- Home
- Entertainment
- 8 ఫొటోల్లో కృతి సనన్ చెల్లి పెళ్లి వేడుక.. చూడముచ్చటగా వధూవరులు, వైరల్ అవుతున్న దృశ్యాలు
8 ఫొటోల్లో కృతి సనన్ చెల్లి పెళ్లి వేడుక.. చూడముచ్చటగా వధూవరులు, వైరల్ అవుతున్న దృశ్యాలు
కృతి సనన్ చెల్లెలు నూపుర్ సనన్ పెళ్లి పీటలెక్కింది. ఆమె ప్రముఖ సింగర్ స్టెబిన్ బెన్‌ను పెళ్లాడింది. రాజస్థాన్‌లో పెళ్లి వేడుకలు జరిగాయి. ఈ జంట హిందూ సంప్రదాయంలో జరిగిన పెళ్లి ఫొటోలు ఇప్పుడు బయటకొచ్చి వైరల్ అవుతున్నాయి.

నూపుర్ సనన్-స్టెబిన్ బెన్ పెళ్లి
నూపుర్ సనన్-స్టెబిన్ బెన్ రాజస్థాన్‌లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఈ జంట మొదట క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకుని, ఆ తర్వాత ఏడడుగులు నడిచి ఒక్కటయ్యారు.
పెళ్లి ఫొటోలు
నూపుర్ సనన్ తన హిందూ సంప్రదాయ పెళ్లి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఆమె ఒకదాని తర్వాత ఒకటి 10 ఫొటోలు షేర్ చేసింది. 'నువ్వే నా రేపటి ప్రశాంతత, నేటి కృతజ్ఞత. 11.01.2026' అని రాసింది. ఈ ఫొటోలపై బాలీవుడ్ సెలబ్రిటీలు కామెంట్లు చేస్తూ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
చిరునవ్వులు చిందిస్తున్న వధూవరులు
బయటకొచ్చిన వరమాల ఫొటోలో స్టెబిన్ బెన్, నూపుర్ సనన్ ఒకరినొకరు నవ్వుతూ చూసుకుంటున్నారు. ఇద్దరి ముఖాల్లో ఆనందం స్పష్టంగా కనిపిస్తోంది.
అందంగా నుపుర్ సనన్
పెళ్లికి నూపుర్ సనన్ చెర్రీ రెడ్, పీచ్ కలర్ కాంబినేషన్ లెహంగా ధరించింది. తలపై పల్లూ కూడా పెట్టుకుంది. భారీ నగలతో ఆమె చాలా అందంగా కనిపించింది.
సింధూరం
ఈ ఫొటోలో స్టెబిన్ బెన్ తన వధువు నూపుర్ సనన్ పాపిటలో సింధూరం దిద్దుతున్నాడు. ఈ సమయంలో కృతి సనన్ కూడా పక్కనే కనిపించింది.
హిందూ సంప్రదాయంలో..
పెళ్లి వేడుకల్లో స్టెబిన్ బెన్-నూపుర్ సనన్ చాలా సంతోషంగా కనిపించారు. ఈ జంట మొదట వైట్ వెడ్డింగ్ చేసుకుని, తర్వాత హిందూ సంప్రదాయంలో ఏడడుగులు వేశారు.
ఆనందంతో డ్యాన్స్ చేస్తూ
నూపుర్ సనన్ బ్రైడల్ ఎంట్రీ ప్రత్యేకంగా జరిగింది. ఇందులో అక్క కృతి సనన్ ఆమెతో పాటు కనిపించింది. ఈ సమయంలో నూపుర్ ఆనందంతో డ్యాన్స్ చేస్తూ కనిపించింది.
కుటుంబ సభ్యులు
పెళ్లి వేడుకలు పూర్తయ్యాక స్టెబిన్ బెన్-నూపుర్ సనన్ కుటుంబ సభ్యులు వధూవరులను ఆశీర్వదించారు. ఈ సమయంలో నూపుర్-స్టెబిన్ తల్లిదండ్రులు చాలా సంతోషంగా కనిపించారు.

