MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Kushi movie Review: ఖుషి మూవీ ప్రీమియర్ టాక్... విజయ్ దేవరకొండ మూవీ హిట్టా ఫట్టా?

Kushi movie Review: ఖుషి మూవీ ప్రీమియర్ టాక్... విజయ్ దేవరకొండ మూవీ హిట్టా ఫట్టా?

విజయ్ దేవరకొండ-సమంతల రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఖుషి. ఈ చిత్రంపై భారీ హైప్ ఏర్పడింది. సెప్టెంబర్ 1న వరల్డ్ వైడ్ విడుదల కాగా ప్రీమియర్స్ ముగిశాయి. మరి టాక్ ఎలా ఉందో చూద్దాం..   

Sambi Reddy | Published : Sep 01 2023, 03:08 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

గీత గోవిందం వంటి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్స్ తో విజయ్ దేవరకొండకు యూత్ లో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక సమంత ఈ జోనర్లో నటించి చాలా కాలం అవుతుంది. స్టార్ గా ఎదిగిన సమంత లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. గ్యాప్ తర్వాత ఖుషి వంటి లవ్ స్టోరీలో నటించింది. 

 

27
Asianet Image

ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ, సమంత బాగా కష్టపడ్డారు. చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. హైదరాబాద్ వేడుకగా మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించారు. ఇది ట్రెమండస్ సక్సెస్. ఆఫ్ స్క్రీన్ లో విజయ్ దేవరకొండ-సమంత రొమాన్స్ హైలెట్ అయ్యింది. వెరసి ఖుషి మూవీ పట్ల భారీ బజ్ ఏర్పడింది. 

37
Asianet Image

మరి ఖుషి అంచనాలు అందుకోగలిగిందా అంటే... ప్రీమియర్ టాక్ పరిశీలిస్తే సినిమా పర్లేదు అన్నట్లుగా ఉంది. ఈ ఎమోషనల్ లవ్ డ్రామా కొంత మేరకు ఆకట్టుకుందని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ లో ప్రారంభం అంతగా ప్రభావం చూపలేదు. అయితే ఇంటర్వెల్ కి ముందు అరగంట ఆకట్టుకుంది 

 

47
Asianet Image

సెకండాఫ్ పై ఆసక్తి రేపింది. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుందని అంటున్నారు. అలాగే మూవీలో సాంగ్స్ బాగున్నాయని అంటున్నారు. కొందరేమో రొటీన్ లవ్ డ్రామా కొత్తదనం లేదంటున్నారు. విజయ్ దేవరకొండ, సమంత నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. 
 

57
Asianet Image


శివ నిర్వాణ గతంలో మజిలీ వంటి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ నిర్మించాడు. ఈ క్రమంలో ప్రేక్షకులు ఒక ఫీల్ గుడ్ మూవీ ఆశిస్తున్నారు. ఖుషి విషయంలో ఆయన కొంత మేర సక్సెస్ అయ్యాడు. అయితే మజిలీ అంత బలమైన కథ, ఎమోషన్స్ ఖుషిలో లేవన్న మాట వినిపిస్తోంది. 

 

67
Asianet Image

రొమాంటిక్ సన్నివేశాలు బాగున్నాయని ఆడియన్స్ అంటున్నారు. విజయ్ దేవరకొండ, సమంత నటన, సాంగ్స్, బీజీఎమ్ మూవీకి ప్రధాన ఆకర్షణగా చెబుతున్నారు. అదే సమయంలో స్టోరీ రొటీన్ గా ఉంది. అక్కడక్కడా మెప్పించే సన్నివేశాలు మినహాయిస్తే... మూవీ ఆద్యంతం ఆకట్టుకోదని అంటున్నారు. ప్రీమియర్ టాక్ పరిశీలిస్తే ఇలా ఉంది. 
 

77
Asianet Image

ఖుషి చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో విడుదల చేశారు. ఖుషి చిత్రానికి బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ లేదు. పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మంచి వసూళ్లు దక్కుతాయి. రూ. 50 కోట్లకు పైగా ఖుషి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఒక చిత్ర ఫలితం పూర్తి రివ్యూ చూస్తే కానీ తెలియదు. 

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved