కీర్తి భట్ చిల్లరపనికి కుమారీ ఆంటీ హుందా సమాధానం... చదువుకుంటే సరిపోదు!
బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ ఇటీవల కుమారీ ఆంటీ ఫుడ్ బాగోలేదంటూ ఓ వీడియో చేసింది. కీర్తి భట్ వ్యాఖ్యలపై కుమారీ ఆంటీ రియాక్ట్ అయ్యింది. చల్లగా చురకలు అంటించింది.

కుమారీ ఆంటీ పరిచయం అక్కర్లేని పేరు. యూట్యూబర్స్ ఆమెను ఫేమస్ చేశారు. దాంతో విపరీతంగా క్రేజ్ పెరిగింది. ఆమె చేతి వంట రుచి చూసేందుకు వందల మంది కుమారీ ఆంటీ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ వద్దకు రావడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. లా అండ్ ఆర్డర్ సమస్య పేరుతో కుమారీ ఆంటీ స్టాల్ తొలగించారు.
Kumari Aunty
దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. రాజకీయ కక్ష అంటూ రెండు రాష్ట్రాల్లో చర్చ మొదలైంది. దాంతో సీఎం రేవంత్ రెడ్డి కలగజేసుకుని ఆమె దుకాణం పునరుద్దరించేలా చర్యలు తీసుకున్నాడు. ఈ వివాదం ఆమెకు మరింత ఫేమ్ తెచ్చిపెట్టింది.
Keerthi bhat
కాగా సీరియల్ నటి బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ తనకు కాబోయేవాడితో కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ కి వెళ్ళింది. అయితే ఆ రోజు కుమారీ ఆంటీ లేదు. ఫుడ్ టేస్ట్ చేసిన కీర్తి భట్ అసలేం బాగోలేదంటూ వీడియో చేసింది. అసలు జనాలు ఎందుకు ఎగబడి తింటున్నారు. ఫుడ్ అసలు ఏం బాగోలేదు. చికెన్ అయితే ఒకటే కారం అని కీర్తి అన్నారు.
Keerthi bhat
చికెన్ కుమారీ ఆంటీ కంటే నేను చాలా బెటర్ గా చేస్తాను. అసలేం బాగోలేదని కీర్తి వీడియో చేసి సోషల్ మీడియాలో వదిలింది. కాగా కీర్తి భట్ కామెంట్స్ పై కుమారీ ఆంటీ హుందాగా స్పందించింది. ఆమె వచ్చినరోజు నేను ఊరెళ్ళాను. వంట నేను చేయలేదు. మగాళ్లు చేసిన వంటకు ఆడవాళ్లు చేసిన వంటకు తేడా ఉంటుంది కదా.
అయితే కీర్తి భట్ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. నా ఫుడ్ బాగోలేదని అన్నంత మాత్రాన నేను వాళ్ళ గురించి తప్పుగా భావించను. అందరికీ నా ఫుడ్ నచ్చాలని లేదు. కొందరికి నచ్చుతుంది. మరికొందరికి నచ్చదు... అని అన్నారు. కుమారీ ఆంటీ కూల్ గా కీర్తి భట్ కి చురకలు అంటించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
kumari aunty
అలాగే చదువుకున్న కీర్తి కంటే కుమారీ ఆంటీ హుందాగా ప్రవర్తించింది. యూట్యూబ్ వ్యూస్ కోసం కీర్తి భట్ ఒకరి భృతిని దెబ్బ తీసేలా చేసింది. నీకు నచ్చకపోతే వదిలేయాలి. వీడియో తీసి ప్రచారం చేయడం ఏమిటని కీర్తి మీద మండిపడుతున్నారు.