MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Lakshmi Manchu: మా నాన్న ఎందుకు బతికాడు, మిగిలినవాళ్లు ఎందుకు చనిపోయారు.. మంచు లక్ష్మి బోల్డ్ రియాక్షన్‌

Lakshmi Manchu: మా నాన్న ఎందుకు బతికాడు, మిగిలినవాళ్లు ఎందుకు చనిపోయారు.. మంచు లక్ష్మి బోల్డ్ రియాక్షన్‌

మంచు లక్ష్మి తండ్రి మోహన్‌ బాబుకి జరిగిన బాంబ్‌ బ్లాస్ట్ సంఘటన గురించి ఓపెన్‌ అయ్యారు. ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, బోల్డ్ కామెంట్‌ చేశారు. ఎమోషనల్‌ అయ్యారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 07 2026, 10:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
విలక్షణ నటుడిగా ఎదిగిన మోహన్‌ బాబు
Image Credit : Asianet News

విలక్షణ నటుడిగా ఎదిగిన మోహన్‌ బాబు

మోహన్‌బాబు కెరీర్‌లో చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి, చాలా అవమానాలున్నాయి. ఆయన చిన్న చిన్న పాత్రలు చేస్తూ, విలన్‌గా చేసి, ఆ తర్వాత హీరో అయ్యారు, అట్నుంచి విలన్‌గా టర్న్ తీసుకున్నారు, మళ్లీ హీరోగా చేశారు. విలక్షణ నటనకు కేరాఫ్‌ మోహన్‌ బాబు. కలెక్షన్‌ కింగ్‌గా పేరు తెచ్చుకుని టాలీవుడ్‌లో టాప్‌ హీరోగా ఎదిగారు. 500లకుపైగా సినిమాలు చేశారు. ఇప్పుడు చాలా సెలక్టీవ్‌గా మూవీస్‌ చేస్తున్నారు. మళ్లీ విలన్‌గానూ మారుతున్నారు. నాని `పారడైజ్‌`లో విలన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
శ్రీరాములయ్య సినిమా ఓపెనింగ్‌ రోజు బాంబ్‌ బ్లాస్ట్
Image Credit : Asianet News

శ్రీరాములయ్య సినిమా ఓపెనింగ్‌ రోజు బాంబ్‌ బ్లాస్ట్

ఈ క్రమంలో మోహన్‌ బాబు గురించి షాకింగ్‌ విషయాన్ని పంచుకుంది ఆయన కూతురు మంచు లక్ష్మి. తండ్రి మోహన్‌ బాబుకి జరిగిన సంఘటన గురించి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. బోల్డ్ కామెంట్స్ చేసింది. 1997లో `శ్రీరాములయ్య` సినిమా ఓపెనింగ్‌ సమయంలో బాంబ్‌ బ్లాస్ట్ జరిగింది.  ఈసినిమాని అప్పటి నాయకుడు పరిటాల రవి తండ్రి పరిటాల శ్రీరాములు జీవితం ఆధారంగా రూపొంచారు. ఎన్‌ శంకర్‌ దర్శకుడు. ఈ సినిమా ఓపెనింగ్‌ రామానాయుడు స్టూడియోలో జరిగింది. దీనికి గెస్ట్ గా పరిటాల రవి హాజరయ్యారు. ఓపెనింగ్‌ జరిగాకా పరిటాల రవి, మోహన్‌ బాబు ఒకే కారులో బయలుదేరారు. ముందు వెనకా కార్లల్లో వారి మనుషులు, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు.

35
తండ్రికి బాంబ్‌ బ్లాస్ట్ పై లక్ష్మి మంచు రియాక్షన్‌
Image Credit : youtube/@RajaRaveendarTalks

తండ్రికి బాంబ్‌ బ్లాస్ట్ పై లక్ష్మి మంచు రియాక్షన్‌

రామానాయుడు గేట్‌ దాటగానే బాంబ్‌ బ్లాస్ట్ అయ్యింది. ముందు కారులో ఉన్న వారంతా చనిపోయారు, వెనకాల కారులో ఉన్న వాళ్లంతా చనిపోయారు. మిడిల్‌ కారులో పరిటాల రవి, మోహన్‌ బాబు ఉన్నారు. వీరి కారులో ఉన్న గన్‌మెన్స్ కూడా చనిపోయారు. పరిటాల రవికి గాయాలయ్యాయి. మోహన్‌ బాబుకి చిన్నపాటి గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన గురించి తాజాగా మంచు లక్ష్మి ఓపెన్‌ అయ్యింది. నటుడు రాజా రవీంద్రతో చేసిన పాడ్‌ కాస్ట్ ఇంటర్వ్యూలో ఆమె స్పందించింది. ఈ సంఘటన గురించి చెప్పాలని, ఈ వార్త తెలిసినప్పుడు మీ రియాక్షన్‌ ఏంటని ఆయన ప్రశ్నించారు.

45
నాన్న ఎందుకు బతికారు, వాళ్లు ఎందుకు చనిపోయారు
Image Credit : youtube/@RajaRaveendarTalks

నాన్న ఎందుకు బతికారు, వాళ్లు ఎందుకు చనిపోయారు

దీనికి మంచు లక్ష్మి రియాక్ట్ అవుతూ, ఆ సమయంలో తనకు ఫోన్‌ వచ్చిందట. ఎక్కడ ఉన్నావ్‌ లక్ష్మి, డాడీకి బాంబ్‌ బ్లాస్ట్ అయ్యింది. ఆసుపత్రిలో జాయిన్‌ అయినట్టుంది. అన్నపూర్ణ స్టూడియో వరకు వినిపించిందని అన్నారట. అప్పుడు తనకు ఏం అర్థం కాలేదట. `మా నాన్న ఎందుకు బతికారు, వీళ్లు ఎందుకు చనిపోయారు. మా నాన్న బతుకుతారా? లేదా? ఆయన ముందున్న కారులో అందరు చనిపోయారు. వెనకున్న కారులో అందరు చనిపోయారు. ఆయనున్న కారులో వెనకాల బాడీ గార్డ్స్ చనిపోయారు, దేవుడు వచ్చి ఒక కవచం వేసినట్టే జరిగింది` అంటూ భావోద్వేగానికి గురయ్యారు మంచు లక్ష్మి. తాజాగా విడుదలైన ఈ ప్రోమో ఆకట్టుకుంటుంది. క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తుంది. ఇందులో మంచు లక్ష్మి తనకు సంబంధించిన అనేక సంఘటనలు, ఇంట్రెస్టింగ్‌ విషయాలను పంచుకున్నారు.

55
సంచలనం సృష్టించిన శ్రీరాములయ్య మూవీ
Image Credit : stockPhoto

సంచలనం సృష్టించిన శ్రీరాములయ్య మూవీ

ఇక `శ్రీ రాములయ్య` మూవీ 1998 ఆగస్ట్ 8న విడుదలైంది. సంచలన విజయం సాధించింది. ఇందులో పరిటాల శ్రీరాములు గా మోహన్‌ బాబు నటించారు. సౌందర్య, హరికృష్ణ, శ్రీహరి వంటి వారు కీలక పాత్ర పోషించారు. వందేమాతరం శ్రీనివాస్‌ సంగీతం అందించారు. ఈ సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. ముఖ్యంగా పాటలు ఉర్రూతలూగించాయి. అప్పట్లో ఇది మూడు గంటల రన్‌ టైమ్‌తో విడుదల కావడం విశేషం. ఈ సినిమాని చూసేందుకు గ్రామాల నుంచి జనం ట్రాక్టర్లు, ఎండ్ల బండ్లపై థియేటర్ కి వెళ్లడం విశేషం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RC17: ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ తో డీల్ కుదర్లేదా ? సుకుమార్, రామ్ చరణ్‌ మూవీ కోసం అనిరుధ్
Recommended image2
Rashmi Gautam: రష్మి గౌతమ్‌ నవరాత్రి స్పెషల్ ఫొటోషూట్..ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోందిగా
Recommended image3
Allu Aravind: పవన్‌ కళ్యాణ్‌ వెండితెరకు పరిచయమై 30ఏళ్లు.. అల్లు అరవింద్‌ ఎమోషనల్‌ నోట్‌
Related Stories
Recommended image1
NTR: చిరంజీవి ఇచ్చిన అవార్డుని రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్‌, భారీ ఈవెంట్‌లో సంచలన నిర్ణయం.. మెగాస్టార్‌ ఫిదా
Recommended image2
Allu Arjun Top 10 Movies: అల్లు అర్జున్‌ బెస్ట్ టాప్‌ 10 మూవీస్‌, లిస్ట్ లోనే లేని పుష్ప 2.. ఇదేం విచిత్రం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved