MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Chiranjeevi: నా సినిమాని పాడు చేయొద్దు, చిరంజీవికి ఓపెన్ గా వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్.. కట్ చేస్తే

Chiranjeevi: నా సినిమాని పాడు చేయొద్దు, చిరంజీవికి ఓపెన్ గా వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్.. కట్ చేస్తే

తన సినిమాని పాడు చేయొద్దు అని ఓ క్రేజీ డైరెక్టర్ చిరంజీవితో ఓపెన్ గా అన్నారు. చివరికి ఆ చిత్రం నుంచి దర్శకుడు తప్పుకున్నారు. ఆ సినిమా రిజల్ట్ ఏమైందో తెలుసా ? 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 02 2026, 08:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మెగాస్టార్ చిరంజీవి
Image Credit : Chiranjeevi\Twitter

మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి చివరగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో భారీ విజయం అందుకున్నారు. తదుపరి చిరంజీవి నటించిన విశ్వంభర రిలీజ్ కావలసి ఉంది. మరో వైపు బాబీ దర్శకత్వంలో మరో చిత్రం చేయాల్సి ఉంది. చిరంజీవి తన కెరీర్ లో కొన్ని సందేశాత్మక సినిమాలు కూడా చేశారు. వాటిలో ఠాగూర్ మూవీ ఒకటి. ఠాగూర్ మూవీ వెనుక పెద్ద తతంగమే నడించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఠాగూర్ మూవీ నుంచి తప్పుకున్న దర్శకుడు
Image Credit : Chiranjeevi\Twitter

ఠాగూర్ మూవీ నుంచి తప్పుకున్న దర్శకుడు

ముందుగా ఈ చిత్రాన్ని రాజశేఖర్ చేయాలనుకున్నారు. కానీ చిరంజీవి చేతుల్లోకి ఆ చిత్రం వచ్చింది. రమణ అనే చిత్రానికి ఇది రీమేక్. ఒరిజినల్ వెర్షన్ తమిళంలో ఈ చిత్రాన్ని మురుగదాస్ తెరకెక్కించారు. తెలుగు రీమేక్ ని కూడా మురుగదాస్ తెరకెక్కించాల్సింది. చిరంజీవితో విభేదాల వల్ల మురుగదాస్ ఈ మూవీ నుంచి తప్పుకున్నారు. దీనితో ఠాగూర్ తెరకెక్కించే అవకాశం వివి వినాయక్ కి దక్కింది.

35
హీరో చనిపోకూడదు
Image Credit : Asianet News

హీరో చనిపోకూడదు

ఈ చిత్రంలో కమర్షియల్ అంశాలు జోడించడం మురుగదాస్ కి ఇష్టం లేదట. చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. మురుగదాస్ ని ఈ సినిమా చేయమని అడిగాం. తమిళంలో లాగా కాకుండా క్లైమాక్స్ లో హీరో చనిపోకూడదు అని మురుగదాస్ కి సూచించాం. సార్ ఈ సినిమాలో హీరో గొప్ప త్యాగమూర్తి. చనిపోవడమే కరెక్ట్ అని అన్నాడు. నాతో అలా చేస్తే అభిమానులు ఊరుకోరు. నిర్మాత చచ్చిపోతాడు అని చెప్పా.

45
అలా చేస్తే సినిమా పాడైపోతుంది
Image Credit : Asianet News

అలా చేస్తే సినిమా పాడైపోతుంది

అదే విధంగా పాటలు కూడా ఉండాలని చెప్పాం. అలా చేస్తే సినిమా పాడైపోతుంది అని మురుగదాస్ చెప్పాడు. దీనితో మురుగదాస్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు చిరంజీవి పేర్కొన్నారు. కానీ వివి వినాయక్ ఠాగూర్ మూవీలో కమర్షియల్ అంశాలని పర్ఫెక్ట్ గా జోడించి సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేలా చేశారు.

55
ప్రయోగాలు చేయకూడదు
Image Credit : Asianet News

ప్రయోగాలు చేయకూడదు

చిరంజీవి మాట్లాడుతూ.. నా సినిమాల్లో హీరో చనిపోవడం, పాటలు లేకుండా ఉండడం లాటి ప్రయోగాలు చేయకూడదు. ఎందుకంటే హిందీ తర్వాత పెద్ద మార్కెట్ ఉన్నది మనకే. కోట్లాది రూపాయలు, ఎంతో జీవితాలు ఒక సినిమాపై ఆధారపడి ఉంటాయి. ఎమోషనల్ గా ఉండాలి అని ప్రయోగాలు చేస్తే సినిమా పోతుంది. అందుకే ఠాగూర్ మూవీ విషయంలో రిస్క్ చేయదలుచుకోలేదు అని చిరంజీవి అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Panchanama Review: ఉదయభాను నిర్మించిన 'పంచనామా' సిరీస్ రివ్యూ.. ఒక్క క్లూతో కూపీ మొత్తం లాగిన పోలీస్
Recommended image2
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image3
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Related Stories
Recommended image1
Ram Charan Peddi: పెద్దిలో రాంచరణ్ కి ఆ అవయవం ఉండదా.. అభిమానులు ఊరుకుంటారా ?
Recommended image2
Balakrishna: నా కెరీర్ లో పెద్ద రాడ్డు లాంటి సినిమా అదే, ఒప్పుకున్న బాలయ్య..ఇష్టమైన మూవీ కూడా ఫ్లాపే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved