాకింగ్ ప్లాన్!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఆగష్టు 27వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... ప్రేమ్ శృతి లు వాళ్ల గదిలో పడుకుంటున్నప్పుడు ప్రేమ్, అన్నయ్య అలా అనడం చూసి చాలా బాధేసింది అని అంటాడు. అప్పుడు శృతి ఈ ఇంట్లో అబ్బాయిలందరూ అంతే అమ్మాయిలు మీద అరుచుకుపడతారు మేము అమాయకులం కాబట్టి సర్దుకొని వస్తున్నాము లేకపోతే ప్రతి చిన్న విషయానికి మమ్మల్ని ఏడిపించేవారు అని అమాయకురాల్ల అంటుంది.అప్పుడు ప్రేమ్ ఎంత అమాయకంగా నటిస్తున్నావు అని అంటాడు.
నన్ను తిడుతున్నావా అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని బెదిరిస్తుంది శృతి. అమ్మ తల్లి వద్దమ్మా ఏమైనా తప్పు చేస్తే క్షమించు అని దండం పెట్టి పడుకుండిపోతాడు ప్రేమ్. శృతి కూడా పడుకుంటుంది. ఆ తర్వాత రోజు ఉదయం సామ్రాట్ హనీని లేపుతాడు అప్పుడు హనీ నేను ముందే లేచిపోయాను నాన్న నువ్వు లేపుతున్నావని ఎదురు చూశాను అని అంటుంది. ఈరోజు పూజ ఉంది అని అంటాడు సామ్రాట్ అవును ఈరోజు పూజ ఉందని నాకు తులసి ఆంటీ నాకు చెప్పారు నాకు డ్రెస్ కూడా సెలెక్ట్ చేశారు అని అంటుంది.
అప్పుడు వెళ్లి బ్రష్, స్నానం కూడా మీ తులసి ఆంటీని చేయంపించమనొచ్చు కదా అని సామ్రాట్ అనగా కుళ్ళుకోవద్దు నాన్న అని నవ్వుతూ అంటుంది హనీ. ఆ తర్వాత ఇద్దరూ రెడీ అవుతారు రెడీ అయి హనీ ఆకలేస్తుంది నేను తింటాను అని అంటుంది. ఆ తర్వాత సీన్లో తులసి,తులసి కోటకు పూజ చేస్తూ ఈరోజు భూమి పూజ అమ్మ.అంతా మంచే జరిగేటట్టు చెయ్యు, నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను. ఇలాగే కొనసాగాలని నీ దీవెనలు నాకు ఇవ్వు అని అంటుంది. అదే సమయంలో లాస్య అభికి ఫోన్ చేస్తుంది. మీ అమ్మ ఏం చేస్తుంది అని అనగా ఇలాగా భూమి పూజ బాగా జరగాలని దేవుని ప్రార్థిస్తుంది అని అంటాడు.
అలా జరగకూడదు అభి నువ్వు ఊహించుకో పూజలో మీ అమ్మ, సామ్రాట్ పక్క పక్కన కూర్చుని దంపతుల్లా ఉంటారు. అది జరగక ముందే మనమే భూమి పూజ ని ఆపాలి అని అంటాది. అప్పుడు లాస్య ఒక ప్లాన్ చెప్తుంది దానికి అభి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఫోన్ పెట్టేస్తారు.అంతటిలో నందు అక్కడికి వచ్చి భూమి పూజకి బయలుదేరాలి అలాగే సామ్రాట్ గారేమో ఫైల్స్ తెమ్మన్నారు అవి కూడా చేయాలి అని అంటాడు. ఇంతట్లో ఒకవేళ భూమిపూజ జరగకపోతే ఏం చేస్తావు నందు అని అంటుంది లాస్య. జరగకపోవడమేంటి అని తెలియనట్టు అంటాడు నందు.
నేను అది జరగకుండా చేస్తాను అని లాస్య మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో శృతి తలకు స్నానం చేసి తలను ఆరబెట్టుకుంటున్నప్పుడు ప్రేమ్ లెగుస్తాడు. అలా చూస్తూ ఉండిపోతాడు. అప్పుడు ప్రేమ్ అంతరాత్మ మీ ఇద్దరు గొడవలు మధ్య నేను నలిగిపోతున్న, వెళ్లి శృతిని అడ్డుకుంటాను అని వెళ్తాడు. అప్పుడు ప్రేమ్ వెళ్లదు అని గట్టిగా అరుస్తాడు ఇంతట్లో శృతి. తిరిగి చూసి ఏమైంది అని అంటాది. ఏం లేదు పూజకి వెళ్లి రెడీ అవ్వు ఫాస్టుగా అని అనగా నేను రెడీ అయ్యాను నువ్వే నిద్ర మా లోకం లాగా ఇప్పటికి వచ్చి రెడీ అవ్వలేదు అని శృతి తిడుతుంది. ఆ తర్వాత సీన్లో సామ్రాట్ హనీలు పూజా కార్యక్రమం దగ్గరికి వస్తారు. కొంచెం సేపు తర్వాత తులసి అక్కడికి వస్తుంది.
హనీ వెంటనే తులసి దగ్గరికి వెళ్తుంది. తులసి కూడా హనీ ని దగ్గరకు తీసుకుంటుంది. ఇంతట్లో లాస్య అక్కడికి వచ్చి నువ్వు లేటుగా రావడానికి గెస్టువు కాదు తులసి, హోస్ట్ వి అని అంటుంది. ఇంతలో డెకరేషన్ చాలా బాగున్నాయి మీ పెళ్లికూడా ఇలాగే చేస్తారేమో అని లాస్య అనగా తులసి చాలా కోపంగా చూస్తుంది. అక్కడున్న వాళ్లు కూడా కోపంగా చూస్తారు. ఇంతటిలో, మీకు కూడా రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉన్నది కదా మీ పెళ్లి జరిగినట్టయితే ఇలాగే చేస్తారు అని సామ్రాట్ ని అంటుంది లాస్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురుచూడాల్సిందే!