MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్‌ని పెళ్లి చేసుకుంటా.. `ఆదిపురుష్‌` భామ బోల్డ్ కామెంట్.. షాక్‌లో ఫ్యాన్స్

ప్రభాస్‌ని పెళ్లి చేసుకుంటా.. `ఆదిపురుష్‌` భామ బోల్డ్ కామెంట్.. షాక్‌లో ఫ్యాన్స్

కృతి సనన్‌.. ప్రభాస్‌ అభిమానులకు షాకిచ్చింది. తన మనసులో మాటని బయటపెట్టింది. ప్రభాస్‌ని పెళ్లి చేసుకుంటానని నిర్మోహమాటంగా చెప్పేసింది. దీంతో ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినీ వర్గాలు సైతం షాక్‌ అవుతున్నారు. ప్రస్తుతం ఇది ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Aug 21 2021, 12:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

ప్రభాస్‌, కృతి సనన్‌ కలిసి `ఆదిపురుష్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో రాముడిగా ప్రభాస్‌, సీతగా కృతి సనన్‌ నటిస్తున్నారు. ఓం రౌత్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ముంబయిలో ఈ చిత్ర షూటింగ్‌ జరుగుతుంది. 
 

213

వెండితెరపై రాముడు, సీతగా ప్రభాస్‌, కృతి సనన్‌ సందడి చేయబోతున్నారు. ఇండియన్‌ ఆడియెన్స్ కి మంచి కనువిందునివ్వబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. 

313

ఇదిలా ఉంటే ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంది కృతి సనన్‌. ఇటీవల ఆమె నటించిన `మిమి` సినిమా విడుదలైంది.  ఈ నేపథ్యంలో సినిమాకి, అందులో ఆమె పాత్రకి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. గర్భవతిగా కృతి కనిపించి కామెడీని పంచింది. 
 

413

అయితే ఫ్యాన్స్ తో ఛాట్‌లో భాగంగా కృతి ఓ ఆసక్తికర ప్రశ్నని ఎదుర్కొంది. `ప్రభాస్‌, టైగర్‌ ష్రాఫ్‌, కార్తీక్‌ ఆర్యన్` ఈ ముగ్గురు హీరోల్లో మీరు ఎవరితో డేట్‌కి వెళ్తారు, ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారు. ఎవర్నీ ఫ్టర్ట్ చేస్తారని అడిగిన ప్రశ్నకి ఆసక్తికర సమాధానమిచ్చింది. 

513

ఏమాత్రం తడుముకోకుండా ప్రభాస్‌ని పెళ్లి చేసుకుంటానని తెలిపింది. టైగర్‌ ష్రాఫ్‌తో డేటింగ్‌కి వెళ్తుందట. అలాగే కార్తీక్‌ ఆర్యన్‌ని ప్టర్ట్ చేస్తానని చెప్పింది కృతి. ఈ అమ్మడు ఇంత బోల్డ్ గా ఆన్సర్‌ ఇవ్వడంతో నెటిజన్లు, ఆమె అభిమానులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. 

613

ఇక ప్రభాస్‌ ఫ్యాన్స్ షాక్‌కి గురవుతున్నారు. `ఆదిపురుష్‌`లో ప్రభాస్‌తో నటిస్తూ చివరికి ఆయనకే వలేసేలా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి నిజంగానే ప్రభాస్‌ని తన బుట్టలో వేసుకుంటుందా? ప్రభాస్‌ ఆమె కోరికని నెరవేరుస్తాడా? అనే దానిపై ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. 
 

713

రామాయణం ఆధారంగా రూపొందుతున్న `ఆదిపురుష్‌` చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్ట్ 11న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారు. 

813

కృతి సనన్‌ కెరీర్‌ ప్రారంభించింది తెలుగు సినిమాతోనే అనే విషయం తెలిసిందే. ఆమె మహేష్‌బాబుతో `వన్‌ఃనేనొక్కడినే`లో హీరోయిన్‌గా నటించింది. తొలి చిత్రంతోనే ఆకట్టుకుంది. సుకుమార్‌ దీనికి దర్శకుడు. ఈ సినిమా రిజల్ట్ తేడా కొట్టినా,కృతికి మాత్రం బాలీవుడ్‌ లైఫ్‌ ఇచ్చింది. 
 

913

ఆ తర్వాత కొద్ది గ్యాప్‌తో నాగచైతన్యతో `దోచేయ్‌` చిత్రంలో నటించింది కృతి ఈ సినిమా కూడా పరాజయం చెందింది. దీంతో టాలీవుడ్‌కి దూరమైంది. బాలీవుడ్‌పై ఫోకస్‌ పెట్టింది. 

1013

చాలా గ్యాప్‌తో ఇప్పుడు మళ్లీ `ఆదిపురుష్‌`తో రీఎంట్రీ ఇస్తుంది.ఈ చిత్రాన్ని తెలుగు, హిందీలో పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు.
 

1113

దీంతోపాటు ఇటీవల మరోసారి మహేష్‌పై తన ఇంట్రెస్ట్ ని చూపించింది కృతి. ఆయనతో కలిసి మరో సినిమా చేయాలనుందని తెలిపింది. 

1213

మరి ఆ ఛాన్స్ ని మహేష్‌ ఇస్తాడా? కృతి మళ్లీ  తెలుగులో సినిమాలు చేస్తుందా? లేక `ఆదిపురుష్‌`తోనే సరిపెట్టుకుంటుందా? అన్నది చూడాలి. 

1313

ప్రస్తుతం కృతి హిందీలో `హమ్‌ దో హమారే దో`,`బచ్చన్‌ పాండే`,`భేడియా` చిత్రాలో నటిస్తూ బిజీగా ఉంది. బాలీవుడ్‌లో యంగ్‌ హీరోయిన్లలో తనకంటూ ఓ ఇమేజ్‌ని సొంతం చేసుకుని దూసుకుపోతుందీ భామ.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kiara Advani Saree: కియారా కట్టిన చీర, బ్యాగ్ ధర తెలిస్తే షాక్, సిద్ధార్థ్‌తో కలిసి మెరుపులు
Recommended image2
Bhooth Bangla: బట్టలు చింపుకుని ఈవెంట్ వచ్చిన స్టార్ హీరో.. ఇదెక్కడి అరాచకం బాబోయ్, వైరల్
Recommended image3
Rajamouli: రాంచరణ్ సూపర్ హిట్ సినిమాని యావరేజ్ సినిమా అంటూ రాజమౌళి కామెంట్స్.. ఎందుకు అలా అన్నారో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved