- Home
- Entertainment
- Intinti Gruhalashmi: ప్రేమ్, శృతిల మధ్య గొడవ.. లాస్య కొడుకును షికారుకు తీసుకెళ్లిన నందు!
Intinti Gruhalashmi: ప్రేమ్, శృతిల మధ్య గొడవ.. లాస్య కొడుకును షికారుకు తీసుకెళ్లిన నందు!
Intinti Gruhalashmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalashmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టు కుంటుంది. ఇక ఈరోజు జూన్ 14 వ తేది ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే.. పిల్లల గురించి బాధపడుతుంది.. ప్రేమ్ ఎదుగుతాడు అనుకుంటే బతకడానికి కష్టపడుతున్నాడు.. అభిని అత్తారింటికి పంపిస్తే వాడి ఉద్యోగం గురించి ఆలోచించకుండా డబ్బు గురించి ఆలోచిస్తున్నాడు.. దివ్య చూస్తే ఎప్పుడు దిగులుపడుతుంది అంటూ ఫీల్ అవుతుంది. అప్పుడే అత్తమామలు ఇద్దరు దైర్యం చెప్తారు.
రేపు ఎక్కడికైనా బయటకు వెళదాం అని తులసి అంటుంది. అప్పుడు దివ్య మాల్ కు వెళదాం అని అంటుంది.. మరోవైపు లాస్య కొడుకు కూడా ఒకవైపు కూర్చొని ఫీల్ అవుతూ ఉంటాడు.. నందు వచ్చి ఏమైంది అని అడగకపోవడంతో లక్కీనే మాట్లాడిస్తాడు.. ఏమైంది అని లక్కీని అడిగితే బయటకు తీసుకువెళ్ళమంటే అమ్మ బిజీ అంటుంది అని ఫీల్ అవుతాడు.
సరే చెప్పు ఎక్కడికి వెళదాం అని నందు అంటే నీకు ఎం పని పాట లేదా అంటడు. ఆతర్వాత అడిగితే నీకు ఉద్యోగం సద్యోగం లేదా అంటడు.. కొన్ని రోజుల్లో బిజినెస్ ఓపెన్ చేస్తున్నట్టు చెప్తాడు. ఆతర్వాత బయటకు వెళ్లడానికి ఇష్టం లేదు అంటూనే ఇంకో ఛాన్స్ కూడా లేదు అని నందుతో ఒప్పుకుంటాడు. డాడీ అని పిలిచేవి ఉండవు అని చెప్పేస్తాడు.
ఇక మరో సీన్ లో ప్రేమ్ ఇంటి బయట ఆలోచిస్తూ కూర్చుంటాడు.. అప్పుడే శృతి ఇంట్లోకి వస్తుంది.. ఆంటీ చెప్పినట్టు ఈరోజు ఎలా అయినా సరే ప్రేమ్ కు నేను పని మనిషిగా చేస్తున్న విషయం చెప్పాలి అని అనుకుంటుంది. ఇక అతన్ని పోయి మాట్లాడితే నాపై ఎవరికి నమ్మకం లేదు అంటూ ఫీల్ అవుతాడు.. శృతి దైర్యం చెప్తుంది.
అప్పుడే శృతికి ప్రేమ్ ఒక విషయం చెప్తాడు.. ఎవరో వాళ్ళ ఫ్రెండ్ కు కొత్తగా పెళ్లి అయ్యిందని.. ఆర్ధిక కష్టాల వల్ల అతని భార్య పనిమనిషిగా చేసిందని చెప్తాడు. అలా నిజం దాచడం తప్పు కదా అని వాదిస్తాడు.. ఆమ్మో నేను చెప్పలేదు అని గాలి పీల్చుకుంటుంది. ఇక తర్వాత సీన్ లో తులసి ఫ్యామిలి మాల్ కు వస్తారు. అక్కడ కాశ్మీర్ ట్రిప్ ఉంటుంది ఫామ్ ఫీల్ చెయ్యమని చెప్తారు.
ఆతర్వాత మాల్ లో ఎంత సీన్ చెయ్యాలో అంత సీన్ చేస్తారు. మరోవైపు ప్రేమ్, శృతి కూడా అదే మాల్ కు వస్తారు. అక్కడ వాళ్ళు ఎంజాయ్ చెయ్యడానికి వస్తారు.. అప్పుడే ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇక తర్వాత ఎపిసోడ్ లో తులసి లక్కీతో ఆడుకుంటున్న సమయంలో లాస్య వచ్చి మళ్ళీ గొడవ పెట్టుకుంటుంది. మరి రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.