Ramcharan: కాలి రింగు క్లూ, రామ్‌చరణ్ ని చేరింది, ఎడ్వెంచర్ తో ఫిల్మ్ చేయచ్చు
Ramcharan: ఇది ఒక ఇంట్రస్టింగ్ ఎడ్వెంచర్ లాంటి కథ. ఏ కార్టూనే ఫిల్మ్ చేయదగ్గ కంటెంట్ ఉన్న మేటర్. రామ్ చరణ్, ఉపాసనల పెంపుడు చిలుక కుట్టి తప్పిపోయి తిరిగి వారి వద్దకు చేరిన అద్భుత కథ. జంతు ప్రేమికుల కృషి, కుట్టి సాహసం గురించి మరింత తెలుసుకోండి.

Kutti Reunites With Ram Charan and Upasana - An Adventure in telugu
రామ్ చరణ్ కు చెందిన కుట్టి అనే చిలుక తప్పిపోతే, ఉపాసన తన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ పోస్ట్ పెట్టారనే సంగతి తెలిసిందే. జుబ్లీహిల్స్ ఏరియాలోని రోడ్ నెంబర్ 25లో ఆఫ్రికన్ కుట్టి తప్పిపోయిందని..ఎక్కడైనా కనిపిస్తే చెప్పండంటూ పోస్ట్ చేశారు.
కాగా, ఈ పోస్ట్ చూసిన యానిమల్ వారియర్ ఆర్గనైజేషన్ సభ్యులు.. తప్పిపోయి తమకు దొరికిన ఆ చిలుకను రామ్‌చరణ్ దంపతులకు తిరిగి ఇచ్చారు. అయితే వారు ఎలా పట్టుకోగలిగారు అనేది ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. కొందరైతే ఈ కంటెంట్ తో చిన్న షార్ట్ ఫిల్మ్ గా చేయచ్చుగా అని సూచిస్తున్నారు. అసలేం జరిగింది.
Kutti Reunites With Ram Charan and Upasana - An Adventure in telugu
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు పెట్స్ అంటే చాలా ఇష్టం. చరణ్, ఆయన వైఫ్ ఉపాసన ఇంట్లో రకరకాల పక్షులను, జంతువులను పెంచుతుంటారు. వారికి ఇంట్లో కుక్కలు, గుర్రాలుతో పాటు కుట్టి అనే ఆఫ్రికన్ జాతికి చెందిన చిలుక కూడా ఉంది.
దీన్ని చూపిస్తూనే చరణ్ రోజూ తన కూతురికి అన్నం తినిపించడం, ఆడించడం చేసేవారట. అయితే తాజాగా ఆ కుట్టి అనే చిలుక తప్పిపోయింది. ఈ విషయాన్ని ఉపాసన తన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ పోస్ట్ పెట్టారు.
Kutti Reunites With Ram Charan and Upasana - An Adventure in telugu
వారం క్రితం ఈ కుట్టి అనే చిలక తప్పిపోయింది. ఉపాసన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్‌చేయగా ఈ విషయం పలు జంతు ప్రేమికుల గ్రూపుల్లోకి వెళ్లింది. ఏడబ్ల్యూసీఎస్ అనే జంతు ప్రేమిక సంస్థ ఈ చిలుకను గుర్తించింది.
మొదట ఆచూకీ లభించక ఇంటర్నెట్ లో దీనికి సంబంధించి వెతుకుతూ ఉండగా.. ఉపాసన పోస్టును చూశారు. చిలుక కాలి రింగుకు ఉన్న ఐడీ ద్వారా నిర్ధారించుకున్నారు. రామ్ చరణ్ ఇంటికి కుట్టిని తీసుకువెళ్లారు. ఇంటికి వెళ్లగానే రామ్ చరణ్ భుజం మీదకు వెళ్లి వాలింది. దంపతులిద్దరూ ప్రేమతో కుట్టిని దగ్గరకు తీసుకున్నారు. సంస్థ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
Kutti Reunites With Ram Charan and Upasana - An Adventure in telugu
యానిమల్ వారియర్స్ ఆ కుట్టిని ఎలా రెస్య్కూ చేశారనేది తమ సోషల్ మీడియాలో వివరంగా చెప్పారు. ఆఫ్రికన్ గ్రే చిలుక దొరికిందని తమకు ఒక డిస్ట్రెస్ కాల్ వచ్చిందని.. అది ఎవరో ఒకరి పెంపుడు జంతువు అయి ఉంటుందని.. పొరపాటున తప్పించుకుపోయిందని అనుకున్నామన్నారు. వెంటనే కుట్టిని తీసుకెళ్లి పెంపుడు జంతువు సంరక్షణ కేంద్రానికి పంపామని చెప్పారు. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో వెతుకుతుండగా ఉపాసన పోస్ట్‌ను చూసి.. వెంటనే వారి సంప్రదించామన్నారు.
చరణ్, కుట్టి మధ్య బాండింగ్ చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయారు. యానిమల్ వారియర్స్ ఆ కుట్టిని ఎలా రెస్య్కూ చేశారనేది తమ సోషల్ మీడియాలో వివరంగా చెప్పారు. ఈ ఎడ్వంచెర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉందని, చిన్న కార్టూన్ ఫిల్మ్ లాగ చేస్తే చాలా మంది జంతు ప్రేమికులకు ప్రేరణగా ఉంటుందని చెప్తున్నారు.