- Home
- Entertainment
- కుర్చీ మడతపెట్టి **** మహేష్ బాబుకే రిఫరెన్స్ అయిన ఈ కుర్చీ తాత ఎవరు? మైండ్ బ్లోయింగ్ డిటైల్స్!
కుర్చీ మడతపెట్టి **** మహేష్ బాబుకే రిఫరెన్స్ అయిన ఈ కుర్చీ తాత ఎవరు? మైండ్ బ్లోయింగ్ డిటైల్స్!
కుర్చీ తాతగా పాప్యులర్ అయిన షేక్ అహ్మద్ పాషా కిడ్నాప్ అయ్యాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా గుర్తించిన కుర్చీ తాత మిస్సింగ్ కలకలం రేపింది. ఆయన భార్య కన్నీరు మున్నీరు అయ్యింది. ఈ ఘటనలో ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది.

కృష్ణకాంత్ పార్క్ వద్ద ఉండే షేక్ అహ్మద్ పాషా కుర్చీ తాతగా ఫేమస్. ఈ తాత యాటిట్యూడ్ కా బాప్. ఆ విషయంలో అర్జున్ రెడ్డి అమ్మా మొగుడు. మనోడు మామూలు చెప్పే మాటలు కూడా సినిమా డైలాగ్స్ కి మించి ఉంటాయి.
ఒకసారి అలిగి పుట్టింటికి వెళ్లిన భార్యను తెచ్చుకునేందుకు అత్తారింటికి వెళ్ళాడట షేక్ అహ్మద్ పాషా. బామ్మర్దులు కత్తులు తీసుకుని మీదకు వచ్చారట. పక్కన ఉన్న ఇనుప కుర్చీ మడతపెట్టి కొడితే.. మెడలు ఇరిగి పోయాయట. షేక్ అహ్మద్ పాషా చెప్పిన ఈ మాటలు విపరీతంగా వైరల్ అయ్యాయి.
కుర్చీ మడతపెట్టి దెం*** అనే బూతు పదంతో కూడిన ఈ డైలాగ్ సోషల్ మీడియాను షేక్ చేసింది. తాత ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూల కోసం కుర్చీ తాత వెనుకబడ్డాయి. ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఆయనతో మాట్లాడించేవారు. మంచి బట్టలు కొనిచ్చేవారు.
ఒక్కసారిగా సెలెబ్రిటీ అయిన కుర్చీ తాత... కొందరు పొలిటీషియన్స్ ని దారుణంగా తిట్టాడు. పవన్ కళ్యాణ్, కేసీఆర్, కేటీఆర్ వంటి ప్రముఖులను ఏకిపారేశారు. దాంతో కుర్చీ తాతకు శత్రువులు ఏర్పడ్డారు. అతనికి వార్నింగ్ లు ఇచ్చారు. కొందరు దాడి చేశారు.
కట్ చేస్తే ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు... కుర్చీ తాత రిఫరెన్స్ వాడాడు. ఆయన లేటెస్ట్ మూవీ గుంటూరు కారంలో కుర్చీ తాతను పాప్యులర్ చేసిన 'కుర్చీ మడతబెట్టి' అనే డైలాగ్ సాంగ్ లిరిక్ కి వాడేశాడు. జనవరి 30న విడుదల కానున్న థర్డ్ సింగిల్ లో కుర్చీ తాత డైలాగ్ నేరుగా వాడేశారు. అంత పెద్ద హీరో ఒక సోషల్ మీడియా సెలబ్రిటీ డైలాగ్ తన పాటకు వాడటం ఊహించని పరిణామం.
కాగా కుర్చీ తాత అనూహ్యంగా కిడ్నాప్ అయ్యాడు. వారం రోజులుగా ఆయన మిస్సింగ్. భార్య ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కొట్టినా తిట్టినా నాకు తోడు ఆయనే. కొడుకులు ఉన్నా చూడరు. కూతురు వద్దే ఉంటున్నాను. వారం రోజులుగా ఆయన కనిపించడం లేదని భార్య కన్నీరు మున్నీరు అయ్యింది.
కుర్చీ తాతకు చాలా మంది శత్రువులు ఉన్నారు. దాంతో ఆయన కిడ్నాప్ అయ్యుంటాడని ఆమె భావించారు. కాగా యూట్యూబ్ ఛానల్స్ ఈ విషయం ప్రసారం చేయడంతో ఆయన ఆచూకీ తెలిసింది. కుర్చీ తాతను గుర్తించిన కొందరు వరంగల్ స్టేషన్ లో పడుకున్నట్లు తెలియజేశారట. ఓ యూట్యూబర్ కారులో హైదరాబాద్ కి తీసుకువచ్చాడట.
Mahesh Babu
కుర్చీ తాతకు చాలా మంది శత్రువులు ఉన్నారు. దాంతో ఆయన కిడ్నాప్ అయ్యుంటాడని ఆమె భావించారు. కాగా యూట్యూబ్ ఛానల్స్ ఈ విషయం ప్రసారం చేయడంతో ఆయన ఆచూకీ తెలిసింది. కుర్చీ తాతను గుర్తించిన కొందరు వరంగల్ స్టేషన్ లో పడుకున్నట్లు తెలియజేశారట. ఓ యూట్యూబర్ కారులో హైదరాబాద్ కి తీసుకువచ్చాడట.