- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: లాస్య నకిలీ డాక్యుమెంట్స్ ప్లాన్.. రూ.20 లక్షలు పోగుట్టుకున్న తులసి?
Intinti Gruhalakshmi: లాస్య నకిలీ డాక్యుమెంట్స్ ప్లాన్.. రూ.20 లక్షలు పోగుట్టుకున్న తులసి?
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalashmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టు కుంటుంది. ఇక ఈరోజు జూన్ 23 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో తులసి (tulasi)సంగీతం నేర్చుకునే పిల్లల కోసం షెడ్ ను ఏర్పాటు చేస్తూ ఉండగా ఇంతలో కుటుంబ సభ్యులు వచ్చి తులసికి సహాయం చేస్తారు. అప్పుడే ఇద్దరూ అధికారులు అక్కడికి లోన్ ఇవ్వటం కోసం వస్తారు. ఇక ఆ అధికారులు ఎలా అయినా తులసికి లోన్ ఇవ్వాలి అని అనుకుంటూ ఉండగా మధ్యలో పరంధామయ్య అంకిత(ankitha)లు వరుసగా ప్రశ్నలు వేస్తారు.
ఈసారి వచ్చేటప్పుడు వీరు లేనప్పుడు రావాలి అని అధికారులు ఇద్దరు మనసులో అనుకుంటారు. ఇక తులసి(tulasi)లోన్ వస్తుంది అని సంతోషపడుతూ అంతేకాకుండా అందులో 5 లక్షల రూపాయలు ప్రేమ్ కు ఇవ్వాలి అని అనుకుంటుంది. మరొకవైపు ప్రేమ్(pream) సంతోషంగా కనిపిస్తూ ఉంటాడు.
మీ ఫ్రెండ్ డబ్బులు ఇస్తుంది అన్నావ్ కదా ఫోన్ చేసి అడుగు అని అనగా శృతి (shruthi)టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలోనే తులసి శృతికి ఫోన్ చేసి ప్రేమ్ కి ఐదు లక్షలు తాను ఇస్తాను అని చెప్పడంతో శృతి ఆశ్చర్యపోతుంది. అప్పుడు శృతి,తులసి(tulasi) పేరు చెప్పకుండా ఫ్రెండ్ డబ్బులు ఇస్తుంది అనడంతో ప్రేమ్ సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు.
మరొకవైపు అభి(abhi), గాయత్రి ఇద్దరూ అంకిత గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అభి అంకిత నన్ను అక్కడికి రమ్మంటుంది అని అనడంతో గాయత్రీ అలా ఎలా వెళ్తావ్ అభి అని అనగా మీ మాటలు అంకుల్ వింటాడు కదా అని అనడంతో గాయత్రీ (gayathtri)మౌనంగా ఉంటుంది. మరొకవైపు లోన్ అధికారితో లాస్య ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది.
ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి తులసి(tulasi)ని పెద్ద కష్టంలో పడేలా చేస్తుంది లాస్య. తులసి ఇక నీ పని అయిపోయింది అని సంతోష పడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆ లోన్ అధికారులు వచ్చి తులసికి మాయమాటలు చెప్పి తులసితో సైన్ చేయిస్తారు. ఆ తర్వాత ఏ అకౌంట్లో 20 లక్షలు వచ్చాయి అని చెప్పడంతో తులసి సంతోష పడుతూ ఉంటుంది.
అప్పుడే ఆ డబ్బులు పోయాయి అని అంకిత(ankitha)మెసేజ్ చూసి చదవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఫేక్ డాక్యుమెంట్ పైన ఆంటీ సైన్ చేసింది అని కేసు తిరిగి పెట్టాలి అంటే మనకు ఎదురుదెబ్బ తగులుతుంది అంకిత అనడంతో తులసి (tulasi)బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు లాస్య ఆనంద పడుతూ ఉంటుంది.