'సన్నబడ్డావ్ హీరోయిన్ అవుదామనా' విద్యుల్లేఖకు ఎదురైన అవమానాలు
First Published Apr 7, 2021, 9:26 PM IST
సౌత్ ఇండియాలో ఉన్న అతితక్కువ లేడీ కమెడియన్స్ లో విద్యుల్లేఖ రామన్ ఒకరు. తమిళ నటుడు మోహన్ రామన్ కూతురైన విద్యుల్లేఖ చాలా కాలంగా లేడీ కమెడియన్ గా తెలుగు, తమిళ బాషలలో ఎక్కువగా సినిమాలు చేశారు.

బొద్దుగా ఉండే విద్యుల్లేఖ తెలుగు యాక్సెంట్ భలే తమాషా ఉంటుంది. అందుకే కామెడియన్ గా ఆమె బాగా క్లిక్ అయ్యారు. అయితే ఈ మధ్య ఆమె కష్టపడి బరువు తగ్గారు.

సోషల్ మీడియాలో విద్యుల్లేఖ తన వర్క్ అవుట్ వీడియోలు మరియు ఫోటోలు పంచుకునేవారు. అయితే తాను సన్నబడడాన్ని కొందరు ఎగతాళి చేశారని, విద్యుల్లేఖ చెప్పుకొని బాధపడ్డారు.
Vidyullekha

ఆరోగ్య సమస్యల కారణంగా బరువు తగ్గితే కొందరు ఎగతాళిగా మాట్లాడారని విద్యుల్లేఖ ఓ సందర్భంలో చెప్పారు. ఏంటి సన్నబడ్డావు, ఇక కామెడియన్ గా చేయవా, హీరోయిన్ గా మాత్రమే చేస్తావా? అని ఎగతాళి చేశారట.

ఆ మాటలు తనను ఎంతగానో బాధించాయని విద్యుల్లేఖ చెప్పడం జరిగింది. ఇక ఎప్పటి నుండో లీడ్ హీరోయిన్ కామెడీ రోల్ చేయాలని అనుకుంటున్నారట. సంపూర్ణేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న చిత్రంలో తనకు ఆ అవకాశం దక్కినట్లు ఆమె తెలియజేశారు.
